ETV Bharat / sukhibhava

Dexterity Global: పదహారేళ్లకే సంస్థను స్థాపించి.. తన అనుభవాలనే పాఠాలుగా మలచి..! - Dexterity Global

ఎంత ఉన్నత కుటుంబమైనా సరే... పిల్లల్ని లక్షలు ఖర్చుపెట్టి విదేశాల్లో చదివించాలంటే అయ్యే పనికాదు. అలాంటిది మధ్య తరగతి, నిరుపేద వర్గాల విద్యార్థులు కూడా దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో కోట్లలో స్కాలర్‌షిప్‌లు పొందేందుకు సాయపడుతుంది ‘డెక్స్‌టెరిటీ గ్లోబల్‌’ సంస్థ. ఆ సంస్థ ద్వారా ఈ ఏడాది 22 మంది విద్యార్థులు రూ.21 కోట్ల రూపాయల విద్యావేతనానికి ఎంపికయ్యారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి శ్వేత రూ.2 కోట్ల స్కాలర్‌షిప్‌ అందుకుంటోంది. అంతగా ఏం చేస్తుందీ డెక్స్‌టెరిటీ సంస్థ... చూద్దామా!

scholarship for higher education
scholarship for higher education
author img

By

Published : Aug 1, 2021, 6:50 PM IST

అనగనగా ఒకబ్బాయి. శరత్‌ వివేక్‌ సాగర్‌ అన్నది అతని పేరు. వాళ్లది బిహార్‌. తండ్రి స్టేట్‌బ్యాంకు ఉద్యోగే కానీ ఎక్కువగా మారుమూల పల్లెటూళ్లలో పని చేయాల్సి వచ్చింది. అక్కడ మంచి పాఠశాలలేవీ లేకపోవడంతో వాళ్లనాన్న శరత్‌ని ఇంట్లోనే ఉంచి చదివించాడు. అలా పన్నెండేళ్ల దాకా అతను బడిముఖమే చూడలేదు. వాళ్ల నాన్నకి బిహార్‌ రాజధాని పాట్నాకి బదిలీ అయ్యాకే ఓ బడిలో చేరాడు. అదీ నేరుగా ఎనిమిదో తరగతిలో. అప్పటి నుంచీ చదువులో అద్భుతాలే చేశాడు శరత్‌. వాళ్ల నాన్న ఇంటర్నెట్‌ ద్వారా చూసి ఎన్నో దేశీ విదేశీ పోటీలకి శరత్‌ని పంపిస్తుండేవాడు. అలా నాసా, గూగుల్‌, కొలంబియా వర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలు నిర్వహించే సైన్స్‌, మ్యాథ్స్‌ పోటీలకి వెళ్లి విజయాలు అందుకున్నాడు. పదిహేనేళ్లకే ఐరాస విద్యార్థి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు.

తండ్రి తనకి కల్పించిన ఇన్ని పోటీల అవకాశాలనీ, ఇంతటి ఎక్స్‌పోజర్‌నీ తన తోటి విద్యార్థులకీ పరిచయం చేయానుకున్నాడు. అలా 2005లో పదహారేళ్లకే ఓ సంస్థని ప్రారంభించాడు. అదే ‘డెక్స్‌టెరిటీ గ్లోబల్‌’. దాని ద్వారా సాటి విద్యార్థులకి లక్షల రూపాయల బహుమతులు వచ్చే పోటీల విషయాలే కాదు... కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ సంగతులూ చేరవేయడం మొదలుపెట్టాడు. తానూ అమెరికాలోని టక్స్‌ యూనివర్సిటీలో ‘ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌’పైన డిగ్రీ చేశాడు. ఆ తర్వాత ఇండియా వచ్చి ‘డెక్స్‌టెరిటీ గ్లోబల్‌’ సంస్థని విస్తరించడం మొదలుపెట్టాడు. బిహార్‌లోని మారుమూల పల్లెటూళ్లలో ఉన్న నిరుపేద విద్యార్థుల్ని ఎంపిక చేసి పారిశ్రామిక, నాయకత్వ లక్షణాలలో శిక్షణ ఇస్తుండేవాడు. ఇందుకోసం దేశంలోని ఐఐటీ, ఐఐఎం నిపుణుల్నీ రప్పించాడు. నాసా, హార్వర్డ్‌ ప్రొఫెసర్ల చేత లెక్చర్లూ ఇప్పించేవాడు. ఓ సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌గా ఇదంతా దాదాపు ఉచితంగానే చేస్తుండేవాడు. సామాజిక సేవతో కూడిన ఈ వ్యాపార విధానాన్ని అమెరికాలోని మిషిగన్‌ వర్సిటీ, ఐఐటీ-నాగపుర్‌ తమ సిలబస్‌లలో చేర్చాయి. ఫోర్బ్స్‌ తన ‘30 అండర్‌ 30’ జాబితాలోనూ స్థానమిచ్చింది. బరాక్‌ ఒబామా 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్వేతసౌధానికి ఆహ్వానించి ముచ్చటించిన వందమంది యువనేతల్లో శరత్‌ ఏకైక భారతీయుడు! ఆ తర్వాత శరత్‌ తన ‘డెక్స్‌టెరిటీ గ్లోబల్‌’ సేవల్ని దేశం మొత్తానికీ విస్తరించాడు. ఇప్పటిదాకా ఆ సంస్థ ద్వారా 22 లక్షల మంది విద్యార్థులు రకరకాల నైపుణ్యాలు పెంచుకున్నారు. వీటితో పాటూ విద్యార్థులకి స్కాలర్‌షిప్‌లు ఇప్పించడానికి ‘డెక్స్‌టెరిటీ టు కాలేజ్‌’ (www.dexteritytocollege.com) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు.

