Pimples Treatment: సౌందర్యపరంగా అమ్మాయిలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి. ముఖంపై మొటిమలు రావడానికి వయసు, హార్మోన్ల ప్రభావం సహా ఇతరత్రా కారణాలు ఉండొచ్చు. వీటిని తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అయినా సరైన ప్రయోజనం ఉండదు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం డాక్టర్లు ఏం చెప్పారో చూడండి.
వయసు పెరుగుతున్నకొద్దీ శరీరంలో వచ్చే మార్పుల్లో మొటిమలు కూడా ఒకటని చెబుతున్నారు వైద్యులు. అలా అని.. నిర్లక్ష్యం చేయకుండా మొటిమలు తగ్గేందుకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చని అంటున్నారు. డెర్మటాలజిస్ట్ సలహాతో సరైన చికిత్సతో.. మంచి స్కిన్‌ను సొంతం చేసుకోవచ్చని వివరించారు. ముందు.. పసుపు, నిమ్మరసం రాసుకోవడం వంటి ఇంటి చిట్కాలు మానేయాలని హితభోద చేస్తున్నారు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్‌తో మరింత ఇబ్బందిగా మారి.. చర్మం నిర్జీవంగా మారడం, నల్లగా అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీనితో సమస్య మరింత తీవ్రమవుతుందని అంటున్నారు.
''ట్రీట్మెంట్లో చాలా దశలు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్‌లో క్రీమ్స్ వాడటం.. సెకండ్ స్టేజ్‌లో ట్యాబ్లెట్స్ వినియోగం.. ఆ తర్వాత కూడా తగ్గకుంటే కెమికల్ పీల్స్ ట్రీట్మెంట్తో సమస్య పరిష్కారం అవుతుంది. పింపుల్స్ రావడం తగ్గిన తర్వాత.. లేజర్ చికిత్స, లేజర్ టోనింగ్ టెక్నిక్‌తో నల్ల మచ్చలు కూడా తొలగించుకోవచ్చు. వెంటనే తగ్గలేదని నిరుత్సాహపడొద్దు. యాంటీ బయాటిక్స్, హార్మోనల్ ట్యాబ్లెట్స్ వంటివాటిని డాక్టర్ల సలహా మేరకు తీసుకొని కూడా మొటిమల్ని తగ్గించుకోవచ్చు. మెడికేషన్ వాడాక మధ్యలో ఆపేస్తే సమస్య తీవ్రం అవుతుందని చాలా మంది భయపడుతుంటారు. కానీ.. సరైన జాగ్రత్తలు.. మంచి డైట్‌తో దీనిని కంట్రోల్ చేయొచ్చు. అయితే.. ఎక్కువగా ట్యాబ్లెట్లు వాడకుండా.. క్రీమ్స్‌తో కంట్రోల్ చేసుకోవడం శ్రేయస్కరం.''
- డాక్టర్ స్వప్న ప్రియ, డెర్మటాలజిస్ట్
ఇవీ చూడండి: అన్నం వార్చిన గంజితో ఇలా మీ సౌందర్యాన్ని పెంచుకోండి!