ETV Bharat / sukhibhava

ఉప్పు అధికంగా వాడుతున్నారా? మధుమేహం ముప్పు పొంచి ఉన్నట్లే.. - ఉప్పు తాజా వినియోగం

Salt consume per day: ఉప్పు లేకుండా వంట చేయగలమా..? లేదు కదా.. కానీ ఉప్పు అధికంగా వాడితే రక్తపోటుతో పాటు మధుమేహం కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఉప్పుకు బదులుగా ఏం తీసుకోవాలంటే..?

consuming more salt may lead to diabetis
ఉప్పు అధికంగా వాడుతున్నారా
author img

By

Published : Feb 26, 2022, 8:05 AM IST

Salt consume per day: కూరలో రుచి మరింత కావాలన్నా.. పెరుగుతో తినేటప్పుడు ఉప్పు కాస్త వేసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. గతంలో ఉప్పుతింటే అధిక రక్తపోటు వస్తుందని అందరూ భావించారు. ఇప్పుడు ఉప్పుతో మధుమేహం కూడా వస్తుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తినే వారికి మధుమేహం గణనీయంగా వస్తున్నట్టు తేలింది.

ఎలా బయట పడిందంటే..

తీపి పదార్థాలు, చక్కెర, పండ్లరసాలతో మధుమేహం వస్తుందని భావించారు. ఇప్పుడు అధికంగా ఉప్పు వినియోగించడంతోనూ మధుమేహం వస్తుందని స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్యయనంలో స్పష్టంగా తేలింది. రోజుకు రెండు చెంచాలు తీసుకునే వారిలో 72 శాతం ఎక్కువగా ఉన్నట్టు బయట పడింది.

ఇన్సులిన్‌కు అడ్డు

ఉప్పు ఎక్కువగా తీసుకోవడంతో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఉప్పు ఇన్సులిన్‌కు అడ్డుకట్ట వేయడంతో మధుమేహానికి దారి తీస్తున్నట్టు చెబుతున్నారు. అధిక ఉప్పుతో రక్తపోటు, అధిక బరువు పెరగడంతో మధుమేహం వస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం జంట శత్రువులు, ఇవి గుండె జబ్బులకు కారణం కావొచ్చు

ఉప్పుతో జాగ్రత్త సుమా

మనం తినే ఆహారంలో రోజుకు 1500 మి.గ్రా సోడియం మించకుండా చూసుకోవాలి. కూరలు, పచ్చళ్లు, చిరుతిళ్లు, పెరుగులో అదనంగా వేసుకుంటే ప్రమాదం తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు.

మిరియాల పొడి వాడి చూడండి

కూరల్లో తక్కువ ఉప్పు వేయడానికి అలవాటు పడాలి. బయట తయారు చేసే పదార్థాలు వీలైనంత వరకూ మానేయాలి. ఉప్పుకు బదులు కాస్త మిరియాల పొడి చల్లుకోవాలి. క్రమంగా ఇలా చేయడంతో మన నాలుకపై ఉండే రుచిమొగ్గలు కూడా అలవాటు పడుతాయి. ఇలా చేస్తే రక్తపోటు, ఊబకాయం, మధుమేహం ముప్పు నుంచి బయట పడే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: అదే పనిగా కూర్చుంటే ఎన్ని అనర్థాలో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.