ETV Bharat / sukhibhava

Medicine During Pregnancy : సొంత వైద్యం వద్దు.. మందుల విషయంలో జాగ్రత్త.. గర్భిణీలకు నిపుణుల సలహాలు! - కడుపుతో ఉన్నప్పుడు మందులు వాడవచ్చా

Medicine During Pregnancy : పిల్లలకు జన్మనివ్వడం ద్వారా ప్రతి మహిళ తన జీవితంలో మధుర క్షణాలను పొందుతుంది. పిల్లలను కనడానికి మహిళలు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతారు. ఈ నేపథ్యంలో గర్భంతో ఉన్నప్పుడు మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తీసుకునే మందుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

Precautions To Be Taken By Pregnant Women While Taking Medicines
Can We Take Medicine During Pregnancy
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 11:47 AM IST

Medicine During Pregnancy Safe : గర్భిణీలు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భిణీలు రకరకాల మందులను వాడుతుంటారు. ఈ సందర్భంగా వాటి వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మరి ఆ జాగ్రత్తలేంటంటే..

అవగాహన కలిగి ఉండాలి..!
Medicines In Pregnancy : ముందుగా గర్భిణీలు ఏ మందులు వాడాలి..? ఏవి వాడకూడదు..? అనే విషయాలను తెలుసుకోవాలి. చాలా మంది వివిధ సందర్భాల్లో చిన్నపాటి అనారోగ్య సమస్యలకు రకరకాల మందులు వాడుతుంటారు. గర్భం దాల్చినప్పుడు కూడా వాటిని వాడొచ్చా? లేకపోతే ఆపేయాలా? అనే విషయాలపై కూడా అవగాహనను కలిగి ఉండాలి. ఇందుకోసం వైద్యుల్ని సంప్రదించి వారి సూచన మేరకే మందులు వేసుకోవాలి.

అప్పుడే గర్భం దాల్చండి..!
Medication During Pregnancy : గర్భధారణకు ముందు నుంచే మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేయడానికి ముందే.. వైద్యుల్ని సంప్రదించాలి. వైద్యులు విటమిన్‌ సప్లిమెంట్స్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది. జీవనశైలిలో మార్పుల ద్వారా ఊబకాయం తగ్గించుకుని, మధుమేహం వంటి వ్యాధులు ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. ఆ తర్వాతనే గర్భం దాల్చాలి. గర్భం దాల్చిన తర్వాత కొన్ని రకాల మందులు మాములుగా వాడొచ్చు. అలర్జీ నివారణ మందులు కొనసాగించవచ్చు. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల వరకు జలుబు, ఫ్లూ వంటి వాటికి తీసుకునే మందుల వల్ల పెద్దగా సమస్యలు ఉండవు.

సొంత వైద్యం ప్రమాదకరం..!
మలబద్ధకానికి వాడే మందులు, ప్రాథమిక చికిత్స కోసం వాడే ఆయింట్‌మెంట్స్‌, క్రీములు గర్భిణీలకు 100 శాతం సురక్షితం అని చెప్పలేమని వైద్యులు అంటున్నారు. గర్భిణీలు వివిధ రకాల నొప్పులకు మందులు( Can I Take Medication While Pregnant )వాడకం కంటే ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న థెరపీలు చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఆ 12 వారాలు కీలకం..!
గర్భం దాల్చిన తర్వాత మొదటి 12 వారాలు చాలా కీలకం. ఈ దశలోనే శిశువులో అవయవాలు తయారవుతాయి. ఈ సమయంలో ఫోలిక్‌ యాసిడ్‌ తప్ప ఏ మందులను వాడకూడదు. యాంటీ బయాటిక్స్‌ తీసుకోవడంలోనూ అప్రమత్తత అవసరం. వీటిలో ఏ, బీ, సీ, డీ కేటగిరీలు ఉంటాయి. వీటిలో ఏ కేటగిరీ మందులు ఎంచుకోవడం ఉత్తమం.

దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే..?
Meds During Pregnancy : గర్భిణీలకు మొదటి 12 వారాల్లో ఇన్ఫెక్షన్స్‌ వచ్చినా, ఫిట్స్‌, షుగర్‌, బీపీ వంటి వ్యాధులు ఉన్నా.. ఫిజీషియన్‌, గైనకాలజిస్ట్‌ ఇద్దరి సలహాలు పాటిస్తూనే మందులు వాడాలి. వైద్యుల సలహా లేకుండా ఎటువంటి మందులు వాడకూడదు. గర్భిణీలకు 3 నెలల తర్వాత వైద్యులు ఐరన్‌, క్యాల్షియం, మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్స్ ఇస్తారు. కొన్ని మెడికేటెడ్ ప్రోటీన్‌ పౌడర్స్​ను కూడా సూచిస్తారు. డాక్టర్లు చెప్పిన మోతాదులో వాడితే తల్లికి, బిడ్డకు ఎటువంటి ప్రమాదం ఉండదు.

ఆ ఎఫెక్ట్​ తగ్గాకే ప్లాన్​ చేయండి..!
ఒకరికి ఉపయోగపడ్డ మందులు మరొకరికి ఉపయోగపడవు. ఇష్టం వచ్చినట్టు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్​ చేస్తేనే వాడాలి. కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఆ మందుల ప్రభావం శరీరం నుంచి తొలిగిపోయిన తర్వాతనే ప్రెగ్నెన్సీని ప్లాన్‌ చేసుకోవాలి. ఇందుకోసం కనీసం 3 నెలల ముందు నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకొని వాటి ప్రకారం నడుచుకోవాలి.

గమనిక : వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ మాత్రమే మందులు వేసుకోండి. డాక్టర్లకు చెప్పకుండా ఎటువంటి సొంత వైద్యానికి వెళ్లకండి.

మందుల విషయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

Mental Stress Relief Tips Telugu : మానసిక ఒత్తిడికి గురవుతున్నారా.. ఈ లక్షణాలున్నాయా.. ఐతే ఇలా చేయండి

Green Tea Health Benefits : గ్రీన్​ టీలో అద్భుత ఔషధ గుణాలు.. క్యాన్సర్​, గుండె జబ్బులకు చెక్​!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.