అధిక బరువు(obesity causes) అన్ని అనారోగ్యాలకు మూలం. దీన్ని కచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. కొందరు వ్యాయామం చేసి బరువు తగ్గించుకుంటారు. మరికొందరు డైట్‌ను నియంత్రిస్తారు. అయితే.. డైట్లో నియంత్రణ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం పూట అల్పాహారం మానేస్తే బరువు తగ్గుతారని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇలా చేస్తే బరువు తగ్గే అవకాశం లేదు. అదే సమయంలో ఇంకా ఎక్కువగా పెరుగుతారు.
బరువు తగ్గాలనుకునేవారు.. కేలరీలు ఎక్కువగా లభించే కార్బోహైడ్రేట్లు కంటే తక్కువగా అందించే ప్రొటీన్లపై(High Protein Foods For Weight Loss) దృష్టి పెట్టాలి. నిజానికి ప్రొటీన్ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో బరువు తగ్గిపోవడమే కాకుండా ఆకలి తీరిన అనుభూతి కలుగుతుంది. ప్రొటీన్ల నిర్మాణంలో అమినో యాసిడ్స్ కీలక పాత్ర వహిస్తాయి. ఇవి మొత్తం 20 రకాలుగా ఉంటాయి. కొన్ని అమినో యాసిడ్లను మనం శరీరమే తయారు చేసుకుంటుంది. మరికొన్ని బయట ఆహారం ద్వారా పొందాల్సి ఉంటుంది.
ఎక్కువ ప్రొటీన్(High Protein Foods For Weight Loss) ఉన్న ఆహారం తీసుకుంటే మనకు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా కేలరీలు తీసుకోవటం తగ్గుతుంది. దీంతో కేలరీలు కరగకుండా ఏర్పడే కొవ్వుకు అవకాశం ఉండదు. ప్రోటీన్లు శరీరంలోని మెటాబాలిజంను పెంపొందిస్తాయి. ఎన్నో రసాయనిక చర్యల కోసం తోడ్పడే ఎంజైములను అందిస్తాయి. శరీరంలోని అవయవాలు సరిగా పని చేసే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అయితే.. సాధారణంగా మన బరువులో ఒక కిలోగ్రాముకు ఒక గ్రాము చొప్పున ప్రొటీన్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పౌడర్స్ కంటే.. ఆహారం ద్వారా ప్రొటీన్ లభిస్తేనే మంచిదని సూచిస్తున్నారు. కోడిగుడ్లు, పెరుగు, చికెన్ మటన్, పప్పుల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటున్నాయని వివరిస్తున్నారు.
అయితే.. ఎలాగూ ప్రొటీన్లు తీసుకుంటున్నాం కదా అని కార్బోహైడ్రేట్లను నిర్లక్ష్యం చేయవద్దు. శరీరానికి కార్బోహైడ్రేట్లను అందించే పండ్లను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే రోజులో కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాలి. ఈ విధానాలు పాటిస్తే.. సులువుగా అధిక బరువును అదుపులో పెట్టుకోవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఈ ఆహారంతో కండరాలకు ఎంతో బలం
ఇదీ చూడండి: ఆకాకరకాయతో బీపీ, షుగర్‌కు చెక్!
ఇదీ చూడండి : Diet Plan For Weight Loss: ఒంట్లో కొవ్వు కరిగించాలా? ఇవి తినండి...