ETV Bharat / sukhibhava

బ్రేక్​ఫాస్ట్​ తినకపోతే బరువు పెరిగిపోతారు!

మనం రోజూ తీసుకోనే ఆహారంలో ముఖ్యమైంది ఉదయాన్నే తీసుకునే అల్పాహారం. బ్రేక్​ఫాస్ట్​ను స్కిప్​ చేయకుండా​ తీసుకుంటేనే మీరు ఫిట్​గా ఉంటారు. ఒకవేళ మీరు బ్రేక్​ఫాస్ట్​ మిస్​ చేశారంటే.. మీకు తెలియకుండానే బరువు పెరిగిపోతారు. అంతే కాదు, ఉదయం​ తినకపోతే ఇంకెన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

skipping  morning breakfast will lead to put on wight  etv bharat health news in telugu
బ్రేక్​ఫాస్ట్​ తినకపోతే బరువు పెరిగిపోతారు!
author img

By

Published : Jun 22, 2020, 10:20 AM IST

రోజూ మనం తీసుకునే ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఉదయం తీసుకునే 'బ్రేక్‌ఫాస్టే'! రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషక విలువలున్న అల్పాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమందికి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికే టైముండదు. మరికొంతమందైతే ఏదో ఒకటి తినేద్దాంలే అని సరిపెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదమూ లేకపోలేదు. అలాగే మనం చేసే పనిపై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు! ఇంతకీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి? చేయకపోతే వచ్చే నష్టాలేంటి? చూద్దాం రండి...

ఎందుకు తీసుకోవాలి?

  • పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే పోషక విలువలున్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే ఉదయాన్నే సమతుల అల్పాహారం తీసుకోవడం వల్ల ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు.
  • బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనం ఏ పని మీదైనా పూర్తి శ్రద్ధ పెట్టొచ్చు. అదే బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉంటే ఆకలి వేసి, చేసే పనిపై దృష్టి పెట్టలేకపోతాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ బరువును అదుపులో పెట్టుకోవాలంటే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం.
  • బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయి.
  • శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోతే మధ్యాహ్నం భోజనం మోతాదుకు మించి తీసుకుంటాం.. దీంతో బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • అల్పాహారం వల్ల మానసికంగా కూడా దృఢంగా తయారవుతాం. ఎందుకంటే సరైన సమయంలో మంచి అల్పాహారం తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఫలితంగా చేసే పనిపై దృష్టి నిలపొచ్చు. అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
  • నిద్ర పోయినప్పుడు మన శరీరంలో జీవక్రియల ప్రక్రియ క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి ఉదయాన్నే మంచి అల్పాహారం తీసుకుంటే ఈ ప్రక్రియను వేగవంతం చేయచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియ వల్ల మన శరీరంలోని క్యాలరీలు కరుగుతాయి. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.

తీసుకోకపోతే?

  • అల్పాహారం తీసుకోకపోతే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
  • మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. మెదడుకు మనం తీసుకునే ఆహారం నుంచి గ్లూకోజ్ అందాలి. అలాకాకుండా అల్పాహారం మానేస్తే మెదడు చురుగ్గా పని చేయదు. ఫలితంగా చేసే పని పట్ల ఆసక్తి తగ్గుతుంది.
  • క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోకపోతే మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం.. లాంటి పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఫలితంగా ఇవన్నీ గుండెపోటు రావడానికి కారణాలవుతాయి. అల్పాహారం తీసుకోని మహిళల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయని ఓ సర్వేలో వెల్లడైంది.

ఎలాంటి ఆహారం??

ప్రొటీన్లు, పోషక విలువలు ఎక్కువగా లభించే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవాలి. ఉదాహరణకు పాలు, పాల పదార్థాలు, పండ్లు, క్యారట్... మొదలైనవి తీసుకోవాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకునే ఆమ్లెట్ లాంటిదైనా తీసుకోవడం మంచిది. అలాగే రేపటి బ్రేక్‌ఫాస్ట్ ఏమిటో కూడా ముందే ఆలోచించుకుంటే వాటి తయారీకి అవసరమయ్యేవి ముందు రోజు రాత్రే రడీ చేసి పెట్టుకోవచ్చు. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది. తెలిసిందిగా.. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో.. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్‌ఫాస్ట్ మానకుండా ఆరోగ్యంగా ఉండండి..

ఇదీ చదవండి:చిరుజల్లులు మొదలాయే.. ఇక పాటించండి ఈ జాగ్రత్తలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.