ETV Bharat / sukhibhava

పిరియడ్స్‌లో.. ఇటు బ్లీడింగ్‌, అటు పీపీఈ కిట్లు.. మా బాధ వర్ణనాతీతం!

గత కొన్ని నెలలుగా కంటికి కనిపించని శత్రువుతో అలుపెరగని యుద్ధం చేస్తున్నారు వైద్యులు, నర్సులు. కొవిడ్‌ రోగులకు సేవలందించే క్రమంలో శారీరకంగా, మానసికంగా వారు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఇక దీనికి తోడు నిరంతరాయంగా వారు ధరించే పీపీఈ కిట్లు వారికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మహిళా వైద్య సిబ్బందిని మరో సమస్య వేధిస్తోంది. అదే నెలసరి. దానికి వేళాపాళా ఉండదు.. సమయం, సందర్భంతో పనిలేదు.

lady doctors problems in covid time
పిరియడ్స్‌లో.. ఇటు బ్లీడింగ్‌, అటు పీపీఈ కిట్లు.. మా బాధ వర్ణనాతీతం!
author img

By

Published : Jun 16, 2020, 1:54 PM IST

కొవిడ్‌ రోగులకు సేవలందించే మహిళా వైద్య సిబ్బందైనా, సాధారణ మహిళలైనా.. ఎప్పుడైనా, ఎక్కడున్నా నెలనెలా ఈ అనుభవం ఎదుర్కోవాల్సిందే! అయితే సాధారణంగా పీపీఈ కిట్లు ధరిస్తే దాదాపు ఆరు గంటల దాకా వాష్‌రూమ్‌కి వెళ్లే అవకాశం ఉండదు. అలాంటిది పిరియడ్స్‌ సమయంలో అటు బ్లీడింగ్‌, ఇటు పీపీఈ కిట్లతో విపరీతమైన చెమట.. ఇలాంటి ప్రతికూలతల మధ్య మహిళా వైద్య సిబ్బంది కొవిడ్‌ రోగులకు సేవలందించడమంటే కత్తి మీద సామే!

అలాంటి పరిస్థితి తనకూ ఎదురైందని అంటోంది ముంబయికి చెందిన ఓ మహిళా డాక్టర్‌. అయితే తాను ఈ సమయాన్ని ఎలా మేనేజ్‌ చేసుకుంది?, కరోనా రోగులకు సేవలందించే క్రమంలో తనకెదురైన ఇతర అనుభవాలేంటి?, తన జీవితంలోని పలు వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావిస్తూ.. ఓ సుదీర్ఘమైన లేఖ రాసిందీ కొవిడ్‌ వారియర్‌. ‘రెసిడెంట్‌ డాక్టర్స్‌ కేఈఎం హాస్పిటల్‌’ ఫేస్‌బుక్‌ పేజీలో ఓ సుదీర్ఘ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ రూపంలో ఉన్న ఈ లేఖ సారాంశమేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి..

హాయ్‌.. నా పేరు రేష్మా షిండే. నేను ముంబయిలోని కేఈఎం హాస్పిటల్‌లోని పాథాలజీ విభాగంలో జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. ప్రస్తుత కొవిడ్‌ ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి నా వంతుగా సేవ చేస్తున్నందుకు ఎంతో గర్వంగా, గొప్పగా అనిపిస్తోంది. అయితే కరోనా మహమ్మారితో చేస్తోన్న ఈ యుద్ధంలో మహిళలుగా రోజూ మాకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటి గురించి కాస్త వివరంగా, లోతుగా చెప్పడానికి ఇప్పుడు ఇలా మీ ముందుకొచ్చా. ముందుగా నా వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటా.

వ్యక్తిగత ఆసక్తితో పాటు, కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయించవచ్చన్న ఉద్దేశంతో పాథాలజీ విభాగంలో డాక్టర్‌గా సేవలందించాలని నిర్ణయించుకున్నా. అయితే ఈ క్రమంలో ఇకపై నా భవిష్యత్తంతా పాథాలజీ ల్యాబ్స్‌ అనే చిన్న ప్రపంచంలోనే తిరుగుతుందని, అప్పుడప్పుడూ పోస్ట్‌మార్టమ్స్‌ కూడా చేయాల్సి రావచ్చనే విషయం నెమ్మదిగా గ్రహించా. కానీ ఈ కొవిడ్‌ సమయంలో ల్యాబ్‌ దాటి బయటికి వచ్చా. ఈ క్రమంలో ఇతర రోగులకు సేవలందించడం, వివిధ విభాగాల్లో, ఇతర డాక్టర్లతో ఇంటరాక్ట్‌ అవుతూ.. వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. నా కెరీర్‌లో ఇదో భిన్నమైన అనుభూతి.

lady doctors problems in covid time
పిరియడ్స్‌లో.. ఇటు బ్లీడింగ్‌, అటు పీపీఈ కిట్లు.. మా బాధ వర్ణనాతీతం!

