ETV Bharat / sukhibhava

గులాబీ టీ తాగేద్దామా.. - హైదరాబాద్​ వార్తలు

రంగు రంగుల చూడచక్కని పూలు కనువిందు చేయడంతోపాటు మనసునూ ఆనందంతో నింపేస్తాయి. అంతేకాదు వాటితో తయారుచేసే వివిధ రకాల టీలు చక్కని ఆరోగ్యాన్నీ అందిస్తాయి. మరెందుకాలస్యం మనమూ ప్రయత్నిద్దామా...

rose-tea-making-and-benfits
గులాబీ టీ తాగేద్దామా..
author img

By

Published : Jan 3, 2021, 8:57 AM IST

గులాబీ టీ

కావాల్సినవి: ఎండిన గులాబీలు- మూడు, గులాబీనీరు- టీస్పూన్‌, తేనె- రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం- అర టీస్పూన్‌, నీళ్లు- లీటర్‌, గ్రీన్‌టీబ్యాగ్‌లు- రెండు

rose-tea-making-and-benfits
గులాబీ ఛాయ్

తయారీ: పావు లీటరు నీటిని బాగా మరిగించి గులాబీరేకలు, నిమ్మరసం వేయాలి. దీన్ని స్టవ్‌ మీద నుంచి దించి ఎనిమిది నుంచి పది గంటలపాటు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల గులాబీరేకలు పూర్తిగా నానిపోతాయి. తర్వాత వాటిని వడకట్టేయాలి. దీంట్లో టీ బ్యాగులు వేసి మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత వాటిని తీసి తేనె, గులాబీనీరు వేసి బాగా కలపాలి. పాలతో కూడా దీన్ని తయారుచేయొచ్చు.

దీనిలో ఎక్కువగా ఉండే విటమిన్‌-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తరచూ దగ్గూ, జలుబు బారినపడకుండా చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది.

శంఖుపుష్పాలతో

కావాల్సినవి: శంఖుపుష్పాల రేకలు - అరకప్పు, తేనె- టేబుల్‌స్పూన్‌, నిమ్మచెక్క- ఒకటి, నీళ్లు- రెండు కప్పులు.

rose-tea-making-and-benfits
శంఖుపుష్పాలతో టీ

తయారీ: నీళ్లను మరిగించి అందులో శంఖుపుష్పాల రేకలను వేయాలి. తక్కువ మంట మీద కాసేపు మరిగిస్తే రంగు దిగుతుంది. ఈ నీళ్లలో తేనె కలిపితే తేనీరు సిద్ధం అవుతుంది. తర్వాత నిమ్మరసం పిండుకుని వేడిగా తాగేయాలి. అలాగే కొబ్బరినీళ్లు, ఐస్‌క్యూబ్స్‌ వేసి దీన్ని చల్లగానూ తయారుచేసుకుని తాగొచ్చు.

ఆందోళన, ఒత్తిడిని నియంత్రించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.

గోంగూరపూలతో

కావాల్సినవి: ఎండిన గోంగూరపూలు- ఆరు, నీళ్లు- రెండు కప్పులు, తేనె- రెండు టేబుల్‌స్పూన్లు.

rose-tea-making-and-benfits
గోంగూరతో..

తయారీ: నీళ్లను బాగా మరిగించి దాంట్లో గోంగూరపూల రేకలను వేయాలి. స్టవ్‌ ఆపేసి గిన్నె మీద మూతపెట్టి ఐదు నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. అప్పుడు పూలలోని సారమంతా నీళ్లలోకి దిగుతుంది. చివరగా తేనె కలిపితే సరిపోతుంది.

వీటిల్లో విటమిన్‌-ఎ, సి, ఇనుము, జింక్‌, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని పోషకాలు అంతర్గత వాపులను నియంత్రిస్తాయి.

ఇదీ చూడండి: క్యాట్‌లో తెలుగు విద్యార్థుల మెరుపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.