ETV Bharat / sukhibhava

నోటిలో పుండ్ల సమస్యకు కొన్ని వంటింటి చిట్కాలు!

మనం తీసుకున్న ఆహారం జీర్ణమై, తక్షణ శక్తినందించేందుకు పటిష్టమైన జీర్ణవ్యవస్థ అవసరం. అయితే ఆ జీర్ణవ్యవస్థకు ఆరంభ దశ నోటి నుంచి ప్రారంభమవుతుంది. అలాంటి భాగానికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే, ఆహారాన్ని ఘన రూపంలో కాదుకదా, కనీసం ద్రవరూపంలో తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమస్యే 'నోటి అల్సర్లు'. ఒక్కసారి ఈ సమస్య వచ్చిందంటే చాలు.. 24 గంటలు నొప్పి, మంటను భరిస్తూనే ఉండాలి. ఎంతటి తీపిపదార్థాలు తిన్నా, నోట్లో కారం వేసినట్లు మంట పుడుతుంది. అందుకే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి సహజపద్ధతుల్లో ఏమేం చేయచ్చో ఓసారి చూద్దామా..

natural remedies to control mouth ulcers in telugu

author img

By

Published : Aug 12, 2020, 11:39 AM IST

తులసి ఆకులు..

వాకిట్లో ఉండే తులసి మొక్కతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎన్నోరకాల అలర్జీలను తగ్గించడంలో ఈ ఆకులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తులసిలోని ఔషధగుణాలపై చేసిన పరిశోధనల్లో ఇందులో నోటి అల్సర్లను తగ్గించే లక్షణం కూడా ఉందని నిరూపితమైంది. దీనికోసం కొన్ని తులసి ఆకులను తీసుకొని, రోజుకు నాలుగైదు సార్లు వీటిని నమలడం వల్ల సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆకులను నమిలేటప్పుడు వాటికి కొన్ని నీళ్లు కూడా జతచేస్తే, ఆ ద్రావణం నోరంతా వ్యాపించి, సమస్యను త్వరగా తగ్గిస్తుంది.

sorethroatwinter650-6.jpg
తులసి ఆకులు

తేనె..

ఆహారపదార్థాలకు అదనపు రుచిని తేవడం, చర్మంపై గాయాలను మాన్పడమే కాకుండా నోటి అల్సర్లను తగ్గించడంలోనూ తేనె సమర్థంగా పనిచేస్తుంది. అల్సర్ల సమస్య ఎక్కువగా ఉన్నచోట తేనెను రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీమైక్రోబియల్ గుణాల కారణంగా అల్సర్లను కలిగించే బ్యాక్టీరియా త్వరగా నశిస్తుంది. తేనెలోని సహజగుణాలు నోటి లోపల తేమ ఉండేలా చేసి, అల్సర్ల వల్ల పొడిబారిన చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. తేనెను ఉపయోగించి, అల్సర్ల నుంచి మరింత త్వరిత ఉపశమనం పొందాలంటే, దానికి చిటికెడు పసుపు కలిపితే సరిపోతుంది.

mouthalcersghgh650-2.jpg
తేనె..

కొబ్బరి..

ప్రకృతిసిద్ధంగా ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కొబ్బరిది కీలకస్థానమే. నోటి అల్సర్లతో బాధపడేవారు కాస్త కొబ్బరి నూనెను నోట్లో సమస్యగా ఉన్నచోట రాస్తే ఉపశమనాన్ని పొందచ్చు. అలాగే ఎండుకొబ్బరి ముక్కలను నమిలినా, అల్సర్ల బాధ నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు. ఈ రెండు చిట్కాలు పాటించడం వీలుకానివారు లేత కొబ్బరిబోండం నీటిని ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి, అల్సర్ల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

గసగసాలు..

శరీరంలోని వేడిని తగ్గించడంలో గసగసాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. నోట్లో అల్సర్లు ఇబ్బంది పెట్టడానికి కారణం అధిక వేడే. అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి గసగసాలు చక్కటి ప్రత్యామ్నాయం. ఒక టేబుల్ స్పూన్ పొడిచేసిన గసగసాలకు, అంతే పరిమాణంలో పంచదారను జతచేసి, సమస్య తగ్గేంతవరకు రోజూ రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే మంచిది.

మరిన్ని ప్రత్యామ్నాయాలు..

  • నోటి అల్సర్ల నుంచి తక్షణ ఉపశమనానికి సమస్య ఉన్నచోట ఐస్ ముక్కలతో మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • అల్సర్ బాధిస్తున్నప్పుడు తరచూ లవంగాలు నమిలితే, ఆ ఘాటుకు సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. అయితే ఇలా చేసేటప్పుడు కాస్త మంటను భరించాల్సి ఉంటుంది.
  • గోరువెచ్చని నీటితో నోటిని వీలైనన్ని ఎక్కువసార్లు పుక్కిలించాలి. ఇలా చేస్తే అల్సర్ల కారణంగా ఎదురయ్యే మంట, నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందచ్చు.
  • చల్లని మజ్జిగను ఎక్కువగా తీసుకుంటే నోటి అల్సర్ల సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.
  • సమస్య ఉన్నచోట నెయ్యిని రాసినా మంచి ఫలితాన్ని పొందచ్చు.
  • ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని తప్పకుండా శుభ్రంగా పుక్కిలించుకోవాలి. లేదంటే నోట్లో మిగిలిపోయిన ఆహారపదార్థాల నుంచి వెలువడే ఆమ్లాలు నోటి అల్సర్లకు కారకాలుగా మారతాయి.
  • ప్రతి మూడు నెలలకోసారి టూత్‌బ్రష్‌ను మార్చడం వల్ల నోటి అల్సర్ల సమస్య రాకుండా చూసుకోవచ్చు.
  • సాధారణంగా శరీరంలో 'విటమిన్ బి12'శాతం తగ్గిపోతే నోటి అల్సర్లు వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. వైద్యుల సలహా మేరకు విటమిన్ బి12 మందులు వాడితే సమస్య పరిష్కారమవుతుంది.
immunityvitaminsgh650-3.jpg
విటమిన్ సి
  • 'విటమిన్ సి' పుష్కలంగా ఉండే కమలాపండు రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి అల్సర్లకు చెక్ పెట్టవచ్చు.
  • నోటి అల్సర్ల సమస్యతో బాధపడుతున్నప్పుడు టీ, కాఫీలకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు.
  • శరీరంలో ఎసిడిటీని ఎక్కువ చేసే మాంసాహారానికి కొద్దిరోజులు దూరంగా ఉంటే ఈ సమస్య అంతగా బాధించదు.
  • పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. వీలైతే వీటిని సలాడ్లలో కూడా జతచేసి తీసుకోవడం వల్ల నోటి అల్సర్ల సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.

అయితే ఇవన్నీ వంటింటి చిట్కాలు మాత్రమే... వీటిని కొద్ది రోజుల పాటు పాటించినా నోటిలో పుండ్ల సమస్య తగ్గకపోతే మాత్రం వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి. ఎందుకంటే ఇతరత్రా కొన్ని సీరియస్ ఆరోగ్య సమస్యలకు కూడా ఒక్కోసారి ఇది సూచిక కావచ్చు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు.

ఇదీ చదవండి: 'కోజికోడ్​ విమానాశ్రయ రన్​వే సురక్షితమైనదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.