ETV Bharat / sukhibhava

కండరాల బరువు పెంచుకోవాలనుకుంటున్నారా? వాటికి స్వస్తి పలికి ఈ పద్ధతులు ట్రై చేయండి!

Muscle Gain Tips in Naturally: కండలు పెంచాలని, ఫిట్‌గా ఉండాలని చాలా మంది ట్రై చేస్తారు. ఇందుకోసం జిమ్‌కెళ్తూ తెగ కష్టపడుతుంటారు. ఇంకొందరయితే త్వరగా కండలు రావడానికి ప్రొటీన్​ సప్లిమెంట్లు వాడుతుంటారు. అలాకాకుండా కేవలం నేచురల్​గా కండలు పెంచుకోవచ్చని మీకు తెలుసా..? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Muscle Gain Tips in Naturally
Muscle Gain Tips in Naturally
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 11:17 AM IST

Updated : Jan 13, 2024, 12:07 PM IST

Muscle Gain Tips in Naturally: శరీరం దృఢంగా, బలమైన కండరాలు కలిగి ఉండాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి తగినట్టుగా జిమ్‌కెళ్లి రకరకాల వ్యాయామాలు చేసి కష్టపడుతుంటారు. అయినప్పటికీ, సహజంగా కండరాల బరువు పెరగడం అంత తేలికైన పని కాదు. మరికొందరు త్వరగా కండలు రావడానికి ప్రొటీన్​ సప్లిమెంట్లతోపాటు స్టెరాయిడ్స్ కూడా వాడతారు. దీంతో అనారోగ్యం బారిన పడుతుంటారు. ఇలా కాకుండా కేవలం సహజ పద్ధతుల ద్వారా కండలు పెంచుకోవచ్చని మీకు తెలుసా..? ఈ టిప్స్​ ఫాలో అయితే ఎటువంటి సప్లిమెంట్లు వాడకుండానే మంచి ఫిజిక్‌ను సొంతం చేసుకోవచ్చు. మరి ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ కళ్లు దెబ్బతినడం ఖాయం!

వెయిట్​ లిఫ్టింగ్​: కండరాలను పెంచడానికి ఇది ఉత్తమ మార్గం. కండరాల పెరుగుదలకు, మీరు కంపౌండ్ వ్యాయామాలపై దృష్టి పెట్టాలి. కంపౌండ్ వ్యాయామాలు.. మీ కండరాలను మరింత సమర్థవంతంగా పెంచడానికి సహాయపడతాయి. కంపౌండ్ వ్యాయామాలకు కొన్ని ఉదాహరణలు స్క్వాట్స్, డెడ్‌లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్ అండ్​ ఓవర్‌హెడ్ ప్రెస్. అయితే కండలు పెంచుకోవడానికి.. ఒక్కసారే ఎక్కువ బరువులు ఎత్తకుండా.. ముందు చిన్న చిన్న బరువులను ఎత్తడం చేయాలి.

ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్: ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ అంటే కాలక్రమేణా మీరు ఎత్తే బరువును క్రమంగా పెంచుకోవడం. ఇది పెరిగిన భారాన్ని నిర్వహించడానికి.. మీ కండరాల పనితీరును మెరుగుపరచడానికి, అలాగే ధృడంగా మారడానికి, కండరాలు బరువు పెరగడానికి సాయపడుతుంది. కాగా, ప్రతి వారం మీరు ఎత్తే బరువును 5 శాతం నుంచి 10శాతం వరకు పెంచుకోవచ్చు.

కడుపు నొప్పి ఉంటే గ్యాస్ట్రిక్​ క్యాన్సర్​ వచ్చినట్లేనా? నిపుణులు ఏమంటున్నారు..?

సరైన పోషకాహారం: కండరాల బరువు పెరగడానికి పోషకమైన ఆహారం కీలకం. కండరాలను బలంగా మార్చడానికి మీరు బర్న్ చేసే దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవాలి. కాంప్లెక్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రతి రోజు శరీర బరువు పౌండ్‌కు 1-1.5 గ్రాముల ప్రోటీన్‌ను తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. ప్రతి భోజనంలో ప్రోటీన్‌తో పాటు పుష్కలమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినాలి. ప్రతి రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. అలాగే జంక్​ ఫుడ్​, ప్రాసెస్ చేసిన ఆహారాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.

భోజనం చేసే సమయం: ఇది కూడా కండరాల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. మీరు మీ వ్యాయామం పూర్తి చేసిన 30 నిమిషాలలోపు ప్రోటీన్, కార్బోహైడ్రేట్లతో కూడిన భోజనం తినడానికి ప్రయత్నించాలి. ఇది గ్లైకోజెన్‌ను తిరిగి నింపడానికి, కండరాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తుంది.

మొలకలు తింటున్నారా? - ఈ డేంజర్ తెలుసా?

నిద్ర: కండరాల పెరుగుదలకు నిద్ర అవసరం. కండరాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు మాత్రమే అవి పెరుగుతాయి. నిద్రలో, మీ శరీరం కండరాలను నిర్మించడానికి ముఖ్యమైన గ్రోత్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ప్రతిరోజూ కనీసం 7-8 గంటల నిద్ర తీసుకోవడం చాలా ముఖ్యం.

రిపీటెడ్​ వ్యాయామాలు: కండరాలు బలంగా మారాలంటే.. పునరావృత వ్యాయామాలు చేయాలి. అంటే ఓ వ్యాయామాన్ని ప్రతి సెట్‌ను 3 సార్లు రిపీట్​ చేసే లాగా చూసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి. ప్రతి వ్యాయామం మధ్య విశ్రాంతి తీసుకోవాలి.

స్థిరత్వం: కండరాలు ధృడంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. పట్టుదల ఉండాలి. అంటే వారానికి ఒక్కసారి చేసి ఇక చాలు నా వల్ల కాదు అనుకోకుండా.. వారానికి కనీసం 3 సార్లు వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. కాలక్రమేణా వాటిని పెంచుకుంటూ పోవాలి. అయితే సహజ పద్ధతుల్లో కండరాలను పెంచడానికి కొంత సమయం, కృషి అవసరం. కానీ క్రమం తప్పకుండా శిక్షణ పొందడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను సాధించగలరు.

అధిక కొలెస్ట్రాల్​ సైలెంట్ కిల్లర్! - మేల్కోకుంటే అంతే!

నెల రోజులు మద్యం తాగడం ఆపేస్తే - మీ బాడీలో ఏం జరుగుతుంది?

పోషకాల నిలయం- బూడిద గుమ్మడికాయతో ఎంతో ఆరోగ్యం- బరువు తగ్గొచ్చు కూడా!

Last Updated : Jan 13, 2024, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.