ETV Bharat / sukhibhava

ఆరు విటమిన్లతో మీ పిల్లల ఆరోగ్యం ఖుష్​..

పిల్లల పెరుగుదల, పోషణ, కణజాల నిర్మాణం, శారీరక, మానసిక ఎదుగుదలలో విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. తొలిదశలోనే చిన్నారులకు తగిన మోతాదులో పోషకాలు అందించాలి. పోషకాహారం ఇవ్వకపోతే విటమిన్ల కొరత ఏర్పడి భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే విటమిన్ల లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎటువంటి ఆహారంతో ఆ ముప్పును తప్పించుకోవచ్చు? అనే అంశాలపై ఈటీవీ భారత్​తో మాట్లాడారు ఆయుర్వేద వైద్య నిపుణులు రంగనాయకులు.

author img

By

Published : Jun 12, 2020, 10:08 AM IST

Importance of Vitamins in Toddlers
పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆ విటమిన్లు తప్పనిసరి!

పట్టణాలు, పల్లెల్లో ప్రజలు యాంత్రిక జీవన విధానాలకు అలవాటు పడుతున్నారు. ఆహారపు ఆలవాట్లలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులై ఫాస్ట్‌ఫుడ్‌ వంటివి తింటూ.. ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. రసాయనాల కారణంగా పోషకాలు అందక చిన్న వయసు నుంచే వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహార జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

చిన్నారులకు తొలిదశ నుంచే పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలి. ముఖ్యంగా ఒకటి నుంచి ఐదేళ్ల లోపు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఒకవేళ సరైన ఆహారం అందకపోతే పెరిగే కొద్ది అనేక సమస్యల బారిన పడే అవకాశముంది. పిల్లల్లో విటమిన్​ లోపాలు, వాటి సమస్యలు, పరిష్కార మార్గాలపై ఈటీవీ భారత్​తో మాట్లాడారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు రంగనాయకులు​.

"విటమిన్లు మానవ శరీర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి జీవరసాయన చర్యలు, వృద్ధి, పోషణ, కణజాల నిర్మాణంలో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. విటమిన్లు లోపిస్తే శరీరం అసాధారణంగా పెరుగుతుంది. శిశువు జన్మించిన తర్వాత ఆరు నెలల వరకు తల్లి పాల ద్వారా తగిన మోతాదులో పోషకాలను అందించాలి. చిన్నారులు ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించిన తర్వాత, విటమిన్లు అధికంగా ఉన్న పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి"

-డాక్టర్​ రంగనాయుకులు, ఆయుర్వేద వైద్యులు

జీవ శాస్త్రం ప్రకారం ఆరు విటమిన్లు ఉంటాయి. వాటిని రెండు భాగాలుగా విభజించారు. నీటిలో కరిగేవి, కొవ్వులో కరిగేవి.

నీటిలో కరిగేవి..

విటమిన్​ 'బీ' (బీ1,బీ2,బీ3,బీ5,బీ6,బీ7,బీ9,బీ12).. ఆకు కూరలు, చిరుధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది.

విటమిన్​ 'సీ' పుల్లని పండ్లలో ఉంటుంది. ఈ విటమిన్​ నీటిలో కరుగుతుంది.

కొవ్వులో కరిగేవి..

విటమిన్​ 'ఏ, డీ, ఈ, కే' కొవ్వులో కరుగుతాయి. ఇవి నెయ్యి, వంట నూనె, పాల ఉత్పత్తుల్లో అధికంగా లభిస్తాయి. ఇవి సరైన స్థాయిలో అందలేనప్పుడు పిల్లలు విటమిన్ల లోపం ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.

విటమిన్​ ఏ

కంటి చూపు సక్రమంగా ఉండాలంటే మనకు 'విటమిన్-ఏ' అవసరం. ఇది లోపిస్తే కళ్లు మసకబారి.. చూపు మందగిస్తుంది. రేచీకటి వంటి కంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి పిల్లల ఆహారంలో దీన్ని తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. క్యారెట్​, పాలు, గుడ్లు, కాడ్​ లివర్​ ఆయిల్​, బచ్చలికూరలో అధిక మోతాదులో ఈ విటమిన్​ ఉంటుంది.

విటమిన్​ డీ

ఎముకల పెరుగుదలకు 'విటమిన్-​డీ' ఎంతో ముఖ్యమైనది. జీవక్రియలోనూ ఇది​ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్​ కాల్షియం గ్రహించడంలో బాగా సహాయపడుతుంది. రక్తంలోని ప్లాస్మాలో కాల్షియం లభ్యతను పెంచుతుంది. ఫలితంగా ఎముకలు సాధారణ స్థితిలో పెరుగుతాయి. దీని లోపం వల్ల ఎముకలు పెళుసు భారే అవకాశం ఉంటుంది. ఫలితంగా రికెట్స్ వస్తుంది. సూర్యరశ్మి, పాలు, పెరుగు, జున్ను, బెల్లం వంటి పదార్థాల్లో 'విటమిన్​-డీ' పుష్కలంగా లభిస్తుంది.

ఇతర విటమిన్ల ప్రాముఖ్యత..

  • విటమిన్​ బీ: మెదడు పనితీరు సక్రమంగా ఉండాటానికి, కణాల జీవక్రియకు 'విటమిన్-బీ'​ ఎంతగానో తోడ్పడుతుంది.
  • విటమిన్​ సీ: శరీరంలోని కణాల అభివృద్ధి, కణజాల నిర్మాణానికి ఇది సహాయపడుతుంది. ఈ విటమిన్​ లోపిస్తే స్కర్వీ వ్యాధి వస్తుంది. ఉసిరికాయలో అధిక మోతాదులో ఈ విటమిన్​​ లభిస్తుంది.
  • విటమిన్​ ఈ: చర్మం ఆరోగ్యంగా ఉండటానికి 'విటమిన్-ఈ'​ అవసరం. ఇది గోధుమల్లో ఎక్కువగా ఉంటుంది.
  • విటమిన్​ కే: ఈ విటమిన్‌ లోపం ఉంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం ఆలస్యంగా గడ్డకడుతుంది. ఇది ఆకుకూరల్లో ఎక్కువగా లభిస్తుంది.

ఇదీ చూడండి: మీరు పల్లీలు తింటున్నారా...? అయితే ఇవి తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.