Mindful Eating: బరువు నియంత్రణకు ఆహార పాత్ర కీలకమైంది. అంతేకాదు. మనసులో కడుపునిండిన భావనతో తినడం బరువును తగ్గిస్తుంది. దీనినే 'మైండ్‌ఫుల్ ఈటింగ్' అంటారు. అంటే తొందరగా తినకుండా ఆహారపదార్థాల రుచిని ఆస్వాదిస్తూ తినడం అన్నమాట. ఇలా తింటే ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ త్వరగా తినడం వల్ల కడుపునిండిన ఫీలింగ్ కలుగుతుంది కానీ మనసుకు తృప్తి కలగదు. చిన్న భాగాలుగా ఆహారాన్ని తినడం వల్ల మనసుకు కడుపునిండిన భావన కలుగుతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
వేగంగా తినేవాళ్లు తప్పకుండా స్థూలకాయం బారిన పడతారని ఇటీవల పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే.. నచ్చిన ఆహారం తినేప్పుడు గాబరాగా తినేస్తుంటాం. ఇందుకు మనసును నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇష్టమైన ఆహారం ఉన్నప్పటికీ తినేప్పుడు కాస్త విరామం ఇస్తూ తినాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: వేసవిలో షుగర్ పెరగడానికి కారణం అదే.. ఏం చేయాలంటే?