ETV Bharat / sukhibhava

తల్లి పాలు దానం చేస్తే ఎంతో మేలు

తొమ్మిది నెలలు సురక్షితమైన వాతావరణానికి అలవాటుపడి, ఆపై అమ్మ గర్భగుడిని వీడి.. ఈ నేలపై అడుగుపెడుతుంది బుజ్జాయి. అప్పటివరకు పరిచయమే లేని ఈ లోకంలో తల్లిపాలు తప్ప మరో ఆహారం రుచించని ప్రాయమది. మరి తల్లిపాలు అందకపోతే? చిన్నారి హృదయం తట్టుకోగలదా..? అలాంటి పిల్లలకు మరో తల్లి పాలు దానం చేస్తే ఎలా ఉంటుంది? పసి ప్రాణాన్ని నిలబెట్టినట్టే కదా..! మరి, తల్లిపాల వారోత్సవాల సందర్భంగా 'చనుబాల బ్యాంకు' గురించి తెలుసుకుందామా?

vhuman-milk-banks-best-substitute-for-babies-who-are-deprived-of-mothers-milk
తల్లి పాలు దానం చేస్తే ఎంతో మేలు!
author img

By

Published : Aug 8, 2020, 10:32 AM IST

తల్లిపాలే బిడ్డలకు అమృతం. ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి అద్భుతం. తొలిసారి చనుబాలు పట్టించే సమయంలో ఆ తల్లీబిడ్డలు పొందే మధురానుభూతిలో.. జీవితకాలపు ఆరోగ్యం ఇమిడి ఉంటుంది. అందుకే వైద్యులు శిశువు జన్మించిన అరగంటలోగా తల్లి ముర్రుపాలు పట్టించమంటారు. కానీ, అందరు తల్లులకూ ఆ అదృష్టం ఉండకపోవచ్చు. కొందరిలో చనుబాల ఉత్పత్తి తక్కువగా ఉండొచ్చు. మరికొందరు అనారోగ్యాల వల్ల పాలు పట్టించలేకపోవచ్చు. మరి అలాంటి, అత్యవసర సమయాల్లో బ్లడ్ బ్యాంకుల్లాగే పనిచేసే స్వచ్ఛమైన చనుబాల బ్యాంకులున్నాయని మీకు తెలుసా ?

human-milk-banks-best-substitute-for-babies-who-are-deprived-of-mothers-milk
తల్లి పాలు దానం చేస్తే ఎంతో మేలు!

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చనుబాల బ్యాంకుల గురించి... ప్రముఖ గైనకాలజిస్ట్, ప్రసూతి నిపుణులు డాక్టర్ రాజశ్రీ కట్కేతో ఈటీవీ భారత్ మాటామంతి.....

చనుబాల బ్యాంక్ అంటే..?

ఆరోగ్యకరమైన తల్లలు దానం చేసే స్తన పాలను శాస్త్రీయ పద్ధతిలో భద్రపరిచి, అవసరమైన శిశువులకు పంపిణీ చేసే చోటే తల్లిపాల బ్యాంక్. తల్లిపాలు పట్టించే వీలు లేని పిల్లలకు ఇలాంటి పాలు పట్టించడం.. వారి ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఉపయోగపడుతాయి.

పాలదానం ఎవరు చేయొచ్చు?

పాలిచ్చే తల్లులు ఎవరికైతే హెచ్ఐవీ, హెపటైటిస్ బి, సిఫిలిస్ వంటి ప్రమాదకర వ్యాధులు లేవని తేలుతాయో వారు పాలదానం చేయొచ్చు.

తల్లిపాలు దానం చేసే తల్లుల రక్తంలో కనీసం 10 గ్రాముల హిమోగ్లోబిన్ కలిగి ఉండాలి. అంతే కాదు, ఆరోగ్య సమస్యలేవీ లేవని ధ్రువీకరించాకే పాలదానం చేసే అవకాశముంటుంది.

చనుబాల బ్యాంకుతో లాభమేంటి?

