ETV Bharat / sukhibhava

ముడి తేనెతో మెరుగైన ఆరోగ్యం- దీర్ఘకాలిక వ్యాధులు దూరం! కానీ ఆ విషయంలో జాగ్రత్త!! - ముడి తేనె సైడ్​ ఎఫెక్ట్స్

Raw Honey Health Benefits In Telugu : ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాల్లో తేనెను ఒకటిగా చెబుతుంటారు. అయితే తేనెను శుద్ధి చేయడం వల్ల.. ఎక్కువ పోషకాలు ఉండే పుప్పొడి దెబ్బతింటుంది. అందువల్ల దీని నుంచి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ముడి తేనె అయితేనే మేలు. అయితే ముడి తేనె వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Raw Honey Health Benefits In Telugu
Raw Honey Health Benefits In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 7:56 AM IST

Raw Honey Health Benefits In Telugu : రోగనిరోధకశక్తి పెరగడానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు ఉంటాయి. అయితే చాలా మంది ప్యాకేజ్డ్ తేనె వాడుతుంటారు. తేనెను ప్యూరిఫై చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు అందులోని పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఉండేది ఇందులోనే. అందువల్ల దీని నుంచి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ముడి తేనె అయితేనే మేలు.

ముడి తేనె వల్ల కలిగే ప్రయోజనాలు..

  • ముడి తేనెలో ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
  • ముడి తేనె మధుమేహం నుంచి రక్షణ అందిస్తుంది. కొలెస్ట్రాల్​ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  • తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లూకోజ్ ఆక్సిడేస్ (glucose oxidase) ఉంటాయి. దీంతోపాటు తేనె తక్కువ pH స్థాయిని కలిగి ఉంటుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలను నాశనం చేస్తుంది.
  • మనుకా తేనె (ఒక రకమైన ముడి తేనె) E. coli, S. aureus, H. pylori వంటి సాధారణ వ్యాధికారకాలను చంపగలదని ఓ పరిశోధనలో తేలింది.
  • తేనెలో యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయని కూడా కొన్ని పరిశోధనలు వివరించాయి.
  • కొన్ని ఓవర్-ది-కౌంటర్ (OTC) దగ్గు మందుల కంటే తేనె ప్రభావవంతంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • కొన్ని అధ్యయనాల ప్రకారం.. ముడి తేనె జీర్ణక్రియపై మంచి ప్రభావం చూపుతుంది.
  • కాల్షియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, సల్ఫర్‌, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి.

ముడి తేనె సైడ్​ ఎఫెక్ట్స్​..
Pure Honey Side Effects : ఏ ఆహర పదార్థమైనా మితంగా తీసుకుంటేనే దాని నుంచి ప్రయోజనం పొందగలం. అలాంటి వాటిని అతిగా వినియోగిస్తే అవే ప్రాణాంతకంగా మారుతాయి. అతి ఎప్పుడూ చేటే. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ముడి తేనె వల్ల కూడా కొన్ని సందర్భాల్లో సైడ్​ ఎఫెక్ట్​లు వస్తుంటాయి.

  • ముడి తేనె తీసుకోవడం వల్ల హనీ పాయిజనింగ్ బారిన పడే అవకాశం ఉంది. దీనివల్ల తల తిరగడం, వికారం రావడం, వాంతులు, రక్తపోటు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
  • గర్భిణీలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు ముడి తేనె తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇందులో బొటులినమ్​కు కారణమయ్యే సి.బొటులినమ్​ బ్యాక్టీరియా ఉంటుంది.
  • పుప్పొడి పడని వాళ్లు ముడి తేనె వినియోగిస్తే అలెర్జీలు వచ్చే అవకాశముంది. ఒకవేళ ఉంటే మరింత తీవ్రం కావచ్చు.

ఇలా చేస్తే షుగర్ వ్యాధి రాదు! ప్రీడయాబెటిస్​ నుంచి ఎలా తప్పించుకోవాలి?

అర‌టి తొక్కే అని తేలిగ్గా పారేయ‌కండి- ఇలా వాడితే మెరిసే చ‌ర్మం మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.