.

ఆరు నుంచి డిగ్రీ దాకా...

‘డెక్స్‌టెరిటీ టు కాలేజ్‌’ అన్నది ఓ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం లాంటిదే. నాయకులుగా ఎలా ఎదగడం అన్న దగ్గర్నుంచి పారిశ్రామిక నైపుణ్యాలూ, సేవాభావం పెంపొందించడం దాకా ఇందులో అన్నీ ఉంటాయి. విదేశీ విశ్వవిద్యాలయాలు స్కాలర్‌షిప్‌లతో సీట్లు ఇవ్వడానికి ఇంగ్లీష్​, మ్యాథ్స్‌, సైన్స్‌ నైపుణ్యాలతోపాటూ ఇవన్నీ కూడా అక్కరకొస్తాయి మరి! ఈ శిక్షణలో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ దాకా ఎప్పుడైనా చేరొచ్చు. ఎప్పుడు చేరినా ఫీజు రూ.40 వేల దాకా ఉంటుంది. కానీ, కుటుంబ ఆదాయం తక్కువగా ఉంటే పూర్తి ఉచితంగానే అందిస్తారు. ఈ కార్యక్రమంలో లబ్ధి పొందేవారిలో 88 శాతం మంది ఇలాంటి నిరుపేదలు కావడమే విశేషం.

ఈ ఏడాది స్కాలర్‌షిప్‌ అందుకున్న 22 మందిలో బిహార్‌లోని అట్టడుగు వర్గానికి చెందిన అనోజ్‌, గౌతమ్‌లున్నారు. 2013లో ఓ మారుమూల పల్లెలో ఉన్న వీళ్లని శరత్‌ చేరదీసి శిక్షణ ఇప్పిస్తే... ఈ ఏడాది మనదేశంలోని అశోకా వర్సిటీ నుంచి చెరో రూ.45 లక్షల స్కాలర్‌షిప్‌ అందుకున్నారు! తెలంగాణకి చెందిన శ్వేతారెడ్డి పదో తరగతిలోనే ‘డెక్స్‌టెరిటీ టు కాలేజ్‌’ ప్రోగ్రామ్‌లో చేరింది. తన తండ్రి ఓ ప్రైవేటు కాలేజీలో ప్రొఫెసర్‌ అయినా... విద్య కోసం లక్షలు ఖర్చుపెట్టే పరిస్థితి లేదనే చెబుతుంది. డెక్స్‌టెరిటీ శిక్షణతో పెద్దగా ఇబ్బంది లేకుండానే అమెరికాలోని లాఫాయిత్‌ కాలేజీలో రూ.2 కోట్లతో స్కాలర్‌షిప్‌ వచ్చిందని అంటోంది. ఇలా ఒకరిద్దరు కాదు గత మూడేళ్లలో 80 మంది ప్రఖ్యాత వర్సిటీల్లో చదువుకున్నారు. డెక్స్‌టెరిటీ సాయంతో వాళ్లు అందుకున్న మొత్తం స్కాలర్‌షిప్‌ విలువ... అక్షరాలా రూ.71 కోట్ల రూపాయలు!

ఇదీ చూడండి: Women's Friendship : వారితో స్నేహం.. మానసిక ఒత్తిడికి దూరం.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.