ETV Bharat / sukhibhava

'మాస్కు' మహత్తు ఇప్పటికైనా తెలుసుకోండి..

ఒమిక్రాన్‌ రకం వైరస్‌ విజృంభణతో మాస్కు ప్రాధాన్యం మరింత పెరిగింది. నిజానికి కొవిడ్‌ జబ్బు ఒమిక్రాన్‌తో సమసిపోయేది కాదు. మున్ముందు మరెన్నో రకాల కరోనా వైరస్‌లు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదు. అందువల్ల మాస్కు వేసుకోవడం మన జీవితంలో ఒక భాగం కావాలి. బయటికి వెళ్లినప్పుడు విధిగా మాస్కు పెట్టుకోవాలి. ఒంట్లో నలతగా ఉంటే ఇంట్లోనూ ధరించాలి. దీంతో వైరస్‌ వ్యాప్తిని చాలావరకు అడ్డుకోవచ్చు. దీని ఫలితాలను గమనిస్తున్నాం కూడా. అయినా ఇంకా చాలామంది మాస్కు ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోకపోతే ఏమవుతుంది? అని తటపటాయిస్తూ ఉంటారు. దీని పనితరు, గొప్పతనం గురించి తెలుసుకుంటే ఇలాంటి సందేహాలకు తావుండదు.

covid
మాస్కు మహత్తు ఇప్పటికైనా తెలుసుకోండి..
author img

By

Published : Dec 28, 2021, 7:30 AM IST

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాత్రమే కాదు.. మాట్లాడుతున్నప్పుడూ ప్రతి సెకండుకు వేలాది తుంపర్లు నోటి నుంచి బయటకు వస్తాయి. గట్టిగా మాట్లాడినా, పాడుతున్నా ఇంకా ఎక్కువ తుంపర్లు వెలువడుతుంటాయి. ఒకవేళ ఈ తుంపర్లలో కరోనా వైరస్‌ ఉందనుకోండి. గాలి ద్వారా వ్యాపించే వీటిని ఇతరులు పీల్చుకుంటే వారికీ వైరస్‌ అంటుకుంటుంది. ఒమిక్రాన్‌ రకంతో తలెత్తే కరోనా జబ్బులో చాలామందికి ఎలాంటి లక్షణాలు కనిపించటం లేదు. అందువల్ల దగ్గు, తుమ్ముల వంటివి రాకపోయినా మాటలతోనూ వైరస్‌ వ్యాపించొచ్చు. కాబట్టి మాస్కు తప్పనిసరి. మామూలు గుడ్డ మాస్కులూ మాట్లాడుతున్నప్పుడు వెలువడే తుంపర్లన్నింటినీ అడ్డుకుంటాయి. తుంపర్లు నోటి నుంచి వెలువడ్డాక వీటిల్లోని నీరు త్వరగా ఆవిరవుతుంది. అప్పుడు తుంపర్లు కుచించుకుపోతాయి. ఇవి తేలికగా ఉండటం వల్ల నేల మీద పడకుండా నిమిషాలు, గంటల కొద్దీ గాల్లో తేలియాడుతూ ఉంటాయి. ఇవి ఒకసారి గాల్లో కలిశాక అడ్డుకోవటం చాలా చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కు ధరిస్తే వైరస్‌ను మొదట్లోనే అడ్డుకోవచ్చు.

పీల్చుకోకుండానూ..

తుంపర్లు గాల్లో కలవకుండా చూడటానికే కాదు.. వీటిని పీల్చుకోకుండా చూడటానికీ మాస్కులు ఉపయోగపడతాయి. గాల్లో తేలియాడే సూక్ష్మ తుంపర్లను ఎన్‌95, కేఎన్‌95 మాస్కులు సమర్థంగా అడ్డుకుంటాయి. గుడ్డ మాస్కులు, సర్జికల్‌ మాస్కులు అంత సమర్థంగా నిరోధించవు గానీ కొంతవరకు రక్షణ కల్పిస్తాయి. మాస్కు పొరల సంఖ్య, వీటి తయారీకి వాడిన వస్త్రం, ధరించిన తీరును బట్టి వీటి రక్షణ ఆధారపడి ఉంటుంది.

జబ్బు తీవ్రం కాకుండా..

గాల్లో కలిసిన సూక్ష్మ తుంపర్లను మాస్కు పూర్తిగా అడ్డుకోలేకపోయినా కూడా వీటిని ధరిస్తే తీవ్ర కొవిడ్‌ బారినపడకుండా చూసుకోవచ్చు. కొవిడ్‌ కారక వైరస్‌ దిగువ శ్వాస మార్గాల్లోకి, అక్కడ్నుంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే తీవ్ర కొవిడ్‌కు దారితీస్తుంది. వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా దాన్ని శ్వాస మార్గాల్లోంచే బయటకు వెళ్లగొట్టేలా చూడటానికి మాస్కులు ఉపయోగపడతాయి. మనం శ్వాస వదిలినప్పుడు బయటకు వచ్చే తేమను మాస్కు పట్టి ఉంచుతుంది. దీంతో శ్వాస మార్గాల్లో తేమ శాతం పెరుగుతుంది. శ్వాస మార్గాలు సహజంగా శుభ్ర పడటానికి తేమ అత్యవసరం. ఇది దుమ్ము, ధూళి, కాలుష్య కారకాలు, వైరస్‌లు ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. మాస్కు ధరించటం వల్ల శ్వాసమార్గాల్లో తేమ శాతం పెరిగి, వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్లటం తగ్గుతుంది. కొందరు మాస్కు ధరిస్తే గాలి ఆడదని తీసేస్తుంటారు. ఇది ప్రమాదకరం. మాస్కుతో కలిగే అసౌకర్యంతో పోలిస్తే లభించే ప్రయోజనమే ఎక్కువ. గుడ్డ మాస్కులు, సర్జికల్‌ మాస్కులతో అంతగా అసౌకర్యమేమీ ఉండదు. వైరస్‌ను మోసుకొచ్చే తుంపర్ల కన్నా ఆక్సిజన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ అణువులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. మాస్కుల నుంచి తేలికగా ప్రయాణిస్తాయి.

రెండు గజాల దూరం కూడా..

అందరూ మాస్కు ధరిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే ఏ మాస్కయినా వైరస్‌ రేణువులన్నింటినీ పూర్తిగా అడ్డుకోకపోవచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మాస్కు ధరించటం సహా ఇతరులకు కనీసం రెండు గజాల దూరంలో ఉండటం మంచిది.

సరిగ్గా ధరించాలి

  1. రెండు, అంతకన్నా ఎక్కువ పొరల వస్త్రంతో చేసిన మాస్కులు ధరించాలి. ఎన్‌95 మాస్కులైతే మరింత ఎక్కువ రక్షణ లభిస్తుంది.
  2. గాలి బయటకు వచ్చేలా చేసే వాల్వ్‌లు, మార్గాలు గల మాస్కులు ధరించొద్దు.
  3. ముక్కు, నోరు పూర్తిగా కప్పి ఉంచేలా మాస్కు ధరించాలి.
  4. చెంపలు, గదమ కింది భాగానికి మాస్కు బిగుతుగా పట్టి ఉండేలా చూసుకోవాలి.
  5. మళ్లీ మళ్లీ వాడుకునే మాస్కులను ప్రతి రోజూ లేదా మురికి పట్టినప్పుడు ఉతుక్కోవాలి. వాడి పారేసే మాస్కులను తీసేశాక జాగ్రత్తగా చెత్తబుట్టలో వేయాలి.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.