ETV Bharat / sukhibhava

శీతాకాలంలో ఆ సమస్యలా.. జాగ్రత్తలు తప్పనిసరి.. - cough and cold latest news

ఎండకాలం ఉక్కపోత ఉండదు. వానకాలం తడీ లేదు. చలికాలమంతా ఒకింత ఆహ్లాదంగా, ఆనందగానే సాగుతుంది. వేడి వేడి పకోడీలు, బజ్జీలు తింటూనో.. గరం గరం చాయ్‌ తాగుతూనో గడిపేస్తుంటాం. అవసరమైతే స్వెటర్లు వేసుకునో, మంకీక్యాప్‌లు ధరించో చలిని జయిస్తుంటాం. రగ్గుల కింద మునిగిపోయి కమ్మటి కలలు కనేస్తాం. అలాగని అన్నిసార్లూ, అందరికీ ఆనందాన్నీ పంచాలనేమీ లేదు. చలికాలం కొన్ని సమస్యలనూ వెంటబెట్టుకొస్తుంది. వీటి గురించి తెలుసుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.

winter season
శీతాకాలం
author img

By

Published : Jan 20, 2022, 5:28 AM IST

చలికాలంలో చాలామంది ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడుతుంటారు. వ్యాయామం చేయటానికి, బయటకు వెళ్లటానికి బద్ధకిస్తుంటారు. ఇది తప్పు. చలికాలంలోనూ వ్యాయామం మానరాదని గుర్తుంచుకోవాలి. వ్యాయామం చేయటం వల్ల శరీరానికి శక్తి లభించటమే కాదు, చురుకుదనమూ పెరుగుతుంది. రోగనిరోధకశక్తి ఇనుమడిస్తుంది.

జలుబు, ఫ్లూ వంటి సమస్యలు త్వరగా దాడిచేయవు. బయటకు వెళ్లటం కుదరకపోతే ఇంట్లోనైనా వ్యాయామాలు చేయాలి. రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామాలు చేసేలా చూసుకోవాలి. గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం గలవారికివి మరింత అవసరం.

సాధారణం- జలుబు, దగ్గు

జలుబు, దగ్గు సంవత్సరమంతా చూసేవే అయినా చలికాలంలో కాస్త ఎక్కువ. దీనికి ప్రధాన కారణం జలుబు కారక వైరస్‌లు చల్లటి వాతావరణంలో అధికంగా వృద్ధి చెందటం. మరింత త్వరగానూ వ్యాపించటం. అప్పటికే జబ్బులతో బాధపడేవారికి.. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు గలవారికివి మరింత తేలికగా అంటుకుంటాయి.

రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే వృద్ధులకు, పిల్లలకు, గర్భిణులకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి సైతం ముప్పు ఎక్కువే. చల్లటి గాలికి ఊపిరితిత్తులు, లోపలి పొరలు అతిగా స్పందిస్తుంటాయి. పొడి వాతావరణంలో దుమ్ము, ధూళి గాలిలో ఎక్కువగానూ కలుస్తాయి. దీంతో అలర్జీ, ఆస్థమా, సీఓపీడీ బాధితులకు దగ్గు, ఆయాసం ఉద్ధృతం కావొచ్చు.

ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు బయటకు వెళ్తే ముక్కులోని కణజాలం పెద్దగా అయ్యి ముక్కు దిబ్బడకు దారితీయొచ్చు. దీంతో ముక్కు చుట్టుపక్కల గదులకు వెళ్లే దారులు (సైనస్‌ మార్గాలు) మూసుకుపోవచ్చు. సైనసైటిస్‌తో బాధపడేవారికిది చిక్కులు తెచ్చిపెడుతుంది.

ఏం చెయ్యాలి?

మామూలు జలుబుకు పెద్ద మందులేమీ అవసరం లేదు. తగినంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. జ్వరం ఎక్కువగా ఉంటే పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవచ్చు. తుమ్ములు, దగ్గు ఎక్కువగా ఉంటే యాంటీహిస్టిమిన్‌ మాత్రలు ఉపయోగపడతాయి. ఆస్థమా గలవారు ముందు నుంచే కంట్రోలర్‌ మందులు వాడుకోవాలి. ఆస్థమా ఉద్ధృతమైనప్పుడు తీసుకోవటానికి వీలుగా రిలీవర్లు అందుబాటులో ఉంచుకోవాలి. శ్వాస సమస్యలతో బాధపడేవారు రోజులో ఎప్పుడైనా గోరువెచ్చటి నీళ్లు తాగటం మంచిది.

గుండె పదిలం!

ఉష్ణోగ్రత పడిపోతున్నకొద్దీ రక్తనాళాలు సంకోచిస్తుంటాయి. దీంతో అవయవాలకు తగినంత రక్తాన్ని సరఫరా చేయటానికి గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. గుండె కండరానికీ ఆక్సిజన్‌తో నిండిన రక్త సరఫరా తగ్గొచ్చు. దీంతో గుండెపోటు వచ్చే అవకాశం పెరగొచ్చు. అప్పటికే రక్తనాళాల్లో పూడికల వంటి గుండెజబ్బులు గలవారికి ముప్పు మరింత ఎక్కువవుతుంది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారికి రక్తనాళాలు సంకోచించటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదముంది. మరోవైపు రక్తమూ కాస్త చిక్కగా అవుతుంది. ఫలితంగా రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. ఇది గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరగటానికి దారితీస్తుంది. కొందరికి ఫ్లూ జ్వరం మూలంగా ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి, రక్తపోటు పడిపోవటం వల్ల గుండెకు తగినంత రక్తం అందకపోవచ్చు. ఇదీ గుండెపోటుకు దారితీయొచ్చు.

ఏం చెయ్యాలి?

గుండెజబ్బులు, అధిక రక్తపోటు గలవారు చలికి ఎక్కువగా గురికాకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. ఒంటికి నువ్వుల నూనెతో మర్దన చేసుకుంటే రక్తనాళాలు సంకోచించటం తగ్గుతుంది.

నొప్పులతో జాగ్రత్త!

సాధారణంగా చలికాలంలో శరీరం వేడిని దాచుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఊపిరితిత్తులు, గుండె వంటి భాగాలకు ఎక్కువ రక్తసరఫరా జరిగేలా చేస్తుంది. ఈ క్రమంలో కాళ్లు, చేతులు, భుజాలు, కీళ్లకు తగినంత రక్తం సరఫరా కాదు. దీంతో కీళ్లు బిగుసుకుపోయి నొప్పులు తలెత్తొచ్చు. పైగా చలికాలంలో కదలటానికి బద్ధకించటం వల్ల కీళ్లకు, ఎముకలకు దన్నుగా నిలిచే కండరాలు, కండర బంధనాలు సైతం బిగుసుకుపోతుంటాయి. ఇదీ మోకాళ్ల నొప్పులు, ఎముకల నొప్పులకు దారితీయొచ్చు. అప్పటికే కీళ్లనొప్పులు గలవారికి మరింత ఎక్కువ కావొచ్చు.

ఏం చెయ్యాలి?

పొద్దున లేవగానే కాళ్లూ చేతులూ ఆడించటం, సాగదీయటం మంచిది. దీంతో కదలికలు మెరుగై, బిగువు తగ్గుతుంది. చలికాలమైనా తగినంత నీరు తాగాలని మరవరాదు. ఇది కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి మృదువుగా, తేలికగా కదలటానికి తోడ్పడుతుంది. కీళ్లు, ఎముక ఒరుసుకుపోవటం తగ్గుతుంది. నొప్పులు తగ్గుతాయి.

చర్మం పొడిబారకుండా..

చలికాలంలో పెద్ద సమస్య చర్మం పొడిబారటం. దీనికి ప్రధాన కారణం గాలిలో తేమ తగ్గటం. తేమ తగ్గినప్పుడు గాలి మన చర్మంలోని తేమను తీసుకోవటానికి ప్రయత్నిస్తుంది. దీంతో చర్మం పొడిబారి, గరుకుగా తయారవుతుంది. సన్నటి పగుళ్లూ ఏర్పడొచ్చు. ఫలితంగా దురద పుడుతుంది. గోకడం, అదేపనిగా రుద్దటం వల్ల అక్కడి చర్మం మందం కావొచ్చు. పుండ్లు పడొచ్చు. కొందరిలో ఎండుగజ్జీ మొదలవ్వచ్చు. చర్మం ఎర్రగా అయ్యి, దద్దు రావొచ్చు. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లూ తలెత్తొచ్చు. వృద్ధులకు సహజంగానే చర్మం మీద నూనె పొర తగ్గుతుంది. ఫలితంగా చర్మం త్వరగా పొడి బారుతుంది. వీరికిది మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. అటోపిక్‌ డెర్మటైటిస్‌, థైరాయిడ్‌ సమస్యలు గలవారికి చర్మం పొడిబారే ముప్పు ఎక్కువ. చలికాలంలో ఇది మరింత ఎక్కువవుతుంది.

ఏం చెయ్యాలి?

ఒంటికి కొబ్బరినూనె, ఆలివ్‌నూనె వంటివి రాసుకోవటం మేలు. అవసరమైతే చర్మంలో తేమను కాపాడే మాయిశ్చరైజర్లూ వాడుకోవచ్చు. చర్మం పొడిబారినవాళ్లు ఒంటికి నూనె రుద్దుకొని స్నానం చేయటం మంచిది. మామూలు సబ్బులకు బదులు గ్లిజరిన్‌తో కూడిన సబ్బులు వాడుకుంటే మేలు. సున్నిపిండి వాడుకున్నా మంచిదే. ఎండుగజ్జి, సోరియాసిస్‌ వంటి సమస్యలు గలవారు నేరుగా చర్మానికి తగిలేలా స్వెట్టర్లు ధరించటం తగదు. ముందుగా నూలు దుస్తులు వేసుకొని వాటి మీద ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు వేసుకోవచ్చు.

నీరుగార్చే నిరుత్సాహం

చలికాలంలో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటాయి. తగినంత వెలుగు, సూర్యరశ్మి లేకపోవటం వల్ల కొందరు నిరాశ, నిస్పృహలకు లోనవవుతుంటారు. ఉత్సాహం సన్నగిల్లి కుంగుబాటుకు లోనవుతుంటారు. దీన్నే సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌ (ఎస్‌ఏడీ) అంటారు. మన నిద్ర, మెలకువను మెదడులో ఉత్పత్తయ్యే మెలటోనిన్‌, సెరటోనిన్‌ హార్మోన్లు నియంత్రిస్తుంటాయి. ఈ హార్మోన్లు ఉత్పత్తి కావటంలో సూర్యరశ్మి కీలకపాత్ర పోషిస్తుంది. వెలుతురు తగ్గిపోయి చీకటి పడుతున్నప్పుడు నిద్రమత్తు, నిరుత్సాహాన్ని కలగజేసే మెలటోనిన్‌ ఉత్పత్తి అవుతుంటే.. వెలుతురు బాగా ఉన్నప్పుడు, ఒంటికి ఎండ తగిలినప్పుడు ఉత్సాహాన్ని కలగజేసే సెరటోనిన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి సెరటోనిన్‌ ఉత్పత్తి తగ్గిపోయి ఎస్‌ఏడీకి దారితీస్తుంది. దీంతో ఉత్సాహం, ఆసక్తి సన్నగిల్లుతాయి. నిద్ర సరిగా పట్టదు. ఒకవేళ పట్టినా త్వరగా మెలకువ వచ్చేస్తుంది. కొందరికి ఆకలి తగ్గితే, కొందరికి పెరగొచ్చు.

ఏం చెయ్యాలి?

రోజూ ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి. దీంతో విటమిన్‌ డి ఉత్పత్తి పెరిగి ఉత్సాహం వస్తుంది. ఇంట్లోకి ఎండ, వెలుతురు వచ్చేలా కిటికీలు తెరవటం మంచిది. చలి పెడుతోందంటూ ఎప్పుడూ ఇంట్లోనే కూర్చోకుండా నలుగురితో కలవటం, మిత్రులు, బంధువులతో గడపటం మేలు.

బరువుపై కన్ను

మిగతా కాలాలతో పోలిస్తే చలికాలం కాస్త ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకలీ పెరుగుతుంది. దీన్ని ఒకరకంగా శరీరం చలి నుంచి కాపాడుకునే ప్రయత్నమే అనుకోవచ్చు. వాతావరణంలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు మనలోని రక్షణ వ్యవస్థ శరీరాన్ని త్వరగా వేడెక్కాలని పురమాయిస్తుంది. అప్పుడు సత్వరం శక్తిని, వేడిని అందించే పిండిపదార్థాల వైపు మనసు మళ్లుతుంది. అందుకేనేమో చాలామంది వేడివేడిగా పకోడీలు, బజ్జీల వంటి చిరుతిళ్లు తినేస్తుంటారు. కొందరు మిఠాయిలూ లాగించేస్తుంటారు. చిక్కేంటంటే- చక్కెర, పిండిపదార్థాలతో కూడిన ఇలాంటి పదార్థాలతో ఎంత వేగంగా రక్తంలో గ్లూకోజు పెరుగుతుందో అంతే వేగంగా తగ్గుతుంది. దీంతో కాసేపటికే తిరిగి ఆకలి అవుతుంది. ఇలా ఎక్కువెక్కువగా తినటం వల్ల బరువు పెరుగుతుంది. మరోవైపు చలికి బయటకు వెళ్లటానికి ఇష్టపడకపోవటం, వ్యాయామం చేయకపోవటంతోనూ బరువు పెరిగే అవకాశముంది. మామూలుగానైతే ఇది పెద్ద ఇబ్బందేమీ కానప్పటికీ అప్పటికే అధిక బరువు గలవారికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టొచ్చు.

ఏం చెయ్యాలి?

ఆలస్యంగా జీర్ణమయ్యే పొట్టుతీయని ధాన్యాలతో చేసిన పదార్థాలు తీసుకోవటం మంచిది. గుడ్లు, వడ, దోశ, చికెన్‌ వంటివి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. త్వరగా ఆకలి వేయదు. అందువల్ల వీటిని తీసుకోవచ్చు. వంటకు నువ్వుల నూనె వాడుకోవచ్చు. మితంగా నెయ్యి తీసుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవటం ఉత్తమం. వృద్ధులు, పిల్లలకు ఇది మరింత ముఖ్యం. ఎక్కువమంది గుమిగూడే చోట్లకు వెళ్లకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే ముక్కుకు, నోటికి రుమాలు చుట్టుకోవాలి. తలకు మఫ్లర్లు, మంకీక్యాప్‌ వంటివి ధరించాలి.
  • ఉదయం పూట నడక అలవాటు గలవారు కాస్త ఎండ మొదలయ్యాకే అడుగు బయటపెట్టాలి.
  • అప్పుడే వండినవి, వేడివేడి పదార్థాలే తినాలి. నీళ్లనూ గోరువెచ్చగా చేసుకొని తాగాలి.
  • కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీముల వంటివి నోరు, గొంతు పైపొరలను దెబ్బతీసి గొంతునొప్పి వంటి సమస్యలకు దారితీస్తాయి. వీటికి దూరంగా ఉండాలి.
  • షేక్‌హ్యాండ్స్‌ ఇవ్వటం కన్నా నమస్కారం చేయటం మంచిది.
  • గర్భిణులకు ఏవైనా ఇన్‌ఫెక్షన్లు వస్తే యాంటీబయోటిక్‌ మందుల వంటివి అంతగా ఇవ్వటం కుదరదు. అందువల్ల వ్యక్తిగత శుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తరచూ చేతులు కడుక్కోవాలి.
  • డాక్టర్‌ పర్యవేక్షణలో ఫ్లూ, న్యుమోనియా టీకాల వంటివి తీసుకోవాలి. వీటిని రెండు, మూడు నెలల ముందే తీసుకొని ఉంటే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.