ETV Bharat / sukhibhava

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా?.. స్లీప్ హైజీన్ పాటిస్తే సరి.. - మంచి నిద్రకు పాటించాల్సిన పద్ధతులు న్యూస్

ఆధునిక సమాజంలో అందరూ ఎదుర్కొనే సమస్యలలో నిద్రలేమి ఒకటి. మనిషికి నిద్ర చాలా అవసరం. శరీరం రీఛార్జ్ కావాలంటే కంటి నిండా నిద్రపోవాలి. అయితే మారుతున్న జీవనశైలి, మానసిక రుగ్మతల కారణంగా క్రమంగా నిద్ర తక్కువైపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే అది శరీరాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు నిద్రపోయేముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం అని చెప్తున్నారు నిపుణులు. అవేంటంటే?..

Precautions to be taken before sleeping
నిద్రపోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
author img

By

Published : Jan 28, 2023, 4:44 PM IST

నిద్రపోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మంచి నిద్ర వల్ల శరీరంలోని చాలా రకాల వ్యాధులను తొలగించుకోవచ్చు. జీర్ణశక్తి ఎలా పని చేయాలి, మన గ్రోత్ ఎలా ఉండాలి, రెస్ట్, రిపేర్, రిలాక్సేషన్ వంటి ప్రక్రియలు కేవలం నిద్ర ద్వారా కంట్రోల్​లో ఉంటాయి. నిద్రకు అంత ప్రాధాన్యం ఉంది. అయితే కొంతమంది నిద్రలేమి సమస్య వల్ల మానసిక వ్యాధులతో సతమతం అవుతూ ఉంటారు. వీరిలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే వారిలో ఎక్కువగా కన్పిస్తుంటాయి.

అయితే ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి కూడా ఒక పద్ధతితో పాటించాలి. దీన్నే స్లీప్ హైజీన్ అంటారు. ఇష్టం వచ్చిన సమయాల్లో నిద్రపోవటం కూడా అంతమంచిది కాదు. రాత్రి 10 గంటల సమయంలో నిద్రపోయి.. ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో లేవడం మంచిది. ఈ విధంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవటం శరీరానికి అవసరం. ఇలా ఒకే షెడ్యూల్​లో నిద్రపోవటం వల్ల చాలా వ్యాధుల బారి నుంచి బయటపడవచ్చు.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు క్రమం తప్పకుండా ఒకే సమయంలో నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. అందుకోసం ఒక స్లీపింగ్ షెడ్యూల్​ను ఏర్పాటు చేసుకుని దాన్ని పాటించాలి. కనీసం ఏడు గంటలు నిద్రపోయేందుకు వీలుగా నిర్దిష్టమైన వేళను నిర్ణయించుని కచ్చితంగా ఆ సమయంలో నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే ఈ తరహా వైద్య పద్ధతిని ఉపయోగించడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి తప్పించుకోవటమే కాక గాఢ నిద్రను కూడా పొందవచ్చు.

  • నిద్రపోయేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
    • ప్రతి రోజు ఒకే సమయంలో నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి.
    • ఇరవై నిమిషాల వరకు నిద్ర పట్టకపోతే ధ్యానం చేయటం ఉత్తమం.
    • పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయటం వల్ల చక్కగా నిద్ర పడుతుంది.
    • ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
    • నిద్రపోయేముందు రూమ్​ను మనకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. లైటింగ్ ఎఫెక్ట్, ఏసీ, సౌండ్ ఎఫెక్ట్ లాంటి వాటిని మన శరీరానికి తగినట్టుగా పెట్టుకోవటం మంచిది. దీనివల్ల నిద్రకు అంతరాయం కలగకుండా రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు.
    • ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం, టీవీ చూడటం వంటివి నిద్రపోయే రెండుగంటల ముందే కంప్లీట్ చేసుకోవాలి.
    • మద్యపానం, పొగతాగటం వంటివి నిద్రకు భంగం కలిగిస్తాయి.
    • కారం, ఉప్పు, ఆయిల్​ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం మంచిది కాదు.
    • యోగా చేయటం వల్ల నిద్రలేమి సమస్యను తగ్గించుకోవచ్చు.
    • రాత్రివేళ తక్కువగా ఆహారం తీసుకోవాలి.
    • పగలు నిద్రపోయే అలవాటును మానుకోవాలి.
    • నిద్రపోయే అరగంట ముందు గోరువెచ్చటి పాలను తాగటం వల్ల మంచి నిద్రను పొందవచ్చు.
    • నిద్రపోయే ముందు మన మనసుకి నచ్చిన మ్యూజిక్ వినటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర లభిస్తుంది.
    • బెడ్​రూమ్​లో మితిమీరిన వెలుతురు లేకుండా చూసుకోవాలి.
    • కొన్ని రకాలు మందులను తరచుగా వాడటం వల్ల కూడా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.