  • పుట్టగానే తల్లిని కోల్పోయిన పిల్లలు, కావాలనే తల్లి వదిలేసిన శిశువులకు ఆహార కొరత లేకుండా చేస్తాయి ఈ తల్లిపాల బ్యాంకులు.
  • బిడ్డకు జన్మనిచ్చాక, తల్లి అనారోగ్యంతో బాధపడుతూ పాలు పట్టించలేని స్థితిలో ఈ బ్యాంకులు అత్యుత్తమ సేవలందిస్తాయి.
  • తల్లిలో పాల ఉత్పత్తి తగు మోతాదులో లేనప్పుడు.
  • పిల్లలు పుట్టగానే దత్తత తీసుకున్న సమయంలో ఈ బ్యాంకులు బిడ్డ ఆకలిని తీర్చగలవు.

ముంబయిలో చనుబాల బ్యాంకులు...

ముంబయిలోని కామా, ఆల్ బ్లెస్ ఆసుపత్రుల్లో 2008లో తొలిసారిగా తల్లిపాల బ్యాంకు ఏర్పాటైంది. ఆ బ్యాంకు ద్వారా ఇప్పటివరకు దాదాపు 15261 మంది నవజాత శిశువులు తల్లిపాలను పొందగలిగారు. వారిలో 6000 మందికి పైగా జాతీయ నవజాతశిశు అత్యవసర విభాగం(ఎన్ఐసీయూ)లో చికిత్స పొందుతున్నవారే.

తల్లిపాల బ్యాంకుల వల్ల ఎన్ఐసీయూలో శిశు మరణాలు, అనారోగ్యాలు గణనీయంగా తగ్గాయి. పైగా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు వేగంగా బరువు పెరిగి ఆరోగ్యంగా మారారు. కనీసం, 1.8 కిలోల కంటే అధిక బరువు పొందాకే ఎన్ఐసీయూ నుంచి శిశువులను డిశ్ఛార్జ్ చేస్తారు.

ఖర్చు తక్కువ.. ప్రయోజనం ఎక్కువ

ముంబయి కామా హాస్పిటల్​లో తొలిసారిగా తల్లిపాల బ్యాంకు ప్రారంభిచినప్పుడు రూ.3 లక్షలు ఖర్చైంది. ఆ తర్వాత ఏడాది పాటు బ్యాంకు నిర్వహణకు దాదాపు రూ. 10 లక్షలు ఖర్చయింది. ఇంత తక్కువ ఖర్చులోనే ఏటా దాదాపు 1000 మంది శిశువుల ప్రాణాలు నిలుస్తున్నాయి.

అయితే, అతి తక్కువ ఖర్చుతో అనేకమంది నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే మిల్క్ బ్యాంకులు దేశంలో అత్యంత తక్కువ సంఖ్యలో ఉండడం బాధాకరం. అవి కూడా ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి.

అవగాహన ఎలా?

  1. మహిళలు చదువుకుంటేనే చనుబాలు దానం చేసే ప్రక్రియను అర్థం చేసుకోగలరు.
  2. విద్యావంతులైన మహిళలే భద్రపరిచిన తల్లిపాలను పూర్తి విశ్వాసంతో తన బిడ్డకు పట్టించగలదు.
  3. పాలదానం ప్రాముఖ్యతను, అవసరాన్ని చిన్న వయసులోనే మహిళలకు వివరించాలి.
  4. సానుకూల కౌన్సిలింగుల ద్వారా మహిళలు పాలదానానికి ముందుకొచ్చే అవకాశముంది.
  5. దేశంలో తల్లిపాల బ్యాంకులు అధిక సంఖ్యలో ఏర్పడినప్పుడే తల్లిపాల వారోత్సవాలు మరింత సంబరంగా చేసుకోవచ్చు అంటున్నారు డాక్టర్ రాజశ్రీ కట్కే.

ఇదీ చదవండి: తల్లి పాల వారం సందర్భంగా.. చనుబాల ఉపయోగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.