ETV Bharat / sukhibhava

Liver Problem Remedies In Telugu : అతిగా ఆల్కహాల్ తీసుకుంటున్నారా?.. కాలేయం దెబ్బతినే ప్రమాదముంది.. జాగ్రత్త!

Liver Problem Remedies In Telugu : అనారోగ్యకరమైన జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు వ‌ల్ల కాలేయ సంబంధ స‌మ‌స్య‌లు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ కాలేయ సంబంధ వ్యాధులను ఎలా గుర్తించాలి? వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Liver Problem Treatment
Liver Problems
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 8:11 AM IST

Liver Problem Remedies In Telugu : మారుతున్న జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్ల‌తో ప్రజలు అనేక ర‌కాల వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ఒక‌వైపు వృత్తిరీత్యా ఒత్తిడి పెరిగిపోతోంది. మ‌రోవైపు శారీర‌క శ్ర‌మ త‌గ్గ‌ుతోంది.. దీంతో లేనిపోని రోగాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో అనేక మందిలో కాలేయ సంబంధ స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. మరి దీనికి కారణం ఏమిటి? ఈ కాలేయ సమస్యల బారిన ప‌డ‌కుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాధి లక్షణాలు : ప్రస్తుత కాలంలో కాలేయ స‌మ‌స్య‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. హెప‌టైటిస్- ఏ వ్యాధి బారినప‌డ్డవారిలో అస్వ‌స్థ‌త‌, జ్వ‌రం, ఆకలి లేక‌పోవ‌డం, విరేచ‌నాలు, వికారం, క‌డుపులో మంట‌, క‌ళ్లు, చ‌ర్మం ప‌సుపు రంగులోకి మార‌టం క‌నిపిస్తాయి. ఇక హెప‌టైటిస్- బి ల‌క్ష‌ణాలు మొద‌ట్లో పెద్ద‌గా ఉండ‌వు కానీ కొంద‌రిలో క‌ళ్లు, చ‌ర్మం ప‌చ్చ‌గా మార‌టం, కొద్దిగా జ్వ‌రం, అల‌సట‌, వికారం, క‌డుపు నొప్పి, కీళ్ల నొప్పులు లాంటివి ఉంటాయి. దీని బారిన ప‌డితే.. ప్రారంభ ద‌శ‌లో పెద్దగా మందుల అవ‌స‌రం ఉండ‌దు. ఆ స‌మ‌యంలో ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లేవీ లేక‌పోతే పోష‌కాహారం, త‌గినంత విశ్రాంతి తీసుకుంటే చాలు.

లివర్ జాగ్రత్త!
మ‌న శ‌రీరంలోని అత్యంత ముఖ్య‌మైన అవయవాలలో కాలేయం ఒక‌టి. మ‌నం తీసుకునే ఆహారంలోని టాక్సిన్స్​ వల్ల.. ప‌లు ర‌కాల ఇన్ఫెక్ష‌న్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ముఖ్యంగా నీటి ద్వారా హెప‌టైటిస్-ఏ, హెప‌టైటిస్- బి వస్తాయి. ఇది ప్ర‌మాద‌క‌రం. ర‌క్తం క‌లుషితం అవ్వ‌డం, లేదా కలుషితమైన రక్తం ఎక్కించడం వ‌ల్ల‌, కండోమ్ లేకుండా సెక్స్​లో పాల్గొన‌డం వ‌ల్ల ఈ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మ‌న లైఫ్ స్టైల్ మార‌డం వ‌ల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉంది. స‌రైన ఆహారం తీసుకోక‌పోవ‌డం వల్ల లివ‌ర్​లో కొవ్వు చేరి నాష్ అనే జ‌బ్బు వ‌స్తుంది. దీని వ‌ల్ల లివ‌ర్ సాధార‌ణ ప్ర‌క్రియ దెబ్బతింటుంది.

మత్తు పదార్థాలు తీసుకోవద్దు!
అతిగా ఆల్క‌హాల్ తీసుకోవడం వల్ల కూడా లివ‌ర్ చెడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మితిమీరి మందు తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ టాక్సిన్​గా మారుతుంది. ఇది ఇలాగే కొన‌సాగితే.. లివ‌ర్ సిరాటిక్ స్థాయికి వెళుతుంది. ఒక్క‌సారి ఆ స్థాయికి చేరితే.. లివ‌ర్ డ్యామేజ్​ని మ‌నం కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. వాస్తవానికి హెప‌టైటిస్-సి తొలి ద‌శ‌లోనూ పెద్ద‌గా ల‌క్ష‌ణాలు ఉండ‌వు. హెప‌టైటిస్- బి మాదిరిగానే ఉంటాయి. కానీ ఇది కొంద‌రిలో దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌గా మార‌వ‌చ్చు. కొందరిలో అయిదేళ్ల‌లోనే ఇది ప్రారంభం కావ‌చ్చు.

వ్యాధిని గుర్తించడం ఎలా?
ర‌క్తాన్ని ప‌రీక్షించ‌డం వ‌ల్ల ఈ ఇన్ఫెక్ష‌న్ల‌ను గుర్తించ‌వ‌చ్చు. కొన్ని ర‌కాల హెర్బ‌ల్ ప్రొడ‌క్టుల వ‌ల్ల కూడా లివ‌ర్ డ్యామేజ్ అవుతుంది. అందుకే వీటిని వాడేముందు ఒకసారి డాక్టర్ల సలహాను తీసుకోవడం మంచిది. చాలా ర‌కాల ఇన్ఫెక్ష‌న్లు క‌లుషిత‌మైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల్లే వ‌స్తాయి. కనుక సుచి, శుభ్రత కలిగిన ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం ముఖ్యం. వీలైనంత మ‌ట్టుకు బ‌య‌టి ఆహార ప‌దార్థాలు తీసుకోక‌పోవ‌డం ఉత్త‌మం. దీంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు లివ‌ర్​కి సంబంధించిన ఎల్ఎఫ్‌టీ లాంటి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. దీని వ‌ల్ల వాటి లివర్ ఆరోగ్య స్థితి తెలుస్తుంది.

వీటిని నియంత్రంచాల్సిందే!
మ‌న కాలేయం దెబ్బ‌తిన‌డానికి చాలా ర‌కాల కార‌ణాలున్నాయి. ముఖ్యంగా మోతాదుకు మించి ఆహారం తీసుకోవ‌డం, జంక్ ఫుడ్, వేపుళ్లు తిన‌డం, ఒత్తిడి, ఆందోళ‌న‌, పొగ‌తాగ‌డం, మ‌ద్యం తాగ‌డం లాంటి అల‌వాట్లు ప్ర‌ధాన కార‌ణాలు. అందుకే ఇలాంటి అలవాట్లను వీలైనంత వరకు మానుకోవాలి. రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా వాకింగ్ చేయాలి. కండ‌రాలు బ‌లోపేతం చేసే వ్యాయామాల‌పై దృష్టి పెట్టాలి. హెప‌టైటిస్-బి నివార‌ణ‌కు టీకా ఉంది. అయితే హెప‌టైటిస్- సి రాకుండా ఉండేందుకు ర‌క్త మార్పిడి స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

Child Hyperactivity Disorder : పిల్ల‌లు అతిగా అల్ల‌రి చేస్తున్నారా?.. అయితే ఓ క‌న్నేసి ఉంచండి

Best Yoga Asanas For Memory Improvement : మీ పిల్లల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలా?.. ఈ యోగాసనాలతో ఫలితం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.