రెండో దశలో కొవిడ్ ఉనికి అంతుచిక్కకుండా తయారైంది. మన చుట్టూ ఉన్న వారిలో అసలు ఈ వైరస్ ఎవరికి ఉందో? ఎవరిపై ఎలా ప్రభావం చూపుతుందో? కూడా తెలియట్లేదు. ఎక్కువ శాతం యుక్తవయసులో ఉన్న వారే ఈ మహమ్మారి బారిన పడుతుండడం కలవరపెడుతోంది. అంతేకాదు.. ఈ సెకండ్ వేవ్ ప్రభావం చిన్నారుల పైన కూడా అధికంగానే ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ వారిలో లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయని, తల్లిదండ్రులు అనవసరమైన భయాందోళనలు మానుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే వారు ఆస్పత్రి అవసరం లేకుండా ఇంట్లోనే కోలుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కొవిడ్ సోకిన చిన్నారుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేంద్ర వైద్యారోగ్య శాఖ కూడా తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వైరస్ బారిన పడిన పిల్లల్లో సాధారణంగా కనిపించే లక్షణాలేంటి? వారిని ఎప్పుడు హోమ్ ఐసొలేషన్‌లో ఉంచాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేర్చాలి? ఒకవేళ ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటే తల్లులు వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తదితర విషయాలన్నీ ఆ గైడ్‌లైన్స్‌లో భాగంగా వివరించింది ఆరోగ్య శాఖ.
These precautions should be followed if the child gets corona!
By
Published : May 10, 2021, 9:51 AM IST
రెండో దశలో కరోనా మహమ్మారి అభం శుభం తెలియని చిన్నారుల పైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. అయితే ప్రస్తుతం వైరస్ బారిన పడే పిల్లల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వారిలో ఇన్ఫెక్షన్ తాలూకు లక్షణాలు అతి స్వల్పంగా ఉన్నాయని, అలాంటి చిన్నారులు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కోలుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటోన్న చిన్నారుల విషయంలో తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో సూచిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
భయపడద్దు
పిల్లల్లో కరోనా వైరస్ ప్రభావాన్ని మూడు వర్గాలుగా విభజించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. వైరస్ సోకినా లక్షణాలు కనిపించకపోవడం, స్వల్ప లక్షణాలుండడం, తీవ్రమైన అనారోగ్యాలు తలెత్తడం. అయితే చాలామంది పిల్లల్లో వైరస్ సోకినా లక్షణాలు కనిపించట్లేదు. ఇలాంటి చిన్నారుల్ని గుర్తించడమెలా అంటే.. స్క్రీనింగ్ ద్వారానే అది సాధ్యమవుతుంది. అదెలాగంటే.. ఇంట్లో ఎవరికైనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే.. ముందు జాగ్రత్తగా ఆ ఇంట్లోని చిన్నారులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించాలి. ఈ క్రమంలో వారికి పాజిటివ్‌గా తేలినా.. లక్షణాలు కనిపించకపోతే భయపడక్కర్లేదు. ఇలాంటి చిన్నారులకు ప్రత్యేకంగా చికిత్స కూడా అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యం చేయకుండా వారిని ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. ఈ క్రమంలో రోజులు గడిచే కొద్దీ ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం వీలవుతుంది.
హోమ్ ఐసొలేషన్ ఎప్పుడు అవసరం?!
పిల్లలకు వైరస్ సోకినా తల్లులు పెద్దగా భయపడాల్సిన పని లేదు. అయితే ఈ క్రమంలో చాలామంది పిల్లల్లో గొంతునొప్పి, దగ్గు, ముక్కు కారడం (రినోరియా), జ్వరం, రుచి-వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇక మరికొంతమందిలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలూ తలెత్తుతున్నాయి. ఇలాంటి పిల్లలు వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో చిన్నారుల్ని చూసుకునే విషయంలో తల్లులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పిల్లలు హోమ్ ఐసొలేషన్‌లో ఉండేందుకు వీలుగా ఇంట్లో ఓ ప్రత్యేకమైన గదిని కేటాయించాలి.
జ్వరం ఉన్నట్లయితే వైద్యులు సూచించిన మందును 4-6 గంటల వ్యవధిలో వేయాల్సి ఉంటుంది. అలాగే దగ్గు, జలుబు.. వంటి సమస్యలకు కూడా డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.
పిల్లల శరీరంలో నీటి స్థాయులు తగ్గకుండా చూసుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో వారికి ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని అందించాలి. అలాగే నిపుణుల సలహా మేరకు పోషకాహారం ఇవ్వాలి.
స్వల్ప లక్షణాలున్న చిన్నారులకు యాంటీబయాటిక్స్ మందులు ఇవ్వకూడదు.
ప్రతి నాలుగు గంటలకోసారి చిన్నారి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయులు, గుండె కొట్టుకునే వేగం.. వంటివి పరిశీలించాలి. వీటిని నమోదు చేసి రోజూ డాక్టర్‌కి తెలియపరచాలి. ఈ క్రమంలో వారిలో ఆక్సిజన్ స్థాయులు 94 శాతానికి తగ్గకుండా ఉన్నంత వరకు సురక్షితమే!స్వల్ప లక్షణాలున్న పిల్లలకు ప్రత్యేకంగా ల్యాబ్ టెస్టులు అవసరం లేదు.
వైరస్ బారిన పడిన చిన్నారుల్ని చూసుకునే తల్లి/కేర్ టేకర్ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అలాగే పిల్లలూ నిరంతరం మాస్క్ ధరించేలా చూసుకోవాలి.
ఈ మాస్కుల్ని, వారున్న గదిని రోజూ హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాల్సి ఉంటుంది.
ఎప్పుడు ఆస్పత్రిలో చేరాలంటే..!
కరోనా బారిన పడిన చాలామంది చిన్నారుల్లో స్వల్ప లక్షణాలే కనిపించినా.. కొంతమందిలో మాత్రం తీవ్రత ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి.
రెండు నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో శ్వాసక్రియ రేటు నిమిషానికి 60 - అంతకంటే ఎక్కువగా నమోదైనప్పుడు.
2-12 నెలల మధ్య వయసున్న చిన్నారుల శ్వాసక్రియ రేటు నిమిషానికి 50 – అంతకంటే అధికంగా ఉన్నప్పుడు.
ఏడాది నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లల్లో శ్వాసక్రియ రేటు నిమిషానికి 40 – అంతకంటే ఎక్కువగా నమోదైతే.
ఇక ఐదేళ్లు పైబడిన చిన్నారుల్లో శ్వాసక్రియ రేటు నిమిషానికి 30 – అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే.
ఆక్సిజన్ స్థాయులు 90 శాతం కంటే తక్కువగా నమోదైనప్పుడు.
న్యుమోనియా, ARDS (Acute respiratory distress syndrome), Sepsis (ఇన్ఫెక్షన్ వల్ల శరీరం తీవ్రంగా ప్రతిస్పందించడం), Septic Shock (అవయవ వైఫల్యం), MODS (Multiple Organ Dysfunction Syndrome), గోళ్లు-పెదాలు నీలం రంగులోకి మారడం (Cyanosis), ఫిట్స్, విపరీతమైన అలసట, నీరసం.. వంటి తీవ్ర లక్షణాలున్న పిల్లలను నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంచాలి. ఈ క్రమంలో వారి ఆరోగ్య స్థితిని బట్టి కొవిడ్ వార్డులో లేదంటే ఐసీయూలో చేర్చుకొని చికిత్స అందించాలి. తద్వారా వారికి సకాలంలో వైద్యం అంది త్వరగా కోలుకునే వీలుంటుంది.