ETV Bharat / sukhibhava

నిద్రలేమికి 10 కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటించి హాయిగా పడుకోండి!

author img

By

Published : Feb 7, 2023, 9:46 AM IST

ప్రస్తుత జీవన విధానం అంతా మారిపోయింది. ఆహారపు అలవాట్లు, నిద్రపోయే సమయం అస్తవ్యస్తమయ్యాయి. అర్థరాత్రి అయితే గాని చాలా మంది నిద్రకు ఉపక్రమించడం లేదు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, సరైన శారీరక శ్రమలేకపోవడం, ఫోన్లలో గంటల కొద్ది సమయం గడపడం.. వంటివన్నీ నిద్రపై ప్రభావం చూపుతున్నాయి. అయితే, నిద్రలేమికి పది అంశాలు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?

reasons of unable to get proper sleep
నిద్రలేమికి కారణమైన ప్రధానమైన పది కారణాలు

ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడి, మానసిక సమస్యల వల్ల సరైన నిద్రను పొందలేకపోతున్నారు. 2021 నవంబర్​లో స్లీప్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. 13 దేశాల నుంచి 22,330 మంది పెద్దవారిని సర్వే చేయగా ప్రతి ముగ్గురిలో ఒకరికి నిద్రలేమి లక్షణాలు ఉన్నాయని తేలింది. దాదాపు 20 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ గణాంకాలు కొవిడ్ ముందు ఉన్నదాని కంటే రెట్టింపు.

కొవిడ్ మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన తర్వాత ప్రజలు చాలా వరకు ఫోన్​కు అలవాటు పడ్డారు. ఇది నిద్రలేమికి ప్రధానమైన కారణం. ఇదే గాక ఒత్తిడి కూడా నిద్రపై అధిక ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. ప్రతి మనిషికి రోజు 7 నుంచి 8 గంటల నిద్ర అనేది అవసరం. మానసిక ఆరోగ్యానికి సరైన నిద్ర అనేది చాలా అవసరం. మరి మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిద్ర సరిగ్గా లేకపోతే అనారోగ్యం పాలవక తప్పదు. సరైన నిద్ర లేకపోతే ఒక మనిషి ఎప్పుడూ చిరాకుగా ఉంటాడు. నిద్రలేమి సమస్యలు ఇలాగే కొనసాగితే అది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోకపోవడానికి అత్యంత సాధారణ కారణాల గురించి తెలుసుకుందాం.

ఎలక్ట్రానిక్ వస్తువులను అధికంగా ఉపయోగించడం
మహమ్మారి సమయంలో చాలా మంది ఎంటర్​టైన్​మెంట్​ కోసం ఫోన్​, టీవీలపై అధికంగా ఆధారపడ్డారు. తినే సమయంలో కూడా వీటి ముందు కూర్చునే తింటున్నారు. ఈ అలవాటే ప్రస్తుతం అతి పెద్ద సమస్యగా మారింది. అయితే నిద్ర రావడానకి 2 గంటల ముందు 'మెలటొనిన్' అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇదే నిద్ర రావడానికి ప్రధాన కారణం. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల ఈ హార్మోన్ విడుదల అనేది ఆగిపోతుంది. దీని వల్ల నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే నిద్రపోవడానికి 2 గంటల ముందే ఫోన్​ను దూరం పెట్టాలని వైద్యులు చెబుతున్నారు.

reasons of unable to get proper sleep
ఎలక్ట్రానిక్ వస్తువులను అధికంగా ఉపయోగించడం

నిద్రకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం
ఏదైనా పని ఉన్నప్పుడు నిద్ర గురించి పట్టించుకోము. స్నేహితులతో, సన్నిహితులతో రాత్రి సమయంలో గంటల తరబడి మాట్లాడుతుంటాం. కానీ నిద్ర గురించి మాత్రం ఆలోచించము. మరీ ముఖ్యంగా యువతలో లేట్ నైట్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. హోం వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ఇలా రకరకాల కారణాల వల్ల రాత్రిళ్లు అధిక సమయం మేల్కొంటున్నారు. ఇది నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోతే అది పగటివేళ ప్రభావం చూపుుతుంది. చురుకుగా పనిచేయలేము. అలాగే తరచుగా లేట్​నైట్ ఉంటే ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. రాత్రి సమయంలో కావాల్సిన నిద్ర ఉంటే అది మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

reasons of unable to get proper sleep
నిద్రకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం

