ETV Bharat / sukhibhava

పొట్ట తగ్గడానికి పాటించాల్సిన నియమాలు? - పొట్ట తగ్గేదెలా?

50 ఏళ్ల తర్వాత వచ్చే కొవ్వు సమస్యలు (belly fat loss) ఇప్పుడు 30 ఏళ్లకే వచ్చేస్తున్నాయి. అందంతో పాటు ఆరోగ్యానికి అనేక సవాళ్లు విసిరే ఈ సమస్యను చిన్నపాటి జాగ్రత్తలతో రాకుండా (belly fat reduce) చూసుకోవచ్చు. పొట్ట పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో (belly fat diet tips) తెలుసుకుందాం..

belly fat reduce
పొట్ట తగ్గించే మార్గాలు
author img

By

Published : Oct 5, 2021, 4:35 PM IST

వయసు పెరిగేకొద్ది శరీరంలో ఇతర భాగాలతో పాటు సాధారణంగా పొట్ట కూడా (belly fat loss) పెరుగుతుంది. నడుము చుట్టు కొవ్వు కారణంగా పొట్ట ఎక్కువవుతుంది. స్త్రీల విషయంలో ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది. దీనివల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా చెడిపోతుంది. దీంతో మానసికంగా (belly fat diet tips) కుంగిపోతారు. గుండె జబ్బులు, మధుమేహానికి పొట్ట కారణమవుతుంది. పిత్తాశయ సమస్యలు, అధిక రక్తపోటు ఎదురవుతాయి. నిజానికి వయసు పెరిగే కొద్ది జీవక్రియలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. దీంతో కొవ్వు పెరుగుతుంది. రుతుక్రమం ఆగిన స్త్రీలలో కలిగే హార్మోన్ల మార్పులు కూడా బరువుకు కారణమవుతాయి. కొంత మందిలో బరువు పెరగకుండా పొట్ట (belly fat reduce exercise) పెరుగుతుంది. ఇది మరింత ప్రమాదకరం.

కారణాలు..

  • కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం ప్రధాన కారణం
  • వ్యాయామం చేయకపోవటం కూడా చెప్పుకోదగ్గ కారణం

జాగ్రత్తలు..

  • సంతృప్త కొవ్వులకు బదులు పాలీ అసంతృప్త కొవ్వులు ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.
  • సాధారణ బియ్యం, గోధుమలు, బ్రెడ్​ కంటే సంక్లిష్ట పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
  • కేలరీలను తక్కువగా తీసుకునేలా ఆహారాన్ని ఎంచుకోవాలి
  • వేపిన కూరగాయల కన్నా ఆవిరి మీద ఉడికిన కూరగాయలు మేలు చేస్తాయి.
  • పాలు, పెరుగు, మజ్జిగ, రాగులు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి.
  • ఆహార నియమాలు, వ్యాయామం చేసినా కొందరిలో పొట్ట తగ్గదు. ఇలాంటివారు పొట్ట కండరాలను దృఢం చేసే వ్యాయామాలను(belly fat reduce exercise at home) అనుసరించడం ముఖ్యం.
  • కొంత మంది స్త్రీలలో మోనోపాజ్ దశ తర్వాత హార్మోన్​ చికిత్స కూడా అవసరమవుతుంది.
  • ఆహారం తినకుండా ఉంటే పొట్ట తగ్గదు. మూడు పూటలా తప్పకుండా తినాలి. అయితే.. కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోవాలి.
  • ఉప్పును బాగా తగ్గించాలి.
  • అధికంగా నీరు తీసుకోవాలి.
  • పొట్టను తగ్గించేలా ప్రత్యేకమైన శ్వాస వ్యాయామాలు ఉంటాయి. నిపుణుల పర్యవేక్షణలో వీటిని చేయాలి.
  • అన్నింటికీ మించి తగినంత నిద్ర, విశ్రాంతి శరీర బరువును అదుపులో ఉంచుతాయి.

మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:భవిష్యత్​లో రాబోయే వ్యాధిని ముందే గుర్తించొచ్చా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.