How to Store Green Peas Fresh for Long Time : పచ్చి బఠానీలు.. అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే వీటితో చేసే వంటలైన.. వంకాయ బఠానీ, ఆలూ బఠానీ, పన్నీర్ బఠానీ.. యమరుచిగా ఉంటాయి. అలాగే పచ్చి బఠానీలతో కట్లెట్, కచోరీలు, సమోసా లాంటి స్నాక్స్ చేసినా సూపర్‌గా ఉంటాయి. కేవలం రుచి మాత్రమే కాదు.. వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా విటమిన్ బి6, సి, ప్రొటీన్స్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పచ్చి బఠానీలలో అధికంగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని తరచూ తినడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇవి అన్ని కాలాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండవు. అందుకే అవి దొరికే కాలంలో ఎక్కువగా కొనుగోలు చేసి.. ఈ టిప్స్ పాటిస్తూ స్టోర్ చేసుకున్నారంటే అవి ఏడాది కాలం పాటు ఫ్రెష్‌గా ఉండడం ఖాయం. ఆ తర్వాత మీకు నచ్చినప్పుడు వాటిని వివిధ వంటలలో ఉపయోగించవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ముల్లంగి ఆకులను పడేస్తున్నారా? ఈ హెల్త్ బెనిఫిట్స్ మిస్ అయినట్లే!
How To Preserve Green Peas For Long Time in Telugu :
- మొదట బఠానీ కాయల నుంచి బఠానీలను వేరు చేసి.. అందులో రంగు మారిన లేదా పాడైపోయిన బఠానీ గింజలు తీసివేయాలి.
- అనంతరం వాటిని ఎక్కువ కాలం స్టోర్ చేయడానికి మీరు చేయాల్సిన పని.. వాటిని ఉడకబెట్టడం. ఇలా చేయడం ద్వారా చాలా కాలం ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ ప్రక్రియను బ్లాంచింగ్ అంటారు. అందుకోసం మీరు ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి.. నీళ్లు మరుగుతున్న సమయంలో బఠానీలను వేసి 2 నిమిషాలు ఉడికించాలి.
- ఆ తర్వాత పచ్చిబఠానీలను వడకట్టి.. వెంటనే ఐస్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి.
- ఇక బఠాణీలు చల్లారిన తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని వాటిని తుడిచి.. దానిపై తేమ పోయే వరకు ఆరబెట్టాలి. కొంచెం కూడా తడిదనం లేకుండా చూసుకోవాలి.
నెల రోజులు గుడ్లు తినడం మానేస్తే - మీ బాడీలో జరిగేది ఇదే!
- ఆ తర్వాత పచ్చి బఠానీలను ఎయిర్ టైట్ జిప్-లాక్ కంటైనర్లు, ఫ్రీజర్ సేఫ్ కంటైనర్లు లేదా హెవీ డ్యూటీ ఫ్రీజర్ బ్యాగ్‌లలో వేసి లాక్ చేయాలి. అయితే కంటైనర్‌లో పెద్దమొత్తంలో కాకుండా మీల్ సైజ్ పరిమాణంలో వాటిని పోసుకోవాలి.
- అనంతరం వాటిని ప్యాకేజింగ్ తేదీ ప్రకారం లేబుల్ చేయాలి. అంటే ఆ ప్యాక్‌లపై స్టోర్ చేసిన డేట్ రాయాలి. ఇలా చేయడం ద్వారా అది బఠానీల తాజాదనాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
- ఇలా చేసిన పచ్చి బఠానీలను ఫ్రీజర్‌లో స్టోర్ చేశారంటే దాదాపు ఏడాది కాలం అవి ఫ్రెష్‌గా నిల్వ ఉంటాయి. తర్వాత మీకు నచ్చినప్పుడు వాటితో వంటలు, స్నాక్స్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు.
ఇన్సులిన్ సమస్యలు, గుండె జబ్బులు దూరం! బ్రౌన్‌రైస్‌తో ఎన్నో లాభాలు
బఠానీలను బ్లాంచింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే..
- పోషకాలను కాపాడుతుంది: బ్లాంచింగ్.. బఠాణీలలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను నిలుపుతుంది. సాధారణ వంటకాలలో ఉడకబెట్టినప్పుడు కొన్ని పోషకాలు నీటిలో కరిగిపోతాయి. బ్లాంచింగ్ వల్ల ఇలా జరగదు.
- రంగును కాపాడుతుంది: బ్లాంచింగ్ ప్రక్రియ.. బఠాణీలకు ఆకర్షణీయమైన ఆకుపచ్చని రంగును ఇస్తుంది. ఇది ఆహారాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: బ్లాంచింగ్.. బఠాణీల బయటి పొరను కొద్దిగా మృదువుగా చేస్తుంది. దీని వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. ఇది ముఖ్యంగా పెద్దలకు, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
- ఆహారాన్ని త్వరగా ఉడికించడానికి సహాయపడుతుంది: బ్లాంచింగ్ చేసిన బఠాణీలు వేగంగా ఉడుకుతాయి. కాబట్టి వాటిని వేరే పదార్థాలతో వేగంగా వండుకోవచ్చు. ఇది వంట సమయాన్ని ఆదా చేస్తుంది.
- ఫ్రీజర్‌లో నిల్వచేసే గడువు పెంచుతుంది: బ్లాంచింగ్ చేసిన బఠాణీలను ఫ్రీజర్‌లో ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఇది చలికాలంలో ఫ్రెష్ బఠాణీలను ఆస్వాదించడానికి మంచి మార్గం.
నీరసం తగ్గి రోజంతా యాక్టివ్‌గా ఉండాలా? - అయితే ఈ ఫ్రూట్స్ తినాల్సిందే!
మీకు నల్ల పసుపు గురించి తెలుసా? - లేదంటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్లే!