మూడేళ్లు వెనక్కి వెళ్తే.. అప్పుడు నేను ఇంటర్న్‌షిప్‌లో ఉన్నా. ఆ సమయంలో నాకు ఉన్నత కుటుంబాల నుంచి ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. కానీ ఆ సమయంలో నేను పెళ్లి చేసుకోవడానికి, కొత్త బాధ్యతలను నా భుజాలపై వేసుకోవడానికి సిద్ధంగా లేను. అయితే అంతకుముందు ‘మహిళలు-ఆర్థిక స్వేచ్ఛ’ అనే అంశం గురించి నేను ఒక ఆర్టికల్‌ చదివాను. అందులో ప్రియాంక చోప్రా ఓ సందర్భంలో చెప్పిన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి.

‘మహిళలు ఆర్థికంగా స్వతంత్రులైతే వారికి నచ్చినట్లుగా జీవితం కొనసాగించచ్చు. మనం ఎవరిని పెళ్లి చేసుకున్నామన్నది ముఖ్యం కాదు.. ఆర్థికంగా మరొకరిపై ఆధారపడకుండా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. అందుకే ముందుగా మహిళలు తమ సొంత కాళ్లపై తాము నిలబడడంతో పాటు తాము ఇష్టపడే వ్యక్తుల బాధ్యతలు తామే నిర్వర్తించేంత సమర్థులు కావాలి..’ అంటూ ఆ ఆర్టికల్‌లో భాగంగా ప్రియాంక చెప్పిన మాటలు నాలో సరికొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించాయి.

ఇక అప్పట్నుంచి నాకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ ఎలా చెడగొట్టాలో ముందుగానే సాకుల్ని సిద్ధం చేసి పెట్టుకున్నా. ఈ క్రమంలో కొన్నిసార్లు అమ్మానాన్నలకు, నాకు మధ్య చిన్న పాటి గొడవలు కూడా అయ్యాయి. ఆ తర్వాత వాళ్లే నన్ను అర్థం చేసుకొని.. నన్ను నన్నుగా ఉండనిచ్చారు. ఇక ప్రస్తుతం నేను కొవిడ్‌ సేవలో భాగమవుతున్నందుకు మా చుట్టుపక్కల వాళ్లు, బంధువులు అంతా నన్ను ప్రశంసిస్తున్నారు. మా కుటుంబాన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

అయితే ఇదే సమయంలో నాకు పెళ్లి సంబంధాలు రావడం ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇందుకు కారణం కొవిడ్‌ అని, దీనిపై ప్రస్తుతం మన సమాజంలో అలుముకున్న భయాలు, అపోహలే కారణం అని తెలుసుకున్నాక కాస్త బాధగా అనిపించింది. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా పెళ్లి చేసుకోవాలనుకున్న నా కలలు ఆ క్షణం ఒక్కసారిగా ఆవిరైనట్లనిపించింది. నా ఫీలింగ్స్‌ని నా సహోద్యోగులతో పంచుకున్నప్పుడు వాళ్లూ అదే ఆందోళనను వెలిబుచ్చారు. దాంతో నా మనసు మరింత గందరగోళంలో పడిపోయింది.

ఓ రోజు నాకో కాల్‌ వచ్చింది. నాతో పాటు పనిచేస్తోన్న మరో మహిళా ల్యాబ్‌ టెక్నీషియన్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో నేను కూడా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలన్నది ఆ కాల్‌ సారాంశం. అయితే ఆ పాజిటివ్‌ వచ్చిన మహిళ రెండేళ్ల చిన్నారికి తల్లి. ఒక తల్లి తన చిన్నారికి ఈ విధంగా దూరమవడం ఎంత కష్టమో ఆమెను చూస్తే నాకు అర్థమైంది. అప్పటిదాకా నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నందుకు ఆ భగవంతుడికి ఆ క్షణం నేను థ్యాంక్స్‌ చెప్పుకున్నా. ఎందుకంటే ఒకవేళ నాకు పెళ్లై ఉంటే అప్పటికి ఏడాది లేదంటే రెండేళ్ల పిల్లో, పిల్లాడో ఉండేవారు.

