ETV Bharat / sukhibhava

కరోనా కాలంలో కళ్లను కాపాడుకోండి ఇలా.. - corona virus precautions

కరోనా బారిన పడకుండా స్వీయ జాగ్రత్తలు, ముఖ్యంగా పరిశుభ్రత పాటించటం ఎంతో కీలకం. కళ్ల నుంచి కూడా వైరస్ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కళ్లద్దాలు, కాంటాక్ట్​ లెన్స్​లు ఉపయోగించే వారు మరింత జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఇలాంటివారి కోసం నోవా ఐ-వేర్ వైస్​ ప్రెసిడెంట్​ పమ్మీ జమాల్​పూడియా ఇస్తోన్న సూచనలు ఇవే..

eye care
కరోనా వేళ కళ్లను కాపాడుకోండి ఇలా
author img

By

Published : Jun 4, 2020, 9:42 AM IST

పరిశుభ్రత పాటించటం మనకు కొత్తేమీ కాదు. చిన్నప్పటి నుంచి మన ప్రాథమిక స్థాయి పాఠాల్లో ఒక భాగం. ఈ విషయంలో కరోనా మహమ్మారి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నేర్పింది. పరిశుభ్రతను మొదటి ప్రాధాన్యంగా, అలవాటుగా మార్చుకునేలా చేసింది.

కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థతో పాటు పలు జర్నల్​లు స్పష్టం చేశాయి. చాలా వస్తువుల ఉపరితలాలపై ఈ వైరస్ కొన్ని గంటలపాటు జీవించగలదని గుర్తించారు పరిశోధకులు. ఫలితంగా ఉపరితలాలను తాకి మన ముఖాన్ని ముట్టుకుంటే వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలో కళ్లద్దాలు, లెన్స్​లు ఉపయోగించే వ్యక్తులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరు వ్యక్తిగత శుభ్రతతో పాటు కళ్లకు ధరించే అద్దాలు, ఐ లెన్స్​లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇందుకు సంబంధించి నోవా ఐ-వేర్ వైస్​ ప్రెసిడెంట్​ పమ్మీ జమాల్​పూడియా కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.

  • కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్​లను ముట్టుకోవటానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బుతో కడిగిన తర్వాత శుభ్రమైన టవల్​తో చేతులను తుడుచుకోవాలి. ఆ తర్వాతే వాటిని అమర్చుకోవాలి. వీటిని తాకేముందు ఎటువంటి కృత్రిమ మాయిశ్చరైజర్​, సౌందర్య సాధనాలను రాసుకోకూడదు.
  • కళ్లద్దాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. తేలికపాటి డిటర్జెంట్​ ఉండే క్లీనింగ్ సొల్యూషన్​తో కడగాలి. ఇది వాటిపై ఉండే సూక్ష్మజీవులను తొలగిస్తుంది. ముఖ్యంగా ముక్కును అదిమిపట్టే ప్యాడ్లు, హ్యాండిల్​ శుభ్రం చేయాలి. టవల్​తో తుడిచిన తర్వాతే ఉపయోగించాలి.
  • అవసరం లేనప్పుడు వాటికోసం ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెల్లోనే భద్రపరచాలి. ఈ బాక్సులను ఎప్పుడూ ఒకే ప్రదేశంలో ఉంచటం మంచిది. ఎక్కడంటే అక్కడ పెడితే దుమ్ము చేరే ప్రమాదం ఉంది.
  • మీ ఫ్రేములు, అద్దాలను ఎప్పుడూ జాగ్రత్తగా పట్టుకోండి. గ్రిప్పింగ్ వల్ల అద్దాలు వంగకుండా, ధరించడానికి అసౌకర్యంగా మారకుండా ఉంటాయి.
  • వీటిని తీసేటప్పుడు మీ ముఖాన్ని తాకకుండా ఉండటం అసాధ్యం. అందువల్ల చేతులను శుభ్రం చేసుకోవటం చాలా ముఖ్యం.
  • కళ్ల జోడుపై మురికి భారీగా పేరుకుపోయి ఉంటే ప్రొఫెషనల్ క్లీనింగ్​ను ఆశ్రయించటం మంచిది. దీని వల్ల కళ్లద్దాలు ఎక్కువ రోజులు మన్నుతాయి.

కళ్ల ద్వారా కరోనా వైరస్ సోకకుండా కళ్లజోడు సహాయపడుతుందని కంటి నిపుణులు ధ్రువీకరించారు. అయితే వీటిని ధరించే వారు పైన సూచించిన చిట్కాలను పాటించటం చాలా ముఖ్యం. అప్పుడే వైరస్​ను సోకకుండా మనల్ని మనం కాపాడుకోలగమని అంటున్నారు పమ్మీ.

ఇదీ చూడండి: లాక్​డౌన్​లో మీ శరీరం స్పీడు తగ్గిందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.