ETV Bharat / sukhibhava

ఈ చిట్కాలు పాటిస్తే.. కొవిడ్​ సోకినా ఏం కాదు.. - కరోనా మహమ్మారి

Immunity Booster: కరోనా ప్రభావంతో ఇమ్యూనిటీకి ప్రాధాన్యం పెరిగింది. దీని గురించి అందరిలో అవగాహనతో పాటు ఆందోళన కూడా ఎక్కువ అవుతోంది. కొత్త వేరియంట్ల ధాటిని తట్టుకునే స్థాయిలో రోగనిరోధక శక్తి ఉందా? అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఇమ్యూనిటీ పెంపు చాలా సులువు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.

covid tips
ఈ చిట్కాలు పాటిస్తే కొవిడ్​ ఉన్నా నో వర్రీ
author img

By

Published : Jan 1, 2022, 6:37 AM IST

Immunity Booster: మహమ్మారులు మనకేమీ కొత్త కాదు. శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లోన కలరా, మశూచి, ప్లేగు లాంటివి మౌనవాళిపై పెనుదాడి చేశాయి. అప్పుడే వాటిని ఎదుర్కొన్నాం. ఇప్పుడు రోజుకో కెత్త వేరియంట్‌ వస్తోందని ఆందోళన చెందుతున్నాం. ఇలాంటివి ఎన్ని వచ్చినా, సమర్థంగా ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం.. మనలో ఉండే రోగనిరోధక శక్తే! రోజూ కొద్ది సమయం కేటాయిస్తే దాన్ని పెంచుకోవడం మన చేతుల్లోనే ఉంది.

రోజుకు రెండున్నర లీటర్ల నీరు..

నీరు మంచి చేస్తుంది కాబట్టే మంచినీరు అంటాం. జీవక్రియలన్నింటికీ అదే ఆధారం.. దాహం వేసేవరకు ఆగకుండా అప్పుడప్పుడు కాస్త నోటిని తడుపుకోవాలి. రోజుకు కనీసం రెండున్నర లీటర్ల నీరు తాగాలి.

ఇంద్రధనున్సులా పళ్లెం..

ఇంటిని పలు రకాల రంగులతో అలంకరించుకుంటాం. ఒంటిమీద దుస్తులూ రంగురంగులవి వేసుకుంటాం. మరి మీరు తినే పళ్లెంలో ఎన్ని రంగులు ఉంటున్నాయి? ఎప్పుడూ ఒకే రకం కాకుండా. రకరకాల రంగుల కూరగాయలు, పండ్లతో మీ పళ్లెం ఇంద్రధనుస్సులా కళకళలాడిపోవాలి. అప్పుడే మీ ఒంటికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పదార్ధాలు అన్నీ అందుతాయి. రోజుకు 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తినాలి.

రోజూ ఒకే సమయానికి.

ఎప్పుడు పడితే అప్పుడు తినడం, పని ఉందన్న వంకతో అల్పాహారం, భోజనం మానేయడం అస్సలు సరికాదు. శరీరం, మెదడు పనిచేయాలంటే కావల్సిన శక్తినిచ్చేది ఆహారమే. రోజూ ఒకే సమయానికి తింటే.. జీవగడియారాన్ని పనిచేయించే జన్యువులు నియంత్రణలో ఉంటాయి.

కంటి నిండా నిద్ర..

నిద్రలోనే మన శరీరం మరమ్మతు చేసుకుంటుంది. నిద్రలేమితో నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. రోజూ తగినంతసేపు నిద్రపోతేనే అన్నీ సర్దుకుంటాయి.

ఇదీ చూడండి : వీటిని పాటిస్తే.. ఆరోగ్యం మన చేతుల్లోనే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.