ETV Bharat / sukhibhava

మాస్కులను ఎప్పుడు ఎలా వాడాలి.. ఎవరు వాడకూడదు? - మాస్కులు ధరించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. జాగ్రత్తలు పాటించమని ప్రభుత్వాలు చెబుతున్నా.. కొందరి నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. ప్రజల నుంచి ప్రభుత్వాలు ముఖ్యంగా రెండు విషయాలు కోరుతోంది. ఒకటి సామాజిక దూరం పాటించడం.. రెండు మాస్కులు ధరించడం. ఇప్పుడు చాలా మంది సామాజిక దూరాన్ని బాగానే పాటిస్తున్నారు. కానీ మాస్కుల విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తున్నారు? మీరు ధరిస్తున్న మాస్కులు ఎంత వరకు రక్షణ కలిగిస్తాయి?

mask is how much protective amid corona
మాస్కులను ఎప్పుడు ఎలా వాడాలి.. ఎవరు వాడకూడదు?
author img

By

Published : Jun 26, 2020, 4:08 PM IST

కొన్ని వైరస్‌లు ఊపిరితిత్తులపైనే దాడి చేస్తాయి. ప్రస్తుతం మనల్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ కూడా ఇదే కోవకు చెందింది. వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినా.. దగ్గినా.. మాట్లాడినా వెలువడే తుంపర్లలో ఉండే ఈ వైరస్‌ ఎదుటివాళ్ల నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి.. శ్వాసనాళాల వద్ద తిష్ఠ వేస్తాయి. దీంతో మనిషి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడతాడు. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. అందుకే కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా మాస్కులు ధరించాలని పలు ఆరోగ్య సంస్థలు.. ప్రభుత్వాలు సూచనలు చేశాయి. దీంతో ప్రజలు మార్కెట్‌లో లభించే సర్జికల్‌, ఎన్‌ 95 మాస్కులు, ఇంట్లో కుట్టిన మాస్కులు, చేతిరుమాళ్లు ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది వాడేస్తున్నారు. అయితే అన్ని సందర్భాల్లోనూ ఒకే రకం మాస్కు వాడటం మంచిది కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. అసలు ఈ మాస్కులను ఎప్పుడు ఎలా వాడాలి.. ఎవరు వాడకూడదు ఓ సారి చూద్దాం.

ఎన్‌ 95 మాస్కులు

దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న కొత్తలో చాలా మంది విపరీతంగా ఈ ఎన్‌95 మాస్కులను కొని వాడారు. ఇప్పటికి కొంత మంది వాటిని వాడుతున్నారు. నిజానికి వీటిని సాధారణ వ్యక్తులు వాడాల్సిన అవసరం లేదు. కరోనా సోకిన వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది.. కరోనా సోకిన వ్యక్తులను కలిసినప్పుడు, సామాజిక దూరం పాటించలేని సమయంలో సాధారణ వ్యక్తులు వీటిని వాడితేనే ఉపయోగకరం. సర్జికల్‌ మాస్కు కన్నా కాస్త దళసరిగా ఉండే ఈ మాస్కు గాలిని బాగా ఫిల్టర్‌ చేస్తుంది. నోరు, ముక్కును పూర్తిగా కప్పి ఉంచుతుంది. దీంతో ఈ మాస్క్‌ సూక్ష్మక్రిములను 95శాతం అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనికి ఎన్‌ 95 అని పేరొచ్చింది. అయితే ఇది గరిష్ఠంగా 8 గంటలు బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగొచ్చు. వీటిని రెండు మూడు సార్లు మాత్రమే ఉపయోగించగలం. శుభ్రపర్చి మళ్లీ వాడటం అంత శ్రేయస్కరం కాదు.

సర్జికల్‌ మాస్కులు

మూడు పొరలతో ఉండే సర్జికల్‌ మాస్కుల ధర తక్కువే. విరివిరిగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ వీటిని కచ్చితంగా ఉపయోగించాలి. కరోనా సోకిన వ్యక్తుల వద్దకు.. లేదా అనుమానుతుల వద్దకు ఈ మాస్కును ధరించి వెళ్లకూడదు. సామాజిక దూరం పాటించే అన్ని చోట్లా ఈ మాస్కులు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి.

ఇంట్లో తయారీ చేసిన మాస్కులు.. రుమాలు

సర్జికల్‌ మాస్కులు అందుబాటులో లేకపోతే.. ఇంట్లోనే వస్త్రంతో కుట్టిన మాస్కులు లేదా రుమాలు ధరిస్తున్నారు. ఇది మంచి పరిణామమే. కానీ మాస్కు కోసం ఎంచుకునే ఏ వస్త్రమైనా గాలి సరఫరా సరిగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ పొరలు పెట్టి కుడితే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగొచ్చు. కాబట్టి వీలైనంత పలచగా మాస్కు ఉండాలి. నోరు, ముక్కును పూర్తిగా కవర్‌ చేసేలా మాస్కును ధరించాలి. వదులుగా ఉంటే వైరస్‌ సోకే ప్రమాదముంది. వస్త్రమే కాబట్టి ఉతికి మళ్లీ మళ్లీ వినియోగించుకోవచ్చు. సామాజిక దూరం పాటిస్తూ.. జనసాంద్ర తక్కువ ఉండే ప్రాంతాలు, గాలి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వీటిని ధరించొచ్చు.

మాస్కులు ధరించడంలో జాగ్రత్తలు:

  1. రెండేళ్లలోపు చిన్నారులు.. శ్వాససంబంధిత వ్యాధులున్న వారు ఈ మాస్కులను ధరించకపోవడం మంచిది.
  2. వ్యాయామం చేసే సమయంలో మాస్కులు ధరిస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశముంది.
  3. ఇంట్లో, కారులో ఒంటరిగా ఉన్నప్పుడు మాస్కు ధరించాల్సిన అవసరం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.