ETV Bharat / sukhibhava

How to Use Pregnancy Kits at Home: ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసా..?

How to Use Pregnancy Kits at Home: ఈ రోజుల్లో.. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకోవడానికి ఆసుపత్రిదాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే.. ఎవరికి వారే టెస్ట్ చేసుకోవచ్చు. అయితే.. దానికో ప్రాసెస్ ఉంది. అదేంటో.. ఇక్కడ తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 1:14 PM IST

How to Use Pregnancy Kits at House
How to Use Pregnancy Kits at Home

How to Use Pregnancy Kits at Home: మాతృత్వాన్ని ఆస్వాదించాలని ప్రతీ స్త్రీ కోరుకుంటుంది. "అమ్మ" అనే పిలుపు "ఆమె" జీవితంలో ఒక మధురమైన అనుభూతి. ఈ అద్భుతమైన క్షణాల కోసం ఆమెతోపాటు.. కుటుంబం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తుంటుంది. అయితే.. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే.. గతంలో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేేది. ఇప్పుడు మాత్రం.. ఇంట్లోనే స్వయంగా, అది కూడా నిమిషాల్లోనే ప్రెగ్నెన్సీని నిర్ధారించుకుంటున్నారు. ఇందుకోసం మెడికల్​ షాపుల్లో చాలా రకాల కిట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి టెస్ట్​ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Pregnancy Tracker Apps : తల్లి కాబోతున్నారా?.. ఈ యాప్స్​తో మీ బిడ్డ ఎదుగుదలను చూసుకోండి!

ప్రెగ్నెన్సీ కిట్ ఎలా వాడాలి..? ( How to Use Pregnancy Kit ) :

  • మెడికల్​ షాపు నుంచి ఏదైనా ప్రెగ్నెన్సీ టెస్ట్​ కిట్​ తెచ్చుకోండి.
  • ఉదయం లేవగానే టెస్ట్ చేసుకుంటే రిజల్ట్ మెరుగ్గా వచ్చే ఛాన్స్ ఉంది.
  • ఇప్పుడు.. పొడి కంటైనర్లో యూరిన్ సేకరించండి.
  • ఆ తర్వాత.. ప్యాకెట్​ ఓపెన్ చేయండి.
  • అందులో ఇచ్చిన డ్రాపర్‌ని ఉపయోగించి, స్ట్రిప్ మీద ఉన్న నిర్దేశిత ప్రదేశంలో త్రీ డ్రాప్స్​ యూరిన్​ వేయండి.
  • తర్వాత పక్కన పెట్టి.. రిజల్ట్​ కోసం 3 నుంచి 5 నిమిషాలు వెయిట్ చేయండి.
  • ఇప్పుడు స్ట్రిప్‌లో రెండు పింక్​ లైన్స్​ చూసినట్లయితే మీరు ప్రెగ్నెంట్​ అని నిర్ధారించుకోండి.
  • ఒకవేళ ఒక పింక్​ లైన్​ వస్తే.. గర్భవతి కాలేదని అర్థం.
  • అయితే.. ఒక్కోసారి టెస్ట్​లో లైన్స్ ఏమీ​ కనిపించకపోవచ్చు.
  • దానికి స్ట్రిప్ నాణ్యంగా లేకపోవడం.. గడువు తేదీ దాటిపోవడం వంటివి కారణం కావొచ్చు

ఇవి సరిగ్గానే పని చేస్తాయా..: దాదాపు 99 శాతం ఈ కిట్స్ ద్వారా సరైన ఫలితాలే వస్తాయన్నది నిపుణుల మాట. అయితే.. కిట్ మీద పేర్కొన్న సూచనలు తప్పక పాటించాల్సి ఉంటుంది. లేదంటే.. ఫలితాలు తేడా వచ్చే అవకాశం ఉంది.

  • గమనిక చదవాలి: కిట్ ఏదైనా.. దాన్ని ఎలా వాడాలనే వివరాలతో.. ప్యాక్​లో ఒక కాగితం ఉంటుంది. అది తప్పకుండా చదవాలి. ప్రతీ కిట్ hCG హార్మోన్ ఆధారంగానే పనిచేస్తుంది. కానీ.. కిట్ ఉపయోగించే పద్ధతులు వేరుగా ఉండొచ్చు. ఉదాహరణకు.. కొన్ని కిట్స్ లో మూత్రం ఎన్ని చుక్కలు వేయాలనే విషయంలో మార్పు ఉండొచ్చు. కొన్ని కిట్స్ యూరిన్ సేకరించే పద్ధతి కూడా వేరేగా ఉంటాయి. కాబట్టి టెస్ట్​ చేసుకునే ముందు ఈ పేపర్​ ఖచ్చితంగా చదవాల్సిందే.
  • సరైన సమయంలో ప్రెగ్నెన్సీ టెస్ట్​: మీకు రావల్సిన టైంకి పీరియడ్స్​ రాకుంటే టెస్ట్​ చేసుకోవాలి. ఉదాహరణకు మీకు ఈ నెల 5 న పీరియడ్ రావాల్సి ఉండి, రాకపోతే తరువాతి రోజు టెస్ట్ చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా ఒకే రకంగా పీరియడ్స్ వచ్చేవాళ్ల విషయంలో.. దాదాపుగా ఫలితం సరిగ్గానే వస్తుంది. అయితే.. ప్రతి నెలా ఒకే తేదీన పీరియడ్స్ రాని వాళ్లు.. పీరియడ్ మిస్ అయిన వారానికి ఈ టెస్ట్ చేసుకుంటే మంచిది.
  • నీళ్లు తాగడం: ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోబోయే ముందు ఎక్కువగా నీళ్లు తాగకూడదు. దీనివల్ల మూత్రంలో ఉన్న HCG స్థాయిల గాఢత తగ్గిపోతుంది. అలాగే ఉదయాన్నే మొదటిసారి మూత్రం వెళ్లేటపుడు ఈ టెస్ట్ చేసుకుంటే సరైన ఫలితాలు వస్తాయి.
  • టైమర్ లేకపోవడం: టెస్ట్ చేసుకున్న వెంటనే ఫలితం గురించి ఆసక్తి ఉంటుంది. కానీ తప్పకుండా టైమర్ వాడండి. ఈ వివరాలు కూడా కిట్ మీదే రాసి ఉంటాయి. టైం కన్నా ముందుగా చూసినా.. ఆలస్యంగా చూసినా ఫలితం సరిగ్గా తెలుసుకోలేరు. అలాగే ఫలితం ఎలా తెలుసుకోవాలనే విషయంలో స్పష్టత తెచ్చుకోండి.

Planning To Conceive : ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తున్నారా? ఆ మాత్రల విషయంలో జాగ్రత్త!

Medicine During Pregnancy : సొంత వైద్యం వద్దు.. మందుల విషయంలో జాగ్రత్త.. గర్భిణీలకు నిపుణుల సలహాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.