కాలుష్యంతో వెంట్రుకలు పెళుసుబారి తేలికగా విరిగిపోతాయి. రోజులో ఎక్కువసేపు బయట తిరిగేవారికి ఈ ముప్పు మరీ ఎక్కువ. మరి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే... ఈ చిన్ని చిట్కాలు పాటించాల్సిందే....
- బయటకు వెళ్లేముందు తలకు టోపీ ధరించటం లేదా రుమాలు చుట్టుకోవటం మంచిది.
- తడికి దుమ్ము ధూళి అంటుకుపోతాయి. కాబట్టి తడి జట్టుతో రోడ్డు మీదికి వెళ్లకూడదు.
- జుట్టును గాలికి వదిలేయకుండా వీలైనంత వరకు తలకు దగ్గరగా ముడివేసుకోవాలి. అలాగని రబ్బరు బ్యాండ్ల వంటి వాటితో మరీ గట్టిగా బిగించకూడదు.
- వారానికి ఒకసారి షాంపూతో తలస్నానం చేశాక జుట్టుకు ఆవిరి పడితే మాడు మీది సూక్ష్మ రంధ్రాలు తెరుచుకొని వాటిల్లో చిక్కుకున్న కాలుష్య కారకాలు తేలికగా బయటకు వచ్చేస్తాయి.
- తేనె, పెరుగు, స్ట్రాబెర్రీ, వెనిగర్ కలిపి ఇంట్లో చేసుకునే మాస్క్ వెంట్రుకలకు రాసుకొని, అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కోవటం మంచిది.
- చేపలు, గింజపప్పులు, పెరుగు, తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవటం ద్వారా వెంట్రుకల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
- కొబ్బరినూనెలోని లారిక్ యాసిడ్ వెంట్రుకలోని కెరాటిన్ దెబ్బతినకుండా చూస్తుంది. ఇది వెంట్రుకల మధ్యలోని ఖాళీల్లో నిండి దుమ్ము, ధూళి, కాలుష్య కారకాలు, రసాయనాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.
ఇదీ చదవండి: జీవన శైలిని చక్కబెట్టుకో.. ఆరోగ్యాన్ని ఒడిసిపట్టుకో...