ETV Bharat / sukhibhava

నడుం నొప్పా...మానసిక ఒత్తిడేమో ఒకసారి చూసుకోండి!

author img

By

Published : Feb 13, 2021, 4:42 PM IST

నడుం నొప్పి అనగానే ముందుగా వెన్నెముక సమస్య ఉందేమో, కండరాలేవైనా దెబ్బతిన్నాయేమో అనేవే మనకు గుర్తుకొస్తాయి. కానీ అవే కానక్కర్లేదు... మానసిక ఒత్తిడితోనూ నడుం నొప్పి, మెడ నొప్పి, తల నొప్పులు రావొచ్చట! అవును... చాలా మంది మగవారిలో ఒత్తిడి నడుం నొప్పితోనే బయటపడుతుంటుందట. ఇలాంటివే మిమ్మల్నీ వేధిస్తున్నట్టు గమనిస్తే ఒత్తిడికి గురవుతున్నారేమో కూడా ఒకసారి చూసుకోండి.

mental stress just like back pain Take a look
నడుం నొప్పా...మానసిక ఒత్తిడేమో ఒకసారి చూసుకోండి!

ఎవరికైనా నడుం నొప్పి అనగానే ముందుగా వెన్నెముక సమస్య ఉందేమో, కండరాలేవైనా దెబ్బతిన్నాయేమో అనేవే గుర్తుకొస్తాయి. కానీ మానసిక ఒత్తిడితోనూ నడుం నొప్పి, మెడ నొప్పి, తల నొప్పులు రావొచ్చు. మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజోల్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. నిజానికిది ఆయా పరిస్థితులు, ప్రమాదాల నుంచి కాపాడుకోవటానికి తోడ్పడేదే అయినా... నిరంతరం ఉత్పత్తి అవుతూ వస్తుంటే మాత్రం ముప్పు తప్పదు.

చిన్న పిల్లలనూ వదలటం లేదు...

ముఖ్యంగా నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవటానికి ఇది దారితీస్తుంది. దీంతో వెన్నెముక మీద భారం పెరుగుతుంది. అందుకే చాలామంది మగవారిలో ఒత్తిడి నడుం నొప్పితోనే బయటపడుతుంటుంది. కొందరు ఆడవారిలో వీపు పైభాగాన, భుజాల వద్ద, మెడ వద్ద కొవ్వు పేరుకుపోతుంటుంది. ఇది తలనొప్పులకు దారితీస్తుంది. ఒత్తిడి మూలంగా తలెత్తే నొప్పులు చిన్న పిల్లలనూ వదలటం లేదు. ముఖ్యంగా మెడ, వీపు మధ్య నొప్పులు వేధిస్తుంటాయి.

వేధిస్తున్నట్టు గమనిస్తే...

చాలామంది వీటిని మొబైల్‌ ఫోన్ల వాడకంతో వచ్చాయని భావిస్తుంటారు. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తేనే అసలు కారణం తెలుస్తుంది. కాబట్టి అకారణంగా నడుం నొప్పి, మెడ నొప్పి వేధిస్తున్నట్టు గమనిస్తే... నిర్లక్ష్యం చేయకుండా ఒత్తిడికి గురవుతున్నారేమో కూడా ఒకసారి చూసుకోండి. యోగా, ధ్యానం వంటి పద్ధతులతో తేలికగానే ఎవరికి వారు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: ప్రాజెక్టుల్లో అవినీతిపై కేంద్ర మంత్రికి బండి సంజయ్​ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.