ETV Bharat / sukhibhava

నీరసం తగ్గి రోజంతా యాక్టివ్​గా ఉండాలా? - అయితే ఈ ఫ్రూట్స్ తినాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 11:57 AM IST

These Fruits Boosting Energy Levels : మనం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంలో జీవక్రియ కీలకం. కానీ, ప్రస్తుత రోజుల్లో వివిధ కారణాల చేత చాలా మందిలో మెటబాలిజమ్ రేటు తగ్గి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అలాకాకుండా ఉండాలంటే.. ఈ ఫ్రూట్స్​ను మీ డైలీ లైఫ్​లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Metabolism
Metabolism

Metabolism Boost Fruits Naturally : ప్రతి ఒక్కరూ రోజంతా ఫుల్ యాక్టివ్​గా, ఎనర్జిటిక్​గా ఉండాలని కోరుకుంటారు. అలా జరగాలంటే మన బాడీలో తగిన స్టామినా ఉండాలి. అప్పుడే మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉంటాం. ఇవన్నీ సాధ్యపడాలంటే ముందు మన జీవక్రియ సరిగ్గా పనిచేయాలి. అయితే ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి చాలా మందిలో జీవక్రియ(Metabolism)ను దెబ్బతీస్తూ.. అనారోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఇలా కాకుండా మీరు యాక్టివ్​గా ఉండాలంటే మెటబాలిజమ్ రేటును పెంచుకోవాలి. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. నేచురల్​గా లభించే పండ్లు తింటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మెటబాలిజమ్​ అంటే ఏమిటంటే.. ఇది బాడీ సక్రమంగా పనిచేయడానికి అవిశ్రాంతంగా పనిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. శ్వాస తీసుకోవడం దగ్గర నుంచి కను రెప్ప వేయడం వరకు అన్ని విధులకు ఇంధనం అందించేది మెటబాలిజమ్ ద్వారా వచ్చే ఎనర్జీ. అలాగే బాడీలో కేలరీలను బర్న్ చేయడానికీ ఇది బాధ్యత వహిస్తుంది. ఇవన్నీ సరిగ్గా జరగ్గాలంటే మన జీవక్రియ రేటు మెరుగ్గా ఉండాలి. ఇంతకీ ఆ పండ్లు ఏంటంటే..?

బెర్రీలు : బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ లాంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఆంథోసైనిన్లు జీవక్రియ రేటును పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి. అదనంగా వీటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ద్రాక్షపండ్లు : జీవక్రియను పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పండ్లలో ఒకటి.. ద్రాక్ష. వీటిలో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇది ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలనూ కలిగి ఉండి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. మీ అల్పాహారంలో ద్రాక్షపండ్లను చేర్చడం లేదా ఒక గ్లాసు తాజా ద్రాక్ష పండ్ల జ్యూస్‌ని తాగడం వల్ల ఆ రోజు జీవక్రియకు మంచి బూస్టింగ్ ఇవ్వొచ్చు.

యాపిల్స్ : మీ జీవక్రియ రేటును పెంచుకోవడానికి ఉపయోగపడే మరో సహజసిద్ధమైన ఫ్రూట్ యాపిల్. వీటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో పాటు ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఫలితంగా అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. అందుకే డాక్టర్లు కూడా రోజుకో యాపిల్ తీసుకోవాలని సూచిస్తుంటారు.

అవకాడో : ఇవి కూడా మెటబాలిజమ్​ పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు జీవక్రియను పెంచడంతో పాటు బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. కాబట్టి మీ ఆహారంలో అవకాడోలను చేర్చుకోవడం వల్ల బాడీలో స్థిరమైన శక్తి విడుదలను అందిస్తుంది. దాంతో ఆ రోజంతా యాక్టివ్​గా ఉంటారు.

Weight Loss Tips : అధిక బరువు సమస్యా? టైమ్​కు భోజనం చేయకపోతే ఇంకా నష్టం!

పుచ్చకాయ : ఈ హైడ్రేటింగ్ పండు రిఫ్రెష్‌గా ఉండటమే కాకుండా జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది. పుచ్చకాయలో అర్జినైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే అధిక నీటి కంటెంట్ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

పైనాపిల్ : పైనాపిల్ అనేది ట్రోపికల్ డిలైట్. ఇందులో బ్రోమెలైన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన ఎంజైమ్. మెరుగైన జీర్ణక్రియ, మరింత సమర్థవంతమైన జీవక్రియకు దోహదం చేస్తుంది. పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించే ప్రక్రియలో శరీర సామర్థ్యానికి మద్దతు ఇస్తుంది.

చెర్రీస్ : చెర్రీస్ తీపి, రుచికరమైనవి మాత్రమే కాకుండా జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలనూ కలిగి ఉంటాయి. అలాగే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మొత్తం జీవక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

అరటిపండ్లు : ఇవి కూడా మెటబాలిజమ్ పెంచడానికి ఉపయోగపడతాయి. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడంలో, సరైన కండరాల పనితీరుకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే అరటిపండ్లలో ఉండే సహజ చక్కెరలు రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కాకుండా త్వరిత శక్తిని అందిస్తాయి.

రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తే ఆరోగ్యం మరింత భద్రం!

టీ తాగేటప్పుడు ఈ స్నాక్స్ తింటున్నారా? - జాగ్రత్త, మీ ఆరోగ్యం డేంజర్​లో పడ్డట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.