వయసు సంబంధిత సమస్యలు
వృద్ధాప్యంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. చాలా రకాలు నొప్పులు వారిని ఇబ్బంది పెడుతుంటాయి. రకరకాల మెడిసిన్​లను వాడుతుంటారు. అలాగే రాత్రి సమయంలో మూత్రానికి లేవడం కూడా వారికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యల వల్ల వారు రాత్రి సమయంలో సరైన నిద్రను పొందలేరు. దీని వల్ల వారు సరైన నిద్రలేక ఒత్తిడికి గురవుతుంటారు. అయితే వృద్ధులు రాత్రి సమయంలో కెఫిన్​ పదార్థాలను తీసుకోకుండా ఉండటం, పడుకునే ముందు వేడి పాలను తాగడం వల్ల వారు మంచి నిద్రను పొందే అవకాశం ఉంది.

reasons of unable to get proper sleep
వయస్సు సంబంధిత సమస్యలు

కెఫిన్​, మద్యం సేవించడం
పడుకోవడానికి ముందు కెఫిన్ ఉన్న పదార్థాలను, మద్యం సేవించడం అనేది నిద్రకు ప్రధాన ఆటంకం అనే చెప్పవచ్చు. నిద్ర పోవడానికి 6గంటల ముందు నుంచే కెఫిన్ పదార్థాలను తీసుకోకూడదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కెఫిన్ అనేది మనం చురుకుగా ఉండటానికి దోహదపడుతుంది. అలాంటిది బెడ్ టైమ్​కు ముందు ఈ పదార్థాలను తీసుకుంటే నిద్ర పట్టదు. అలాగే ఆల్కహాల్​ తీసుకోవడం వల్ల రిఫ్రెష్ అయిన భావన కలుగుతుంది. శరీరం డీహైడ్రేట్ అవ్వటం వల్ల నిద్ర అనేది పట్టదు. కాబట్టి నిద్ర పోవడానికి ముందు కెఫిన్​, మద్యం సేవించకపోవడం ఉత్తమం.

ఒత్తిడి
ఒత్తిడి లాంటి మానసిక సమస్యలు కూడా నిద్రలేమి సమస్యలను కలిగిస్తాయి. ఇలాంటి మానసిక ఆరోగ్య సమస్యల వల్ల మన మెదడు అనేది నిద్రకు ఉపక్రమించదు. యాంగ్జైటీ, నిద్ర అనేది రెండు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. యాంగ్జైటీ అనేది సరైన నిద్ర లేకుండా చేస్తుంది. ఆరోగ్య సమస్యలు, రిలేషన్​షిప్, కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి వల్ల.. సరిగా నిద్ర పట్టకుండా మనసు ఆందోళనకు గురవుతుంటుంది. సమస్యలన్నీ మెదడుకు ఒత్తిడిని కలిగించి గుండె వేగం పెరిగేలా చేస్తాయి. దీని వల్ల ఏదో ప్రమాదం ఉందని ఆలోచిస్తూ సరైన నిద్ర అనేది లేకుండా చేస్తాయి ఇలాంటి మానసిక సమస్యలు. అందుకే ఒత్తిడి నుంచి బయటపడటానికి యోగా, మెడిటేషన్​లాంటివి చేయాలని డాక్టర్లు సూచిస్తుంటారు.

నిద్ర సంబంధిత వ్యాధులు

reasons of unable to get proper sleep
నిద్ర సంబంధిత వ్యాధులు
కొన్ని వ్యాధులు నిద్రపై ఎంతో ప్రభావం చూపుతాయి. నిద్రలేమి, పారాసోమ్నియాస్ లేదా స్లీప్ అప్నియా వంటి డిజార్డర్స్ నిద్ర సమస్యలకు కారణమవుతాయి. పారాసోమ్నియాస్ ఉన్నవారు నిద్రలో నడవడం, మాట్లాడటం, భయపడటం లాంటివి చేస్తుంటారు. నిద్రలో పక్షవాతం రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. స్లీప్ అప్నియా ఉన్న వ్యక్తులు తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఇవి కూడా సరిగ్గా నిద్ర పోకపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

మెడిసిన్​లను వాడటం

reasons of unable to get proper sleep
మెడిసిన్​లను వాడటం
ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, థైరాయిడ్ , క్యాన్సర్ లాంటి సమస్యలకు మందులను వాడుతున్నవారు కూడా సరైన నిద్రను పొందలేరు. వాటిలో ఉండే రసాయనాలు నిద్రలేమికి దారితీస్తాయి. అలాగే జలుబు, పెయిన్ కిల్లర్స్ లాంటి మందులను వాడటం వల్ల నిద్ర అనేది సరిగ్గా పట్టదు.