కొవిడ్‌ డ్యూటీ చేసిన తర్వాత ఆ బేబీకి దూరంగా స్వీయ నిర్బంధంలో ఉండడం కంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిదనిపించింది. కానీ అదే సమయంలో కరోనా పోరులో భాగమైన ఇలాంటి తల్లులపై నాకున్న గౌరవం రెట్టింపైంది. నిజానికి భయమనేది కరోనా పాజిటివ్‌లో లేదు.. దాని చుట్టూ అలుముకున్న అపోహలు, తప్పుడు నమ్మకాల్లో ఉంది. ఒకవేళ రాబోయే రోజుల్లో నాకు కరోనా పాజిటివ్‌ అని తేలితే.. నా జీవిత భాగస్వామిని వెతుక్కోవడం కష్టమైతే కావచ్చు.. కానీ దేశానికి సేవ చేయకుండా మాత్రం నన్నేదీ ఆపలేదు. నన్ను నన్నుగా అర్థం చేసుకుని, ఒక యోధురాలిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలనే వారియర్‌ నాకు కచ్చితంగా దొరుకుతాడనే గట్టి నమ్మకం నాకుంది.

lady doctors problems in covid timelady doctors problems in covid time

ఇక కరోనా వైరస్‌తో పోరాడే మహిళా వైద్యులకు ఎదురయ్యే మరో సవాలు.. పిరియడ్స్‌. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నెలసరి రాకుండా ఆగదు కదా! ఒక మహిళా డాక్టర్‌గా ఈ సమయంలో ఎదురయ్యే పిరియడ్స్‌ అసౌకర్యం గురించి మాట్లాడకపోతే.. కొవిడ్‌ రోజుల్లో మేము ఎదుర్కొంటోన్న సమస్యలు, సవాళ్ల గురించి ప్రపంచానికి ఎలా తెలుస్తుంది చెప్పండి? అందుకే ఈ సమయంలో నాకెదురైన ఓ అనుభవం గురించి మీకు చెబుతా.

కొవిడ్‌ రోగులకు సేవలందించే క్రమంలో ధరించే పీపీఈ కిట్ల వల్ల వచ్చే చెమట, నెలసరి బ్లీడింగ్‌.. ఇది తలచుకుంటేనే ఓ రోజు నా మనసంతా కకావికలమైపోయింది. అయితే మొదట్లో నా రుతుచక్రానికి అనుగుణంగా నా విధులు మార్చుకుంటూ సౌకర్యవంతంగా నా డ్యూటీని మేనేజ్‌ చేసుకున్నా. ఈ క్రమంలో నా ఫీలింగ్స్‌ గురించి నా సహోద్యోగులతో పంచుకున్నప్పుడు.. వారూ ఇలాంటి అనుభవాలనే నాతో షేర్‌ చేసుకున్నారు.

ఇటీవలే ‘నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా ఓ ఆర్టికల్‌ చదివా. అందులో భాగంగా అనస్తీ్షియా విభాగంలో పనిచేసే ఓ మహిళా డాక్టర్‌ తన నెలసరి అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. తన పనిలో నిమగ్నమై ప్రస్తుతం తాను నెలసరిలో ఉన్నానన్న విషయమే మర్చిపోయానని, అయితే పీపీఈ ధరించిన రెండు గంటల తర్వాత తనకు బ్లీడింగ్‌ ఎక్కువవడాన్ని గమనించినప్పటికీ.. తాను వేసుకున్న పీపీఈని వృథా చేయడం ఇష్టం లేక తన విధుల్లోనే కొనసాగినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అయితే అది వాటర్‌ప్రూఫ్‌ది కావడం వల్ల నిర్భయంగా తన పనిని కొనసాగించినట్లు ఆమె వివరించారు.

ఇక తన డ్యూటీ ముగిశాక తాను వేసుకున్న పీపీఈ కిట్‌ను తొలగించి దాన్ని శానిటైజ్‌ చేసి పడేయడానికి 45 నిమిషాలు పట్టినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఇలా ఆమె పిరియడ్‌ స్టోరీ చదివిన తర్వాత నేనే కాదు.. నాలా ఎంతోమంది ఈ కొవిడ్‌ డ్యూటీ సమయంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారని రియలైజ్‌ అయ్యా. ఇలాంటి ప్రతికూలతలను అధిగమిస్తూ ముందుకు సాగుతోన్న వారే నిజమైన కరోనా యోధులు!

ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ముందుండి మహమ్మారితో పోరాటం చేస్తోన్న మాకు రోజూ ఇలాంటి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినా వీటిని అధిగమిస్తూ ముందుకు సాగేలా ప్రత్యేక శక్తుల్ని మాకు అందించిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు. డాక్టర్‌ లాంటి గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నందుకు నిజంగా మేమంతా ఎంతో పుణ్యం చేసుకున్నాం.. ఇక ఆఖరుగా మీకు చెప్పదలచుకున్నది ఒక్కటే.. కరోనాకు భయపడకండి.. అది సోకిన వారిపై వివక్ష చూపకండి.. మీ కోసం మేమున్నాం.. మీరంతా తగిన జాగ్రత్తలు పాటించండి.. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించండి.. బయటికెళ్తే తప్పనిసరిగా మాస్క్‌ ధరించండి.. ఇదే మీరు మాకు చేసే గొప్ప ఉపకారం..!

ఇట్లు,
రేష్మ.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.