ETV Bharat / sukhibhava

బప్పి లహిరి ప్రాణాలు తీసిన వ్యాధి.. ఎందుకొస్తుంది? అరికట్టడం ఎలా? - sleep apnea signs

Obstructive Sleep Apnea: డిస్కో కింగ్​, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహిరి(69) ఫిబ్రవరి 15న మృతిచెందారు. ఆయన అకాలమరణం.. సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి కారణం అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​ అప్నియాగా(ఓఎస్​ఏ) తేల్చారు వైద్యులు. అసలు ఇదేంటి? దీని గురించి తెలుసుకుందాం.

Obesity increases the risk of Obstructive Sleep Apnea

author img

By

Published : Feb 17, 2022, 5:08 PM IST

Obstructive Sleep Apnea: డిస్కో కింగ్​ బప్పీ లహిరి ఫిబ్రవరి 15న తుదిశ్వాస విడిచారు. దీంతో భారత చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. అయితే.. బప్పి లహిరి మరణానికి కారణం 'అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​ అప్నియా' అని వైద్యులు ధ్రువీకరించారు. అసలేంటీ సమస్య? లక్షణాలేంటి?

స్లీప్​ అప్నియా అంటే?

స్లీప్​ అప్నియా అనేది నిద్ర రుగ్మత. పడుకొని ఉన్నప్పుడే శ్వాస ప్రక్రియకు అంతరాయం కలిగి.. నిద్రలోనే మరణం సంభవించొచ్చు. ఈ సమస్యతో బాధపడేవారికి గురక కూడా వస్తుంది. దీనిని అరికట్టాలంటే బాధితుడి బరువును నియంత్రించాలి. బీఎంఐ కూడా మెరుగైన స్థితిలో ఉండాలి.

దీని గురించి హైదరాబాద్​ వీఐఎన్​ఎన్​ హాస్పిటల్​ వైద్య నిపుణులు డా. రాజేశ్​ వుక్కలను సంప్రదించగా.. ఆయన పలు విషయాలు వెల్లడించారు.

''మనం శ్వాస తీసుకొని, వదిలేటప్పుడు.. ఆక్సిజన్​, కార్బడ్​ డయాక్సైడ్​ స్థాయులు సరిపోలాలి. కానీ.. అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​ అప్నియా ఉంటే ఇవి సరిపోలవు.''

- డా. రాజేశ్​ వుక్కల, వైద్య నిపుణులు, వీఐఎన్​ఎన్​ హాస్పిటల్​

Obstructive Sleep Apnea symptoms:

వ్యాధి లక్షణాలేంటి?

  • బిగ్గరగా గురక
  • అసలు విశ్రాంతి తీసుకోనట్లు కనిపిస్తారు. అలసిపోయినట్లుగానే నిద్ర లేస్తారు.
  • తేలికపాటి తలనొప్పి
  • ఏకాగ్రత ఉండకపోవడం
  • దీర్ఘకాలిక అలసట
  • రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోవడం
  • ఉక్కిరిబిక్కిరి అవడం, ఆకస్మికంగా మెలకువ రావడం.
  • ఒత్తిడికి లోనవడం.

ఇలాంటి బాధితులు.. మధుమేహం, రక్తపోటు, కీళ్లవ్యాధులు, థైరాయిడ్​ సంబంధిత వ్యాధుల బారినపడే అవకాశం కూడా ఉందని డా. రాజేశ్​ తెలిపారు.

''శరీరంలో ఆక్సిజన్, కార్బన్​ డయాక్సైడ్​ అసమతుల్యత కారణంగా.. కీలక అవయవాలైన గుండె, మెదడు, ఊపిరితిత్తులపైనా ప్రభావం పడుతుంది.''

- డా. రాజేశ్​ వుక్కల

Obstructive Sleep Apnea reasons:

వ్యాధికి కారణాలు..

  • ఊబకాయం(అధిక బరువు)
  • పొడవైన మెడ(17 అంగుళాలకంటే ఎక్కువగా) ఉండటం.
  • బీఎంఐ 25 కంటే ఎక్కువగా ఉండటం.
  • అలెర్జీ
  • సైనసైటిస్​
  • ఆస్తమా

Obstructive Sleep Apnea Diagnosis:

వ్యాధి నిర్ధరణ ఎలా?

స్లీప్​ అప్నియా వ్యాధిని.. పాలీసోమ్నోగ్రఫీ ద్వారా నిర్ధరించవచ్చు. ఒక యంత్రం ఉంటుంది. దీని సాయంతో బాధితుడి నిద్రను నిశితంగా పరిశీలించాలి. ఆ వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు కొన్ని పారామితులను గమనించాల్సి ఉంటుంది.

అవేంటంటే?

  • వ్యక్తి శ్వాస ఎలా తీసుకుంటున్నారు?
  • ఆక్సిజన్​, కార్బన్​ డయాక్సైడ్​ స్థాయులు ఎలా ఉన్నాయి?
  • గుండె ఎలా కొట్టుకుంటుంది?
  • బీపీ నియంత్రణలో ఉందా?

వీటిని పరిగణనలోకి తీసుకొని.. ఆ వ్యక్తి స్లీప్​ అప్నియాతో బాధపడుతున్నాడో లేదో చెప్పొచ్చు. అప్నియా ఇండెక్స్​తో.. బాధితుడు ఎన్ని సార్లు శ్వాస తీసుకోవడం ఆపేస్తున్నాడో గుర్తించవచ్చు. దీని ప్రకారం.. అప్నియా ఇండెక్స్​లో రీడింగ్ 6.5 లోపు ఉంటే సాధారణంగా ఉన్నట్లు లెక్క. 6.5 దాటితే.. స్లీప్​ అప్నియా లక్షణాలు ఉన్నట్లే.

ఎలా అదుపు చేయొచ్చు..?

  • వ్యాధికి కారణాలు తెలుసుకొని, వాటిని నియంత్రించే దిశగా ప్రయత్నించాలి.
  • బీఎంఐ అధికంగా ఉంటే.. బరువు తగ్గించుకోవాలి.
  • ఇవన్నీ నియంత్రణలోకి వస్తే.. స్లీప్​ అప్నియా నుంచి బయటపడొచ్చు.
  • బాధితుడు వృద్ధుడు అయినట్లయితే.. దీని నుంచి బయటపడేందుకు శస్త్రచికిత్స మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం.

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని డా. రాజేశ్​ చెబుతున్నారు. బరువును అదుపులో ఉంచుకోవడం, ప్రాణాయామం వంటి యోగాసనాలు వేయడం, ఏరోబిక్స్​ చేయడం, నడక, నిద్ర పొజిషన్స్​ మార్చుకోవడం, మంచి వెంటిలేషన్​ ఉండేలా చేసుకోవడం వంటివి అలవాటు చేసుకుంటే మంచిదని వివరించారు.

ఇవీ చూడండి: కలయికను ఆస్వాదించలేకపోతున్నారా.. కారణం ఇదే కావచ్చు?

చర్మం పొడిబారిపోతుందా? ఈ చిట్కా ట్రై చేయండి..

'రోజూ మందు తాగే అలవాటు ఉందా? సంతానోత్పత్తి కష్టమే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.