ETV Bharat / sukhibhava

కరోనాను జయించారా? ఈ టెస్టులు చేయిస్తే బెటర్! - కోలుకున్న వారికి కరోనా పరీక్షలు

కరోనాను జయించారా? మరి మీ ఆరోగ్యం సంగతేంటి? కోలుకున్నవారు ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా?

post covid tests
కోలుకున్నారా? ఈ టెస్టులు చేయించుకోకపోతే అంతే!
author img

By

Published : May 30, 2021, 5:02 PM IST

దేశంలో కరోనా విలయం తీవ్రంగా మారింది. వైరస్​ బారిన పడ్డ వారికి కనీస వసతులు కరవవుతున్నాయి. సరైన చికిత్స అందక చాలా మంది అవస్థలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల... కరోనా సోకిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్న వారు సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అవయవాలు ఏవైనా దెబ్బతిన్నాయా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను తెలుసుకునేందుకు పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని అంటున్నారు.

అవేంటంటే?

విటమిన్ డీ:

కరోనా వైరస్ వల్ల విటమిన్ డీ లోపం ఏర్పడుతుందని తేలింది. అందువల్లే కరోనా చికిత్సలో భాగంగా విటమిన్ డీ సప్లిమెంట్లను ఇస్తున్నారు. మీకు నెగెటివ్​గా తేలిన వెంటనే శరీలంలో విటమిన్ స్థాయిలను గుర్తించే పరీక్షలను చేయించుకోవడం ఉత్తమం. డీ విటమిన్​కు సంబంధించి ఇంకేమైనా చికిత్స అవసరమో లేదో ఈ టెస్టుల ద్వారా తెలుస్తుంది.

ఇదీ చదవండి- Vaccination: టీకా తీసుకున్నవారి నుంచి వైరస్ రాదా?

ఛాతి స్కానింగ్:

కొవిడ్ లక్షణాల్లో దగ్గు, జలుబు ముఖ్యమైనవి. కరోనా సోకిన సమయంలో రోగుల ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కొన్ని సార్లు బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధులూ ఊపిరితిత్తులపై దాడి చేస్తున్నాయి. ఇలాంటివి ముందే గుర్తించాలంటే హెచ్ఆర్​సీటీ స్కానింగ్ చేయించుకోవాలి.

హార్ట్ ఇమేజింగ్, కార్డియాక్ స్క్రీనింగ్

కరోనా వైరస్ కారణంగా శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతింటున్నాయి. ఊపిరితిత్తుల మాదిరిగానే గుండె సైతం చాలా సున్నితమైనది. కరోనా వైరస్ వీటిపైనే అధికంగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది వైద్యులు ఈ రెండు అవయవాలను పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు. నెగెటివ్​ రాగానే చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

ఇదీ చదవండి- టీకా తీసుకున్నాం.. సేఫ్​గా ఏమేం పనులు చేయొచ్చు​?

గ్లూకోజ్, కొలెస్ట్రాల్ టెస్ట్

శరీరంలో లవణ స్థాయిలను సైతం కరోనా ప్రభావితం చేస్తోంది. కొవిడ్ బాధితుల శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేట్​లో మార్పులు సంభవిస్తున్నాయి. కాబట్టి వైరస్ నుంచి కోలుకోగానే శరీరంలో లవణ సాంద్రతను తెలుసుకోవడం అవసరం. శరీరంలో లవణ స్థాయిలు పెరిగినా తగ్గినా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

ఐజీజీ యాంటీబాడీ పరీక్షలు

కరోనా నుంచి కోలుకోగానే వెంటనే చేయించుకోవాల్సిన ముఖ్యమైన టెస్టు ఇది. వ్యాధి నుంచి కోలుకున్న తరువాత మన శరీరం యాంటీబాడీలను తయారు చేస్తుంది. మనం ఏ వ్యాధి బారిన పడినా.. యాంటీబాడీలు తయారవుతాయి. వీటి ద్వారా మనకు రోగనిరోధక శక్తి వస్తుంది. శరీరంలో ఏ స్థాయిలో యాంటీబాడీలు తయారయ్యాయో తెలుసుకునేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.