ప్రస్తుత కాలంలో ప్రజల జీవనశైలిని మార్చడంలో సిద్ధ వైద్యం అనేక రకాలుగా ఉపయోగపడుతుందని సూపర్‌స్టార్ మహేశ్ బాబు అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శంకరపల్లి సమీపంలోని మోకిలా వద్ద డాక్టర్ సత్య సింధూజ ఏర్పాటు చేసిన చక్రసిద్ధ చికిత్స కేంద్రాన్ని మహేశ్ బాబు తన సతీమణి నమత్రతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చికిత్స కేంద్రంలో కలియ తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు.
చక్రసిద్ధలోనే ప్రిన్స్ చికిత్స
కొంతకాలం మైగ్రేన్ సమస్యతో బాధపడ్డ మహేశ్ బాబు... చక్ర సిద్ధ వైద్యం ద్వారా ఉపశమనం పొందారు. అలాంటి దీర్ఘకాలిక బాధలకు మంచి చికిత్స లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్వయంగా మహేశ్ హాజరై ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు డాక్టర్ సత్య సింధూజ తెలిపారు. శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ సత్య సింధూజను అభినందించారు. పలు రుగ్మతలతో బాధపడుతున్న ఎంతో మంది.. చక్రసిద్ధలో ఉపశమనం పొంది ఆరోగ్యవంతులుగా మారాలని ప్రముఖులు ఆకాంక్షించారు.
సిద్ధవైద్యంలో సుప్రసిద్ధం..
"4 వేల ఏళ్ల పురాతనమైన ఈ వైద్యం ఎన్నో రకాల రోగాలను నయం చేయగలదని బలంగా విశ్వసించిన సింధూజ... అనేక దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న 70 వేల మందికి ఎలాంటి మందులు అవసరం లేకుండా చికిత్స అందించి తగ్గించారు. ఈ క్రమంలో మోకిలలో సువిశాలమైన ప్రాంగణంలో నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. మానసిక శాంతి, శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ప్రగతిని ప్రజలకు అందించాలని ఆశిస్తున్న."
- సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ గేయ రచయిత
ఇదీ చూడండి: