ETV Bharat / sukhibhava

ఆ మందుతో కొవిడ్‌కు కళ్లెం వేయొచ్చు! - కరోనాకు మాసిటినిబ్‌

కొవిడ్‌-19 చికిత్సకు మాసిటినిబ్‌ అనే ఔషధం సమర్థంగా ఉపయోగపడగలదని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో పరిశోధకులు గుర్తించారు. ఇది మానవ కణాల్లో సార్స్‌-కొవీ-2 వృద్ధిని అడ్డుకుంటోందని గుర్తించారు.

SARS-CoV-2 Replication
మాసిటినిబ్‌
author img

By

Published : Aug 7, 2021, 10:14 AM IST

కరోనా వైరస్‌ మహమ్మారుల్లో కొవిడ్‌-19 మొట్ట మొదటిదేమీ కాదు. అలాగని చివరిదీ కాదు. అందువల్ల వీటిని నివారించుకోవటానికి టీకాలతో పాటు ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారిని కాపాడు కోవటానికి కొత్త చికిత్సల అవసరమూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాల మీదా పరిశోధకులు విస్తృతంగా అధ్యయనాలు చేస్తున్నారు. తాజాగా మాసిటినిబ్‌ అనే మందు కొవిడ్‌-19 చికిత్సకు సమర్థంగా ఉపయోగపడగలదని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో పరిశోధకులు గుర్తించారు.

ఇది మానవ కణాల్లో సార్స్‌-కొవీ-2 వృద్ధిని అడ్డుకుంటోందని గుర్తించారు. ఎలుకల్లోనూ ఇది వైరస్‌ సంఖ్య, వాపు ప్రక్రియ సూచికల మోతాదులను గణనీయంగా తగ్గిస్తున్నట్టు బయటపడింది. కేవలం సార్స్‌-కొవీ-2నే కాదు, రకరకాల కరోనా వైరస్‌లను.. అలాగే హెపటైటిస్‌ ఎ, పోలియో, రైనోవైరస్‌ల వంటి వైరస్‌లనూ అదుపు చేస్తున్నట్టు తేలింది. కాకపోతే మాసిటినిబ్‌ మందును ప్రస్తుతం మనుషులకు వాడటానికి అనుమతి లేదు. దీన్ని కుక్కల్లో కొన్నిరకాల కణితుల చికిత్సలోనే వినియోగిస్తున్నారు. మనుషుల్లోనూ చర్మక్యాన్సర్‌, అల్జీమర్స్‌, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌, ఆస్థమా వంటి జబ్బులపై ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ఇది మనుషుల్లో వాడుకోవటానికి సురక్షితమేనని తేలినప్పటికీ దీంతో జీర్ణకోశ సమస్యలు, కాళ్ల వాపు వంటి దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదముంది. కొందరిలో గుండెజబ్బుకూ దారితీయొచ్చు. అందుకే దీన్ని నిరపాయకరంగా మార్చి.. మరింత సమర్థమైన యాంటీవైరల్‌ మందుగా తీర్చిదిద్దాలని పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఫలిస్తే కొవిడ్‌-19 చికిత్సకు కొత్త మందు దొరికినట్టే.

ఇదీ చదవండి:Vaccine Efficacy: బాగా నిద్రపోయే వారిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందుతాయా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.