Kidney Stones Diet In Telugu : ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్లు రావడం అనేది అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. ఆడవారితో పోలిస్తే మగవారిలోనే ఇలాంటి కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలితో పాటు పర్యావరణ కారకాలు, నీళ్లు తక్కువగా తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, డయాబెటిస్ లాంటివి కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు కారణం అవుతున్నాయి. మరి కొన్ని ఆహార పదార్థాలను మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్లు ఉన్న వ్యక్తులు పడే బాధ అంతా ఇంతా కాదు. పొత్తి కడుపులో నుంచి పొడుచుకొని వచ్చే నొప్పి, మూత్ర విసర్జనకు వెళ్లాలంటే వచ్చే మంట మనల్ని వేధిస్తూ ఉంటాయి. కిడ్నీలో రాళ్లను గనుక నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్, మూత్రనాళంలో అడ్డుపడటం, రక్తస్రావం లాంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకోసం పలు రకాల ఆహార పదార్థాల( Kidney Stones Diet )ను తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటంటే..
కాల్షియం..
Kidney Stones Diet Food : కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీలో రాళ్లు తగ్గిపోతాయి. కాల్షియం ఉండే పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే కిడ్నీల సమస్య తగ్గడమే కాకుండా శరీరానికి కావాల్సిన మినరల్స్, ప్రొటీన్స్ కూడా అందుతాయి. అందులో భాగంగా తక్కువ కొవ్వు ఉండే పాలు, పెరుగు, జున్ను లాంటి వాటిని రోజూ తీసుకోవాలి. ఒక రోజులో 800 నుంచి 1200 గ్రాముల కాల్షియం తప్పక తీసుకోవాలి. ఇది మీ ఎముకలను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లనూ తగ్గిస్తుంది.
ఆకుకూరలు..
Kidney Stones Diet Food List : కిడ్నీ డైట్ పాటించేవారు ఆకుకూరల్ని ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీ, బ్రకోలి లాంటి వాటిని తరచూ తీసుకోవాలని అంటున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకోవడంలో ఆకుకూరలు బాగా తోడ్పడతాయట. మెగ్నీషియం అధికంగా ఉండే ఆకుకూరలు శరీరంలో శోషణాన్ని తగ్గిస్తాయి. వీటిని అధికంగా తినడం వల్ల కిడ్నీలతో పాటు పూర్తి ఆరోగ్యానికి కూడా మంచిది.
ఆమ్ల ఫలాలు..
Kidney Stones Diet Fruits : కిడ్నీలో రాళ్లను నివారించడంలో ఆమ్ల ఫలాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి కిడ్నీ స్టోన్ డైట్ పాటించేవాళ్లు ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ, ద్రాక్షపండ్లను అధికంగా తింటూ ఉండాలి. ఈ పుల్లటి పండ్లలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లను తొలగించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. తెల్లరర్తకణాల ఏర్పాటుకు సహకరించే ఆమ్ల ఫలాల( Vitamin C For Kidney Patients ) వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లను కూడా నివారించొచ్చు.
విటమిన్-డీ..
Vitamin D Foods For Kidney Patients : విటమిన్-డీ ఉండే ఆహార పదార్థాల్లో కాల్షియం ఎక్కువగా దొరుకుతుంది. విటమిన్-డీ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల ఎముకలతో పాటు కిడ్నీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు లాంటి వాటిల్లో విటమిన్-డీ ఎక్కువగా దొరుకుతుంది. వీటిని రోజువారీ భోజనంలో చేర్చుకుంటే ఎన్నో లాభాలుంటాయని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాల్షియంను శరీర అవసరాలకు తగ్గట్లుగా వాడుకోవడంలో విటమిన్-డీ సాయపడుతుంది. విటమిన్-డీ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూనే ఉదయం పూట సూర్యరశ్మి మీ శరీరానికి తగిలేలా చూసుకోవాలి.
చిక్కుళ్లు..
Kidney Stones Diet Vegetables : మాంసాహారం తీసుకోకుండానే మీ శరీరానికి ప్రోటీన్లు అందాలంటే పలు రకాల కూరగాయల్ని తీసుకోవాల్సి ఉంటుంది. చిక్కుళ్లు, బీన్స్‌తో పాటు పన్నీర్, చిరుధాన్యాలను కూడా తరచూ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి మొక్కల ఆధారిత ఆహార పదార్థాలను భోజనంలో చేర్చుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా కిడ్నీలో రాళ్ల సమస్య కూడా తగ్గుతుందని అంటున్నారు.
నీళ్లు..
Kidney Stones Water Intake : కిడ్నీలో రాళ్లను తగ్గించుకోవాలనుకునే వారు నీళ్లను బాగా తాగుతూ ఉండాలి. అదే సమయంలో నీళ్ల శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను కూడా తీసుకుంటే మంచిది. పుచ్చకాయ, కీరదోసకాయ, బెర్రీలు లాంటి వాటిల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే శరీరంలో నీటి శాతం పెరగడమే కాకుండా విటమిన్స్, మినరల్స్ కూడా అందుతాయి. వీటిని తినడం కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.
కిడ్నీల ఆరోగ్యం కోసం ఏ ఆహారం తీసుకోవాలంటే