ETV Bharat / sukhibhava

చిన్న చిన్న విషయాలకే కోపం... ఏం చేయమంటారు? - health tips

చిన్న వయసులోనే చిన్న చిన్నవాటికి కోపం రావడం.. ముఖ్యంగా మన అనుకునే వాళ్ల మీద రావడం ఈమధ్య చాలా మందిలో కనిపిస్తున్న లక్షణం. కారణాలు ఏమైనా అనవసరంగా కోపం రావడం సహజమైపోతోంది. ఇందుకు గల కారణాలు ఏంటో తెలుసుకోండి.

చిన్న చిన్న విషయాలకే కోపం... ఏం చేయమంటారు?

author img

By

Published : Feb 27, 2021, 4:40 PM IST

నా వయసు 20 సంవత్సరాలు.. నాకు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. ముఖ్యంగా స్నేహితుల మీద. వాళ్లు చేసే పనులన్నీ చిన్న పిల్లల చేష్టల్లా అనిపిస్తున్నాయి. నేనేదో పెద్దదాన్ని అయిపోయినట్టు వాళ్లు చేసే ప్రతి పని నాకు చికాకు తెప్పిస్తోంది. వాళ్లు పాటలు పాడుతుంటే వినలేకపోతున్నాను. చిన్న చిన్న విషయాలకు జోకులు వేసుకుని నవ్వుతుంటే సహించలేకపోతున్నాను. నాకు ఎవరో తెలియని వాళ్ల మీద కూడా కోపం వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి మా నాన్న తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. అలా చూస్తూ భరిస్తూ పెరిగా. నాది సున్నిత మనస్తత్వం. ఎవరు ఏమన్నా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా భరించలేకపోతున్నా. ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నానో కూడా తెలియడం లేదు. కొద్దిసేపు సంతోషంగా ఉంటాను. అంతలోనే కోపం వచ్చేస్తుంది. సమయానికి నిద్ర రావడం లేదు. రాత్రి ఎప్పుడో రెండింటికి నిద్ర పడుతుంది. ముఖ్యంగా ఎక్కువ మంది ఇష్టపడేవి నాకు నచ్చడం లేదు. ఎక్కువ మంది ఇష్టపడనవి నాకు నచ్చుతున్నాయి. వాళ్లు ఎందుకు వాటిని ఇష్టపడడం లేదు? నేను ఇష్టపడి అవి బెస్ట్‌ అని నిరూపించాలనే ఒక వింత ఆలోచన నాకు వస్తుంది. అదే కొనసాగించి సమస్యల్లో పడుతున్నా. దీనికి కారణం ఏంటో చెప్పగలరా.. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ ఆలోచనలు మీ వయసులో పొందాల్సిన చిన్న చిన్న సంతోషాలు, సరదాలను ఆస్వాదించకుండా చేస్తున్నాయి. అంతేకాకుండా అవి మిమ్మల్ని వ్యతిరేక దిశలో నడిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలు మీకు అర్థమవుతున్నా నియంత్రించుకోలేకపోతున్నారని మీ ఉత్తరం సూచిస్తున్నది. అలాగే మీ తండ్రి కారణంగా ప్రతికూల పరిస్థితుల్లో పెరగడం, సున్నిత మనస్తత్వం, ఇతరులు ఆలోచిస్తున్న పద్ధతిని వ్యతిరేకించడం.. దానికి పూర్తి వ్యతిరేక దిశలో వెళ్లడం.. వంటి అంశాలను మీరు ప్రస్తావించారు. దీన్ని బట్టి మీరు మీలోని ప్రతికూల అంశాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని అర్థమవుతోంది.

మీకు చిన్నతనం నుంచి అనేక సమస్యలు ఎదురైనా ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా మిమ్మల్ని బాధపెట్టిన లేదా ప్రభావితం చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?అనేది ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారి విషయాల్లో జరిగిన మార్పులు మీపై ప్రభావం చూపుతున్నాయేమో తెలుసుకోండి. అలాగే మీది సున్నిత మనస్తత్వం అంటున్నారు కాబట్టి మీ చుట్టూ జరిగిన చిన్న విషయాలను మీరు పెద్దదిగా చూస్తున్నారా? అనే కోణంలోనూ ఒక్కసారి దృష్టి సారించండి.

కొంతమంది తమ మనసులోని బాధను తగ్గించుకోవడానికి స్నేహితులతో పంచుకుంటారు. అటువంటి స్నేహితులకు వ్యతిరేకదిశలో మీ ఆలోచనలు సాగడానికి కారణమేంటో మీకు మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. అయితే ఈ సూచనలు మీకు తెలుస్తున్నా.. వాటిని నియంత్రించుకోలేకపోతున్నారు కాబట్టి.. మీకు మానసిక నిపుణుల సహాయం అవసరమని తెలుస్తోంది. మీ ఆలోచనలు మీరు కోరిన విధంగా సానుకూల దిశలో సాగాలంటే దానికి ముఖ్యంగా సహాయపడేది మీ మనసేనని అర్థం చేసుకోండి. మానసిక నిపుణులను సంప్రదించినప్పుడు మీ మనో నియంత్రణకు ఏం చేయాలో చెబుతారు. వారి సలహాలను పాటించడం ద్వారా తగిన సాంత్వనను పొందగలుగుతారు.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్‌

ఇదీ చూడండి: మాఘ పౌర్ణమి విశిష్టత ఏంటీ..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.