ETV Bharat / sukhibhava

Sleep Time By Age: ఏ వయసులో ఎంత నిద్ర పోవాలంటే! - నిద్రకు వయసుకు ఉన్న సంబంధం ఏంటి

ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం. రాత్రంతా నిద్రలేని వారు అధిక రక్తపోటుకు(High blood pressure) గురయ్యే ప్రమాదం ఉంది. నీరసం, బీపీ పెరగడం, కోపం, చిరాకు రావడం వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ప్రస్తుత జీవన శైలితో చాలా మందిని నిద్ర లేమి సమస్య వేధిస్తుంది. అయితే ఏ వయసు వారు ఎంత నిద్ర పోవాలి (Sleep Time By Age) అనేది చాలా మందికి తెలియదు. అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

importance of sleep to stay healthy
ఏ వయసులో ఎంత నిద్రపోవాలి
author img

By

Published : Oct 23, 2021, 1:32 PM IST

కొంతమంది దంపతులకు పిల్లలు ఎంతసేపు నిద్రపోతారో తెలియక, తమ బిడ్డ ఎప్పుడూ నిద్రలోనే ఉంటుందని వైద్యుల దగ్గరకు పరుగెత్తుతుంటారు. అలాగే మరికొందరు మా పిల్లలు సరిగ్గా నిద్రపోరని ఆందోళనకు గురవుతారు. ఇంతకీ నిద్ర మనిషికి ఎందుకు అవసరం, ఏయే వయసులో ఎంతసేపు నిద్రపోవాలో (Sleep Time By Age) చూద్దాం..

నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు!

నిద్రలోనే మనిషిలో ఎన్నో హార్మోన్‌లు తయారవుతాయి. సరైన నిద్రపోక పోవడం వల్ల జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటులాంటివి పెరిగిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్‌, టీవీ, సెల్‌ఫోన్‌, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌, ట్యాబుల్లాంటివి లేని ఓ వందేళ్ల కింది జీవితాన్ని పరిశీలిస్తే అనేక విషయాలు అర్థమవుతాయి. అప్పట్లో రాత్రి పెందరాళే భోజనం ముగించి, ఎనిమిది తొమ్మిదింటికల్లా పడుకునేవారు. ఓ నాలుగైదు దశాబ్దాల కిందట గ్రామీణ భారతదేశంలోనూ తొందరగా పడుకునే అలవాటుండేది. అందుకే మధుమేహం, రక్తపోటులాంటివి చాలా తక్కువగా ఉండేవి. పైగా అప్పుడు ఏ పని చేయాలన్నా శారీరక శ్రమ అవసరమయ్యేది. నేడు దాదాపు ప్రతి ఇంట్లోనూ కుటుంబానికో మోటార్‌బైక్‌ కనిపిస్తోంది. అలాగే రాత్రి పది, పదకొండు గంటలైనా టీవీ లేదా సెల్‌ఫోన్లు చూస్తూ ఉంటారు. దాంతో వాటి తెరమీది నీలి కిరణాలు మెదడుపై ప్రభావాన్ని కలిగిస్తాయి. నిద్రకు దోహదం చేసే మెలటోనిన్‌ హార్మోన్‌ విడుదలను తగ్గిస్తాయి. ఎందుకంటే బ్లూ లైట్‌ వల్ల ఇంకా పగటి వెలుతురే ఉందనే గందరగోళానికి మెదడు గురవుతుంది. నిద్రలేమితోనే చాలామందికి జీవనశైలి వ్యాధులు చుట్టుముడుతున్నాయి.

నిద్రలేమితో కలిగే ఇతర అనర్థాలు!

రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే తర్వాతి రోజు పనిలో నిరాసక్తంగా, మందకొడిగా ఉంటారు. పైగా పగటిపూట నిద్ర ముంచుకొస్తుంటుంది. ఏ పనీ సరిగా చేయలేరు. చాలినంత నిద్రపోకుండా వాహనాలు, ఇతర మోటార్లు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. సరైన నిద్రలేకపోతే పిల్లల్లో ఏకాగ్రత కొరవడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మలబద్ధకం వస్తుంది. జీర్ణక్రియ సాఫీగా ఉండదు. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. నిద్ర అలసిపోయిన శరీరానికి విశ్రాంతినిచ్చి, తిరిగి మరుసటిరోజు పనికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఎన్నో గాయాలనుంచి శరీరం తననుతాను మరమ్మతు చేసుకునేందుకు సాయపడుతుంది. అమెరికాలోని ఓ అధ్యయనం ప్రకారం నిద్రపోయే సమయాన్ని ఓ 2 గంటలు తగ్గించడంతో ఆరువారాల తర్వాత టైప్‌-2 డయాబెటిస్‌ లక్షణాలు కనిపించాయి.

ఏ వయసులో ఎంతెంత నిద్ర కావాలి?

నిద్ర కూడా వయసును బట్టి మారుతుంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలు దాదాపు 18 గంటలకు పైగా పడుకుంటే, తొంభై ఏళ్ల వృద్ధులు రోజుకు మూడు నాలుగు గంటలే పడుకుంటారు. వయసు పెరుగుతున్నకొద్దీ నిద్రపోయే సమయం తగ్గుతుంటుంది. అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రకారం 3 నుంచి 5 ఏళ్ల పిల్లలు (Sleep Time For Kids) 13 గంటల వరకు నిద్రపోతారు. 13 నుంచి 18 ఏళ్ల పిల్లలు 10 గంటలు నిద్రపోతారు. 18 నుంచి 60 ఏళ్ల వరకు ఏడెనిమిది గంటలు నిద్రపోతారు.

ఎంత గాఢంగా నిద్రపోయారనేది ముఖ్యం!

కొంతమందికి పెందరాళే మంచమెక్కినా ఎంతసేపైనా నిద్రపట్టదు. ఊరకనే పరుపు మీద అటు ఇటు కదులుతూ ఉంటారు. అలా ఎంతసేపు పడుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. గాఢంగా నాలుగైదు గంటలు నిద్రపోయినా అది చాలా ప్రయోజనం కలిగిస్తుంది. నిద్రకుపక్రమించే ముందు శరీరం మీద అతి పలుచని, లేదా బరువు గల దుప్పటి కప్పుకోకుండా, సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. దుస్తులు కూడా బిగుతుగా లేకుండా చూసుకోవాలి. గదిలో బాగా చీకటి ఉంటేనే మంచి నిద్ర పడుతుంది. నిద్రకు కాఫీ, టీ, ధూమపానం కూడదు. సెల్‌ఫోన్‌, టీవీలు బెడ్‌మీద చూడకూడదు. ప్రశాంతంగా నిద్రకోసం ప్రయత్నిస్తే తప్పక వస్తుంది.

ఇదీ చూడండి: Lemon water: నిమ్మరసంతో బోలెడన్ని ప్రయోజనాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.