ETV Bharat / sukhibhava

కళ్ల చుట్టూ 'డార్క్​ సర్కిల్స్​' వేధిస్తున్నాయా? ఇలా చేసి చూడండి! - health story

Dark Circles Under Eyes: చాలా మందికి కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. ఇది వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధించే సమస్యే. అయితే.. ఎక్కువగా నిద్ర లేమి, టీవీ చూడటం, కంప్యూటర్​ ముందు అధిక సమయం గడపడం వంటివి దీనికి కారణాలుగా ఉండొచ్చు. మరి.. వీటిని తగ్గించుకోవడం ఎలా? వైద్యులు ఏం చెబుతున్నారు?

HowTo Prevent Dark Circles Around Eyes
HowTo Prevent Dark Circles Around Eyes
author img

By

Published : Jul 2, 2022, 7:02 AM IST

Dark Circles Under Eyes: ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో కంటి కింద నల్లటి వలయాలు కూడా ఒకటి. దీనికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. టీవీ చూడటం, పోషకాహార లోపం, కంప్యూటర్​ను అలాగే కళ్లప్పగించి చూస్తూ ఉండటం.. ఇలా చాలానే ఉంటాయి. ఈ నల్లటి మచ్చలతో ముఖం అందవిహీనంగా కనిపిస్తుందని చాలా మంది బాధపడుతుంటారు. మరి వీటిని తగ్గించుకోవడం ఎలా, నల్లటి వలయాలు ఏర్పడటానికి ఇంకేం కారణాలున్నాయో చెబుతున్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. చంద్రావతి.

డార్క్ సర్కిల్స్ రావడానికి కారణాలేంటి?

డార్క్ సర్కిల్స్ రావడానికి కారణాలు:
కళ్ల చుట్టూ నల్లగా ఉండడం అనేది చాలా సహజమైన సమస్య. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

  • రక్త లేమి కారణంగా కళ్ల చుట్టూ నల్లటి చారలు వచ్చే అవకాశముంది.
  • చర్మం పొడిగా ఉన్నవారి కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ రావచ్చు.
  • కొందరికి కంటి చుట్టూ ఉన్న చర్మం ఎప్పుడూ దురదగా ఉంటుంది. అలాంటి వాళ్లు పదేపదే కళ్లు నలుపుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా కళ్ల చుట్టూ నల్లగా మారే అవకాశముంది.
  • కొంత మంది లావుగా ఉన్నవారిలో మెడ చుట్టూ, కళ్ల చుట్టూ నల్లగా ఉంటుంది.
  • నిద్ర లేమి మరో కారణం. నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు, ఎక్కువ సేపు కంప్యూటర్, టీవీ చూసేవాళ్లకు కూడా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి.
  • కొందరికి కళ్ల చుట్టూ ఉన్న చర్మం పల్చగా ఉంటుంది. దాని కింద ఉన్న రక్త నాళాలు బయటకు కనిపించి, నల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది.
  • మరికొందరికి కళ్లు లోతుగా ఉంటాయి. అలాంటి వారిలో కళ్ల చుట్టూ నీడ పడి డార్క్ సర్కిల్స్​లా కనిపిస్తాయి.కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. వీటిని బట్టి వైద్యులు వేర్వేరు చికిత్సా విధానాలు అవలంబిస్తారు. అన్నింటికీ ఒకటే వైద్యం సరిపోదు.
  • కళ్ల చుట్టూ చర్మం దురదగా ఉన్నవారు.. ఆ సమస్యను తగ్గించుకునేందుకు, కళ్లు నలుపుకోకుండా చూసేందుకు ప్రయత్నించాలి.
  • పొడి చర్మం ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
  • పిగ్మెంటేషన్​ పోగొట్టే క్రీమ్స్​ ఉంటాయి. వాటిని రోజూ పగలు, రాత్రి రాసుకోవాలి. సన్​స్క్రీన్​ లోషన్​ వాడుతూ ఉండాలి.
  • ఎనీమియా ఉంటే ఆ సమస్యను పోగొట్టుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకోవాలి.
  • టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోకుండా చక్కగా నిద్రపోవాలి.

మరీ అవసరమైతే.. కెమికల్ పీల్స్​ అనే చికిత్సా విధానం అనుసరించాలి. అలా చేస్తే పిగ్మెంటేషన్​ తగ్గే అవకాశముంది.చర్మంపై నలుపు ఉంటే పైన చెప్పిన చికిత్సా విధానాలు ఉపయోగపడతాయి. కళ్లు లోతుగా ఉన్నవారికి.. మరో పద్ధతి ఉంది. హెలిరోనిక్ యాసిడ్​ ఫిల్లర్స్​ను ఇంజెక్ట్ చేస్తే లోతు తగ్గి.. కళ్ల చుట్టూ ఉన్న వలయాలు కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. పిగ్మెంటేషన్​ తగ్గించడానికి లేజర్ ట్రీట్​మెంట్​ కూడా అందుబాటులో ఉంది. అసలు డార్క్​ సర్కిల్స్​కు కారణం ఏంటో తెలుసుకున్నాకే వైద్యులు చికిత్స చేస్తారు.
రెగ్యులర్​గా సన్​స్క్రీన్​, మాయిశ్చరైజర్​ రాసుకోవడం, రాత్రిపూట 6-8 గంటలు నిద్రపోవడం, ఎక్కువసేపు టీవీ, కంప్యూటర్​ ముందు కూర్చోకుండా ఉండడం వంటి జాగ్రత్తలు పాటిస్తే కళ్ల చుట్టూ ఉన్న డార్క్​ సర్కిల్స్​ను తగ్గించుకోవచ్చు.

ఇవీ చూడండి: 'తొక్క'లోది అనుకోకండి.. వాటితో ఉపయోగాలు ఎన్నో!!

మొటిమలు తగ్గాలని పసుపు, నిమ్మ వాడుతున్నారా? మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.