Orange Peels Benefits in Telugu : చలికాలంలో మనకు ఎక్కడ చూసినా నారింజ పండ్లు విరివిగా దొరుకుతుంటాయి. తియ్యతియ్యగా.. పుల్లపుల్లగా.. ఉండే వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు. నారింజలనే కమలా పండు అని కూడా అంటాం. వీటిని తీసుకోవడం ద్వారా బాడీకి విటమిన్ సితో పాటు ఎన్నో పోషకాలు అందుతాయని, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే.
అయితే మనం సాధారణంగా నారింజలను తింటున్నప్పుడు అందులోని పండును తిని తొక్కలను బయట పారేస్తుంటాం. కానీ మీకు తెలియని విషయమేమిటంటే.. నారింజ పండ్ల(Oranges) కంటే వాటి తొక్కల ద్వారానే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ కమలాపండు తొక్కలలో ఉండే పోషకాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంతకీ నారింజ్ తొక్కలతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బరువు తగ్గాలనుకుంటున్నారా? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ కాంబినేషన్స్ ట్రై చేయండి!
మంచి కిచెన్ క్లీనర్ : కమలాపండు తొక్కలో ఉండే సిట్రస్ ఇంటిని శుభ్రపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటితో మంచి కిచెన్ క్లీనర్ చేయడం చాలా ఈజీ. మీరు ముందుగా కొన్ని నారింజ తొక్కలను తీసుకొని వాటిని వెనిగర్‌తో కలిపి గాలి పోని జార్ లేదా మేసన్ జార్లో రెండు, మూడు వారాలు నిల్వ చేయండి. ఆ తర్వాత వెనిగర్‌ను వడకట్టి స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకోండి. దానిని మీ కిచెన్ క్యాబినెట్లు, స్టవ్‌పై కొన్ని చుక్కలు వేసి క్లీన్ చేసుకున్నారంటే చాలు మీ వంటగది తళతళ మెరవడం ఖాయం. అలాగే మంచి సువాసను వెదజల్లుతోంది.
అరోమేటిక్ ఫైర్ స్టార్టర్స్(Aromatic fire starters) : ఇందుకోసం మీరు నారింజ తొక్కలను ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని పర్యావరణ అనుకూలమైన ఫైర్ స్టార్టర్‌లుగా మార్చుకోవాలి. ఇలా ఎండబెట్టిన పీల్స్ అద్భుతమైన కిండ్లింగ్ కోసం ఉపయోగపడతాయి. అవి మండుతున్నప్పుడు ఆహ్లాదకరమైన సిట్రస్ వాసనను విడుదల చేస్తాయి. రసాయనాలతో నిండిన ఫైర్ స్టార్టర్‌ల కంటే ఇవి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు.
దంతాలు ఆరోగ్యంగా ఉండి తెల్లగా మెరిసిపోవాలా? ఈ ఫుడ్స్‌తో రిజల్ట్ పక్కా!
సిట్రస్ ఇన్ఫ్యూజ్డ్ టీ : మీరు నారింజ తొక్కలతో మంచి టీ బ్యాగ్‌లను తయారు చేసుకోవచ్చు. వీటిలో సిట్రస్ ఉంటుంది కాబట్టి మీరు టీ తయారు చేసుకుని తాగారంటే అటు టేస్ట్‌తో పాటు విటమిన్ సి, మరిన్ని పోషకాలు లభిస్తాయి. ఇందుకోసం మీరు ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. తర్వాత టీ చేసుకునేటప్పుడు ఈ పొడిని అందులో వేసుకుని తాగాలి.
మొక్కలకు మేలు చేస్తాయి : నారింజ తొక్కలు మొక్కల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తాయి. ఇందుకోసం మీరు ఒక గ్లాస్ నీటికి కప్పు ఎండిన నారింజ తొక్కలను యాడ్ చేసి 10 నిమిషాలు మరింగించండి. చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టి మొక్కలపై స్ప్రే చేయండి. ఇలా ప్రతి 3-4 రోజులకోసారి ఇలా చేస్తే గొంగలి పురుగు, క్రిమీకీటకాలు, చీమలు, తెల్లపురుగు వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. ఇండోర్ మొక్కలకు ఇది యూజ్ చేయవచ్చు.
ముల్లంగి ఆకులను పడేస్తున్నారా? ఈ హెల్త్ బెనిఫిట్స్ మిస్ అయినట్లే!
అలాగే నారింజ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి మొక్కల మొదల్లో వేయండి. వీటి నుంచి వచ్చే సిట్రస్ వాసనకి క్రిమి కీటకాలు దరిచేరకపోవడంతో పాటు.. వేళ్లు తొలిచే పురుగులు నశిస్తాయి. ఇంకా దీనిలో ఉండే న్యూట్రియంట్లు మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి చాలా బాగా సాయపడతాయి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. అవి ఎండిన ప్రతిసారీ లేదా సుమారు రెండు వారాలకోసారి వాటిని మార్చాల్సి ఉంటుంది.
ఈ ప్రయోజనాలతో పాటు నారింజ తొక్కలలో ఉండే పోషకాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ , రాగి, విటమిన్ ఎ, బి, సి తో పాటు డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలు వెల్లడించాయి.
ఎగ్స్ Vs పనీర్- ఏది మంచిది? ఎందులో ప్రొటీన్ ఎక్కువ!
డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ కళ్లు దెబ్బతినడం ఖాయం!