ETV Bharat / sukhibhava

కండ కలిగితేనే నిండు మనిషి! - కండరాలు దృఢత్వం కోసం

వయసు మీద పడుతున్నకొద్దీ మన కండరాల మోతాదు కూడా తగ్గిపోతుంటుంది. మధ్యవయసు నుంచీ ఏటా 1-2 శాతం చొప్పున కండరాలు క్షీణిస్తుంటాయని అంచనా. ఇలా 80 ఏళ్లు వచ్చేసరికి సుమారు 40% కండరాల మోతాదు తగ్గిపోవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కండరాలను మరింత దృఢంగా చేసుకోవచ్చు.

Exercise
కండ కలిగితేనే నిండు మనిషి!
author img

By

Published : Jan 24, 2021, 10:48 AM IST

మనం రోజూ రకరకాల పనులు చేస్తుంటాం. నడవటం వంటి తేలికైన పనుల దగ్గర్నుంచి బరువులెత్తటం వంటి కష్టమైన పనుల వరకూ ఎన్నెన్నో చేస్తుంటాం. వీటన్నింటినీ సజావుగా చేయాలంటే కండరాలు దృఢంగా ఉండటం ఎంతో అవసరం. కానీ వయసు మీద పడుతున్నకొద్దీ మన కండరాల మోతాదు కూడా తగ్గిపోతుంటుంది. మధ్యవయసు నుంచీ ఏటా 1-2 శాతం చొప్పున కండరాలు క్షీణిస్తుంటాయని అంచనా. ఇలా 80 ఏళ్లు వచ్చేసరికి సుమారు 40% కండరాల మోతాదు తగ్గిపోవచ్చు. శారీరక శ్రమ లేకపోవటం.. టెస్టోస్టీరాన్‌, గ్రోత్‌హార్మోన్‌ వంటి హార్లోన్లు తగ్గటం.. వయసుతో పాటు ఒంట్లో తలెత్తే వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌).. ప్రోటీన్‌ తగినంత తీసుకోకపోవటం వంటివన్నీ కండరాల క్షీణతకు దారితీస్తుంటాయి. కండరాలు.. ముఖ్యంగా కాలి కండరాలు బలహీనమైతే నడక వేగం తగ్గుతుంది. కింద పడిపోయే ముప్పూ పెరుగుతుంది. అయితే కండరాలకు కాసింత పని చెప్పటం, సమతులాహారం తీసుకోవటం ద్వారా దీన్ని నెమ్మదింపజేసుకునే అవకాశం లేకపోలేదని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మధ్యవయసు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

  • కండరాల దృఢత్వం పెరగటానికి బరువులను, వ్యతిరేక బలాన్ని తట్టుకునే వ్యాయామాలు (ప్రోగ్రెసివ్‌ రెసిస్టెన్స్‌) బాగా ఉపయోగపడతాయి. అందువల్ల శక్తిని బట్టి బరువులు ఎత్తటం, సాగే బ్యాండ్ల వంటి పరికరాలతో వ్యాయామాలు చేయటం మంచిది. ముందు చిన్న బరువులతో ఆరంభించి.. క్రమంగా పెంచుకుంటూ రావాలి. దీంతో తుంటి, మోకాలు, మడమలు, భుజాల కండరాలు బలోపేతమవుతాయి.
  • నెమ్మదిగా కదులుతూ, కదలికలపై మనసు పెట్టి చేసే యోగా, తాయ్‌చీ వంటి సంప్రదాయ పద్ధతులు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి కండరాలను, కీళ్లను బలోపేతం చేయటంతో పాటు శరీరం తూలిపోకుండానూ కాపాడతాయి. మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది.
  • ఆహారంలో తగినంత ప్రోటీన్‌ ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం లభించే పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. మెగ్నీషియంతో నిండిన అంజీరా, అరటిపండు, క్యాబేజీ, చిక్కుళ్లు, పప్పులు, చేపలు.. బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులు విధిగా తీసుకోవటం మంచిది.

కండర క్షీణతను గుర్తించేదెలా?

కండరాల క్షీణతను గుర్తించేదెలా? దీనికేదైనా మార్గముందా? లేకేం. పిడికిలి బలాన్ని తెలిపే డైనోమీటరు ఇందుకు ఎంతగానో తోడ్పడుతుంది. దీనిలోని పట్టీని వేళ్లతో పట్టుకొని గట్టిగా నొక్కటం ద్వారా పిడికిలి బలమెంతో తెలుస్తుంది. మహిళలైతే 16 కిలోల కన్నా తక్కువ, పురుషులైతే 26 కిలోల కన్నా తక్కువుంటే కండరాల బలం చాలా తక్కువగా ఉందని అనుకోవచ్చు. డెక్సా (ఎక్స్‌రే) పరీక్షతోనూ కండరాల మోతాదు తెలుసుకోవచ్చు.

ఇదీ చూడండి: ఉదయం పూట నడిస్తే... రాత్రి నిద్ర పడుతుందట..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.