ETV Bharat / sukhibhava

ఇలా వ్యాయామం చేస్తే.. చలిగిలి పరారే​!​ - winter health tips

'అసలే చలికాలం.. తగిలే సుమబాణం..' అని అదేదో పాటలో చెప్పినట్లుగానే ఈ వర్షాకాలంలో వీచే చల్లగాలి కూడా శరీరానికి బాణంలానే గుచ్చుకుంటుంది. మరి అంతటి చలిలో లేవడానికే బద్ధకంగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడానికి అస్సలు మనసొప్పదు. అలాగని వ్యాయామం చేయడం మానేస్తే శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ చలికి తట్టుకునేలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. బయట ఎంత చలిగా ఉన్నా వ్యాయామం చేయడం పెద్ద కష్టమనిపించదు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

how-to-exercise-in-winter-for-fitness
ఇలా వ్యాయామం చేస్తే.. చలిగిలి పారిపోతుంది!
author img

By

Published : Jun 17, 2020, 11:59 AM IST

వ్యాయామం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. ఇదే చలిగాలి నుంచి శరీరానికి వెచ్చదనాన్నిస్తుంది. కాబట్టి చలిగా ఉందని భయంతో బయటికి వెళ్లకుండా ఉంటే శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతేకాకుండా శరీరానికి అవసరమైన వెచ్చదనాన్ని పొందలేకపోవచ్చు. అందువల్ల ఉదయాన్నే లేచి ఓ పదిహేను నిమిషాల పాటు జాగింగ్‌కి వెళ్లడం మంచిది.

చల్లని వాతావరణం ఉన్నప్పుడు వీచే శీతలగాలుల వల్ల శరీరంలోని కండరాలు బిగుసుకుపోయినట్లుగా తయారవుతాయి. దీంతో వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. కాబట్టి మీరు ముందుగా చేసే జాగింగ్ ప్రక్రియ కండరాలు మామూలు స్థితిలోకి వచ్చేందుకు సహాయపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీరు తర్వాత చేయబోయే వ్యాయామానికి వార్మప్‌లా పనిచేస్తుంది.

తేమ శాతాన్ని పెంచండి..

వాతావరణం చల్లగా ఉన్న సమయంలో.. చర్మం తేమను కోల్పోవడం, మూత్రం రూపంలో ఎక్కువగా నీరు బయటికి వెళ్లిపోవడం.. వంటి సమస్యలు ఎదురవుతాయి. దీని వల్ల శరీరంలో తేమ శాతం తగ్గిపోతుంది. కాబట్టి దాహం వేయకపోయినా నీరు, తాజా పండ్ల రసాలు, కాస్త వేడి పానియాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. దీనివల్ల కోల్పోయిన తేమను తిరిగి పొందవచ్చు.

తోడుంటే మంచిది..

వర్షాకాలంలో అసలే బయట చినుకులు ఆపై చలి గాలి.. ఫలితంగా వ్యాయామం చేయాలనిపించదు. అయితే ఇలాంటప్పుడు ఒక్కరే 'సోలో'గా వ్యాయామం చేసేకంటే మీకు తోడుగా మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, బంధువులు.. ఎవరినైనా వ్యాయమం చేయమని అడగండి. ఎందుకంటే ఒక్కరు వ్యాయామం చేయడం కంటే ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. కాబట్టి మీతో పాటు ఎవరో ఒకరిని రోజూ తప్పకుండా వ్యాయామం చేయమని చెప్పండి. దీంతో బోర్ కొట్టకుండా రోజూ హ్యాపీగా కసరత్తులు చేయచ్చు.

సురక్షితంగా ఇలా..

చల్లని వాతావరణం ఉన్నప్పుడు వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో.. చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందులో భాగంగా ఉన్ని దుస్తులు, చేతులకు గ్లౌజులు, పాదాలకు సాక్సులు ధరించి షూస్ వేసుకోవడం మంచిది. అలాగే తలకు క్యాప్ పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తేనే చలి నుంచి చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తపడచ్చు. లేదంటే చలికి చర్మం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి.

గాలి వీచే దిశలోనే..

జాగింగ్‌కి వెళ్లినా, ఆరుబయట వ్యాయామం చేసినా.. గాలి ఏ దిశగా వీస్తుందనేది ముందు గమనించాలి. అలాగే మీరు కూడా గాలి వీచే దిశలోనే వ్యాయామం చేయాలి. దీనివల్ల చలి తీవ్రత ఎక్కువగా తెలియకుండా ఉంటుంది.

దుస్తులూ ముఖ్యమే!

ఏ కాలమైనా వ్యాయామం చేసే క్రమంలో చెమటలు పట్టడం సహజం. అలాగని చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు కాటన్ దుస్తులు వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే కాటన్ చెమటను పీల్చుకోవడం వల్ల దుస్తులు తడిగా అయిపోయి శరీరానికి మరింత చల్లగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ కాలంలో గాలికి త్వరగా ఆరిపోయే సిల్క్ దుస్తులు వేసుకోవడం మంచిది. అలాగే వ్యాయామం పూర్తయిన తర్వాత దుస్తుల్ని వెంటనే మార్చుకోవాలి. ఎందుకంటే తడిగా ఉండే దుస్తుల వల్ల శరీరంలోని వేడి క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం వెచ్చదనాన్ని కోల్పోతుంది.

చలికాలంలో శరీరాన్ని వ్యాయామం చేసేందుకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఎలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి? వ్యాయామం చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తదితర విషయాల గురించి తెలుసుకున్నారుగా! మరి, మీరు కూడా వీటిని పాటిస్తూ ఈ చల్లని వాతావరణంలోనూ క్రమం తప్పకుండా వ్యాయామాన్ని కొనసాగించండి.. తద్వారా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండండి.

ఇదీ చదవండి:అబ్బాయిలూ.. మీ ముఖాలు వెలిగిపోయే చిట్కా ఇది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.