ETV Bharat / sukhibhava

మధుమేహులూ జాగ్రత్త! కాళ్లల్లో పుండ్లు వస్తున్నాయా? ఈ పనులు కచ్చితంగా చేయాల్సిందే

ఈ మధ్య ఎక్కడ చూసినా డయాబెటిస్ (మాధుమేహం) వ్యాధి గురించి వింటున్నాం. దీనిని సాధారణంగా షుగర్ అని పిలుస్తారు. భారత్‌లో మధ్య వయస్కుల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహం బారిన పడినవారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో ఎక్కువమంది ఎదుర్కొనే సమస్య డయాబెటిక్ ఫుట్. ఇది వస్తే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

how to prevent diabetic foot
how to prevent diabetic foot
author img

By

Published : Apr 30, 2023, 9:47 AM IST

మధుమేహం ఇప్పుడు ఒక సాధారణ వ్యాధిలా మారిపోయింది. ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. మధుమేహాన్ని అదుపులోకి తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది. దీని కోసం ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోడం తప్పనిసరి. కొన్ని పదార్థాలకు దూరం కావాల్సి వస్తుంది.

డయాబెటిక్ ఫుట్ అంటే ఏమిటి?
ఒకసారి మధుమేహం బారిన పడితే దాంతో పాటు అనేక వ్యాధులు కూడా వస్తాయి. అలా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువమంది డయాబెటిక్ ఫుట్‌తో బాధపడుతుంటారు. కాళ్లకు రక్తప్రసరణ నెమ్మదించడం, రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల కాళ్లకు సమస్యలు వస్తాయి. దీనినే డయాబెటిక్ ఫుట్ అని అంటారు.

కాళ్లకు పుండ్లు, స్పర్శ తగ్గడం
మధుమేహం అదుపులో లేకపోవడం, వ్యాధి ముదిరిపోవడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. దీని వల్ల కాళ్ల స్పర్శ తగ్గిపోవడం, మంట రావడం, పుండ్లు వస్తాయి. కాళ్లకు తిమ్మిర్లు పట్టడం సహా గాయాలు అవుతాయి. ఇలాంటి సమయాల్లో కాళ్ల సంరక్షణను పట్టించుకోకపోతే చాలా నష్టం జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాళ్లు పోయే ప్రమాదం
డయాబెటిక్ ఫుట్ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే కాళ్లు పోయే ప్రమాదం ఉంటుంది. అంతర్జాతీయ వైద్య నిపుణుల నివేదికల ప్రకారం.. డయాబెటిక్ ఫుట్ బారిన పడి 30 శాతం మంది కాళ్లు కోల్పోతున్నారు. అంటే పది మందిలో ముగ్గురికి.. మధుమేహం ఎక్కువ కావడం వల్ల కాళ్లను పూర్తిగా తొలగించాల్సి వస్తుంది.

ఇది చాలా ప్రమాదకరం
డయాబెటిక్ ఫుట్ చాలా ప్రమాదకరమని.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కాళ్లను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే మరింత ముదిరి కాళ్లు పనికిరాకుండా పోతాయి. దీని వల్ల కాళ్లను తీసేయాల్సి వస్తుంది. డయాబెటిక్ ఫుట్‌తో బాధపడేవారు ముందుగా షుగర్​ను అదుపులో పెట్టుకోవాలి. డాక్టర్లు సూచించే ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం వల్ల డయాబెటిక్ ఫుట్ సమస్య నుంచి బయటపడవచ్చు.

ముందే గుర్తిస్తే చికిత్సతో నయం
డయాబెటిక్ ఫుట్‌ను ముందే గుర్తించడం వల్ల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. కాళ్లు లాగినట్లు అనిపించడం, కాళ్ల కింద స్పర్శ తగ్గడం, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, కాళ్లు బలహీనంగా ఉండటం, వేళ్ల మధ్య పుండ్లు లాంటి లక్షణాలుంటే.. వాటిని గుర్తించి డాక్టర్లను సంప్రదించడం వల్ల చికిత్సతో నయం చేయవచ్చు.

చికిత్స ఎలా అందిస్తారు?
కాళ్లకు రక్త సరఫరా తగ్గిన రోగులకు యాంజియోప్లాస్టీ, లెగ్ బైపాస్, పాద ధమనుల ద్వారా కాళ్లు, పాదాలకు రక్త సరఫరా అయ్యేలా చూస్తారు. ఈ చికిత్స ద్వారా డయాబెటిక్ ఫుట్ తగ్గుతుంది.

ఇవి పాటించడం వల్ల పాదాలకు రక్షణ
డయాబెటిక్ ఫుట్ సమస్యతో బాధపడేవారు మద్యం, పొగతాగే అలవాటు ఉండే మానేయాలి. షుగర్‌ను అదుపులో పెట్టుకోవాలి. శారీరక శ్రమ కోసం రోజూ వ్యాయామం చేయాలి. కాళ్లను రోజూ గోరు వెచ్చని నీళ్లు, సబ్బుతో కడగాలి. చర్మం తడిగా లేకుండా చేసుకోవాలి.

డయాబెటిక్ ఫుట్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.