సాయంత్రం వేళ వ్యాయామం
చాలా మంది సాయంత్రం వేళ వ్యాయామాలు చేస్తుంటారు. ఎక్కువగా వ్యాయామాలు చేయడం వల్ల శరీరం, మెదడు యాక్టివ్ అవుతుంది. అలాగే హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది. దీని వల్ల నిద్రరావడం కొంచెం కష్టంగా మారుతుంది. 1997లో జరిపిన ఒక అధ్యయనంలో సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం వల్ల 24 గంటల తర్వాత నిద్రను కలిగించే మెలటోనిన్ ఉత్పత్తి ఆలస్యమై తర్వాతి రోజు నిద్రపై ప్రభావం చూపుతుందని కనుగొన్నారు. అందుకే సాయంత్రం వేళ కష్టమైన వ్యాయామాలు చేయకపోవడమే మంచిది.

మంచి నిద్ర వాతావరణం

reasons of unable to get proper sleep
కంఫర్ట్ చాలా ముఖ్యం
పడుకునే సమయంలో శబ్దాలు, వెలుతురు ఉంటే నిద్ర పట్టడం కష్టంగా మారుతుంది. చాలా డిస్ట్రబెన్స్​గా కూడా ఉంటుంది. అందుకే పడుకునే సమయంలో ఇబ్బంది పెట్టే శబ్దాలు లేకుండా చూసుకోవాలి. అలాగే కంటిపై వెలుగు పడుతుంటే నిద్రను కలిగించే మెలటోనిన్ ఉత్పత్తి అవ్వదు. అందుకే లైట్లను ఆపేసి పడుకోవాలి. మంచి నిద్రకు చక్కటి వాతావరణం కూడా ఉండటం ముఖ్యం.

షిప్టులతో చిక్కులు

reasons of unable to get proper sleep
షిప్టులతో చిక్కులు
ప్రస్తుత కాలంలో షిప్టుల వారీగా పని సమయాలున్నాయి. అయితే నైట్ షిప్టు పడిన వారు రాత్రంతా మేల్కోవాల్సి వస్తుంది. పడుకునే సమయంలో పని చేయాల్సి వస్తుంది. పగటి పూట నిద్రపోవాల్సి వస్తుంది. పడుకునే సమయంలో కళ్లు తెరచి ఉండటం, పగటి పూట పడుకొని ఉండటం నిద్రకు అతిపెద్ద భంగంగానే చెప్పొచ్చు. తరచుగా షిప్ట్​లు మారటం వల్ల నిద్ర పోయే సమయాలు మారుతుంటాయి. దీని వల్ల సరైన నిద్రను పొందలేరు. అయితే కొన్ని అధ్యయనాలు మంచిగా షిప్ట్​లు మార్చడం వల్ల ఉద్యోగులు చాలా సామర్థ్యంతో పని చేయగలరని చెబుతున్నాయి.

పడుకునే ముందు ప్రోటీన్ ఆహారం తినడం

reasons of unable to get proper sleep
పడుకునే ముందు ప్రోటీన్ ఆహారం తినడం
ప్రొటీన్ జీర్ణం అవ్వటానికి చాలా సమయం పడుతుంది. ఎక్కువసేపు కడుపునిండిన భావనను కలిగించగలదు. అలాగే అధిక ప్రొటీన్ ఉన్న మాంసం, బిర్యానీ లాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ శక్తి అందుతుంది. జీర్ణక్రియ 50శాతం అలస్యమవుతుంది. అందుకనే రాత్రి సమయంలో తొందరగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్​ ఆహారాన్ని తీసుకుంటే మంచి నిద్రను పొందవచ్చు.

కంఫర్ట్ చాలా ముఖ్యం

reasons of unable to get proper sleep
కంఫర్ట్ చాలా ముఖ్యం
పడుకునే ముందు ఫోన్లను చాలా దూరంగా పెట్టాలి. ఎందుకంటే వీటికి దూరంగా ఉంటే మనసు, మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మంచి నిద్ర తొందరగా పడుతుంది. మన దగ్గర ఫోన్లకు బదులు అలారం గడియారం పెట్టుకోవాలి. పడుకునే ముందు సౌకర్యవంతమైన బట్టలను ధరించాలి. అలాగే ఎలాంటి శబ్దాలు, వెలుతురు లేకుండా చూసుకొని పడుకుంటే మంచి నిద్రను పొందవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.