ETV Bharat / sukhibhava

వేపాకులని లైట్ తీసుకుంటున్నారా? - ఈ ఆరోగ్య ప్రయోజనాలను మిస్ చేసుకున్నట్లే!

Neem Leaves Health Benefits : మీ ఇంట్లో లేదా దగ్గరలో వేప చెట్టు ఉందా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. వేపాకులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది మేం చెబుతున్న మాట కాదు.. ఆరోగ్య నిపుణులే ఈ విషయాన్ని చెబుతున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ స్టోరీ చదివి ఆ హెల్త్​ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి.

Neem Leaves
Neem Leaves
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 1:25 PM IST

Health Benefits of Neem Leaves : వేప చెట్టు అనగానే ఉదయం పళ్లు తోముకోడానికి వేప పుల్లలు, ఉగాది పచ్చడిలో వేసుకోవడానికి వేప పువ్వు ఉపయోగిస్తామనే విషయాలు మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ.. వేపాకుల(Neem Leaves)తో కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా..? ఈ విషయం మేము చెప్పడం లేదు.. ఆరోగ్య నిపుణులే స్పష్టం చేస్తున్నారు. పూర్వం నుంచే ఎన్నో ఔషధ గుణాలున్న దీనిని వివిధ వ్యాధుల చికిత్సల్లో, మందుల తయారీలో ఉపయోగిస్తున్నారంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Neem Leaves Benefits : వేపచెట్టును 'ఔషధ చెట్టు' అని కూడా అంటారు. వేపాకుల నుంచి మొదలు పువ్వులు, గింజలు, వేర్లు, బెరడు.. ఇలా అన్నింటీ ద్వారా ఎన్నో హెల్త్​ బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మ సంరక్షణకే కాదు ఆహార వంటకాలలో దీనిని ఉపయోగిస్తారు. అయితే చాలా మందికి ఈ విషయం తెలియక పెరట్లోనే ఉన్నా దీని ఆకులను పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోరు. అలాంటి వారు వేపాకుల ద్వారా కలిగే బెనిఫిట్స్ తెలుసుకున్నారంటే ఇకపై వాటిని వృథాగా పోనివ్వరంటే నమ్మండి! ఇంతకీ ఆ ప్రయోజనాలెంటంటే..?

వేప ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : గొప్ప ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన వేపాకులు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవేంటంటే..

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు : వేపాకుల్లో బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడే సహజ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లను నివారించడంలో చాలా బాగా సహాయపడతాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ : దీని ఆకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ స్వభావం శరీరంలోని వివిధ భాగాలలో మంట, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

చర్మ ఆరోగ్యం : చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మొటిమలు, తామర వంటి సమస్యలను పరిష్కరిస్తాయి. సాధారణంగా వేపాకులను ఎన్నో చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.

దంత సంరక్షణ : వేపాకులను నమలడం లేదా వేప ఆధారిత టూత్‌పేస్ట్ ఉపయోగించడం వల్ల చిగుళ్ల వ్యాధులు, కావిటీలను నివారించి నోటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది : వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతో దోహదం చేస్తాయి. శరీరాన్ని అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడతాయి.

రక్తంలో చక్కెర నియంత్రణ : కొన్ని అధ్యయనాల ప్రకారం.. వేప ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. ఇవి మధుమేహం ఉన్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటాయి.

క్యాన్సర్‌ను నివారిస్తుంది : వేపాకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో చాలా బాగా సహాయపడతాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది : జీర్ణక్రియ మెరుగుపడడానికి ఈ ఆకులు సహాయపడతాయి. వాటిలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాల కారణంగా జీర్ణాశయ అంతర సమస్యలను తగ్గించుకోవచ్చు.

గాయాలు నయం : వేపాకుల పేస్ట్‌ను గాయాలపై పూయడం వల్ల వేగంగా నయం అవుతాయి. అలాగే ఇన్‌ఫెక్షన్ల నివారణలో ఉపయోగపడతాయి.

జుట్టు ఆరోగ్యం : చుండ్రు సమస్య నుంచి బయటపడడానికి, జుట్టుకు సరైన పోషణను అందించడానికి వేపాకులను యూజ్ చేయవచ్చు. ఫలితంగా ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

చర్మ, కేశ సంరక్షణకు ఆయుర్వేదం చెప్పే వేప చిట్కాలు

వంటకాలలో వేపాకు ఉపయోగాలు..

కూరలలో : సూప్‌లు, కూరలకు ప్రత్యేకమైన చేదు రుచిని జోడించడానికి వేపాకులను వంటలో ఉపయోగించవచ్చు. చేదును సమతుల్యం చేయడానికి వాటిని తరచుగా ఇతర సుగంధ ద్రవ్యాలతో కలుపుతారు.

ఊరగాయలలో : వేపాకులను ఊరగాయలలో కూడా చేర్చవచ్చు. ఫలితంగా వాటి రుచిని మెరుగుపరచడంతో పాటు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

చట్నీలలో : చట్నీలలో వీటిని యాడ్ చేసుకోవచ్చు. ఇతర పదార్ధాల రుచులను కాంప్లిమెంటింగ్ చేయడంతో పాటు పోషకాహార ప్రోత్సాహాన్ని అందిస్తాయి.

బియ్యం వంటలలో : బిర్యానీలు లేదా పులావ్ వంటి బియ్యం వంటకాలకు వేపాకులను యాడ్ చేయడం ద్వారా ప్రత్యేకమైన రుచితో పాటు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను మీరు పొందవచ్చు.

పానీయాలలో : వేపాకులను నీటిలో ఉడకబెట్టడం ద్వారా హెర్బల్ టీలను తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఈ టీ ద్వారా వివిధ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చాలా మంది నమ్ముతారు. దానిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు హెల్త్​కు మేలు చేస్తాయని తరచుగా వినియోగిస్తారు.

గమనిక : వేపాకులను తగినంతలో కాకుండా ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే కొన్ని అనారోగ్య సమస్యలు ఎదరయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వేప చెట్టు నుంచి పాలు.. ఆమె మహిమేనట.. తాగితే రోగాలు మాయం అంటూ...

దోమలతో ఇబ్బందా?.. మీ ఇంట్లో ఈ మొక్కలను పెంచుకుంటే హాం ఫట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.