ETV Bharat / sukhibhava

Sex Stamina Increase Tips : సెక్స్ స్టామినా పెంచుకోవాలా?.. రోజూ గంట వాకింగ్​ చేస్తే చాలు! - love hormones in females

Sex Stamina Increase Tips : సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మార్కెట్​లో ఎన్నో రకాల మందులు దొరుకుతున్నాయి. అయితే శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు వాకింగ్ బాగా ఉపయోగపడుతుందని వైద్య నిఫుణులు చెబుతున్నారు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

How Does Walking Will Increase The Sexual Stamina

author img

By

Published : Jul 30, 2023, 7:47 AM IST

Sex Stamina Increase Tips : సెక్స్ అంటే ఆనందం, ఆహ్లాదం, సుఖం, సంతోషం. అయితే ఇవన్నీ దక్కాలంటే పడకగదిలో ఎలాంటి హద్దులు లేకుండా చెలరేగాలి. దీనికి భాగస్వాములు ఇద్దరిలోనూ సెక్స్​ కోరికలు హెచ్చు స్థాయిలో ఉండాలి. అందుకు తగ్గట్లే శక్తి కూడా ఉండాలి. శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పుడు మార్కెట్​లో రకరకాల మందులు దొరుకుతున్నాయి. అయితే సెక్స్ స్టామినాను పెంచేందుకు నడక బాగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవును పడకగదిలో ఎంజాయ్​ చేసేందుకు కావాల్సిన శక్తిని వాకింగ్ అందిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

మనస్సు ఉల్లాసంగా ఉండాలి!
How to improve sex power : 'సెక్స్ విషయంలో ముఖ్యమైనది మనసును ఉల్లాసంగా ఉంచడం. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే శృంగారంలో పాల్గొనాలనే కోరిక ఎక్కువగా కలుగుతుంది. అలాగే సెక్స్​ను కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. శృంగార సామర్థ్యాన్ని వాకింగ్ బాగా పెంచుతుంది. నడక వల్ల మనలో ఫీల్ గుడ్ హార్మోన్స్ లేదా లవ్ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. ఆక్సిట్రోసిన్, ఎండార్ఫిన్స్ అనేవి సెక్స్​లో తృప్తి కలిగేలా చేస్తాయి. అలాగే మూడ్​ను బాగా పెంచుతాయి. మూడ్ లేకుండా సెక్స్ చేయడం వృథా. మూడ్​ను పెంచేందుకు వాకింగ్ బాగా దోహదపడుతుంది. నడక వల్ల శరీరంలో డోపమిన్ ఉత్పత్తి జరిగి.. బాగా మూడ్ వస్తుంది. దీని వల్ల సెక్స్​లో చక్కగా పాల్గొని ఎంజాయ్ చేయొచ్చు' అని ప్రముఖ వైద్యులు జి.సమరం చెప్పుకొచ్చారు.

రోజూ గంట సేపు నడిస్తే చాలు
Walking Sex Benefits : సెక్స్​కు వాకింగ్ చక్కగా తోడ్పడుతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంత మందిలో శృంగారంలో పాల్గొనాలనే కోరిక లేకపోవడాన్ని, నిరాసక్తతను గమనించవచ్చు. అలాంటి వాళ్లు వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రోజూ ఓ గంట సేపు నడవాలి. అయితే నిదానంగా కాకుండా వడివడిగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వాకింగ్ చేయాలి. దీని వల్ల వీరిలో తక్కువ కాలంలోనే అనూహ్య మార్పులు వస్తాయి. మూడ్ బాగా పెరిగి, సెక్స్ చేయాలని కోరిక కలుగుతుందని హెల్త్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఊరికే ఇంట్లో కూర్చొని సెక్స్ చేయాలని లేదు, మూడ్ రావడం లేదనే వారిలో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతాయి. దీన్ని పోగొట్టాలంటే అది వాకింగ్​తోనే సాధ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

ఒత్తిడికి బైబై చెప్పేయండి
Sex And Tension Relationship : శృంగార కోరికలు పెరిగేందుకే కాదు ఒత్తిడిని జయించడానికి కూడా వాకింగ్ ఎంతగానో దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజువారీ పనుల్లో పడి సమయానికి భోజనం చేయకపోవడం, సరిపడా నిద్ర లేకపోవడం వల్ల చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఒత్తిడి వల్ల శృంగారంలో పాల్గొనాలన్న మూడ్, ఉత్సాహం దెబ్బతింటాయి. కాబట్టి అలాంటి వారు కంటినిండా నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన ఇంటి భోజనాన్ని సమయానికి తీసుకుంటూనే రోజూ గంట పాటు వాకింగ్ చేయాలి. దీని వల్ల ఒత్తిడిని తరిమికొట్టవచ్చని హెల్త్ ఎక్స్​పర్ట్స్ సూచిస్తున్నారు.

ప్రతి రోజూ నడిస్తే సెక్స్​ సామర్థ్యం పెరుగుతుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.