ETV Bharat / sukhibhava

మీరు తింటున్న బెల్లం మంచిదేనా? - కల్తీని ఇలా చెక్​ చేయండి! - Jaggery Purity checking

Tips to Jaggery Purity: బెల్లంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు కనీసం ఒక చిన్న బెల్ల ముక్క అయినా తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. అయితే.. ఇప్పుడు వచ్చే బెల్లంలో కల్తీ ఎక్కువగా ఉంటోందనే అభిప్రాయం ఉంది. మరి, మీరు తినే బెల్లం అసలైనదా? కల్తీ చేసిందా? ఎలా గుర్తించాలో తెలుసా??

Tips to Jaggery Purity
Tips to Jaggery Purity
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 11:30 AM IST

How to Check Jaggery Purity in Telugu: ఆరోగ్యానికి బెల్లం ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యంగా, ఫిట్​గా ఉండేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా బెల్లం తినడం వలన శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళతాయి. అందుకే.. కనీసం చిన్న బెల్లం ముక్కనైనా రోజువారి ఆహారంలో వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. అయితే.. ప్రజల అవసరాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బెల్లం కల్తీ చేసి మార్కెట్​లో విక్రయిస్తున్నారు.

చలికాలంలో ప్రతి ఒక్కరూ బెల్లం ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే.. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం, జింక్, ప్రొటీన్, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే. అందుకే దీన్ని నిత్యం తినాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే వ్యాపారమే పరమావధిగా కొందరు కేటుగాళ్లు బెల్లాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. కల్తీకి కాదేది అనర్హం అంటూ.. కాల్షియం కార్బొనేట్, సోడియం కార్బొనేట్‌తో బెల్లాన్ని కల్తీ చేస్తున్నారు. మరి ఈ కల్తీ బెల్లాన్ని ఎలా గుర్తించాలో ఈ స్టోరీలో చూద్దాం..

బెల్లం పసుపుతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? అస్సలే వదిలి పెట్టరు!

రంగు: బెల్లం.. స్వచ్ఛమైనదా..? లేదా కల్తీ అయినదా..? అని గుర్తించడంలో దాని రంగు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముదురు గోధుమ రంగులో ఉండే బెల్లం ఉత్తమం. పసుపు, లేత గోధుమరంగులు కలిగిన బెల్లంలో రసాయనాలు కలిపారని అర్థం. చాలా సార్లు బెల్లం రంగు చెరకు రసం కలపడం వల్ల ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. గోల్డెన్ బ్రౌన్ నుంచి డార్క్ బ్రౌన్ వరకు మార్కెట్‌లో ప్రతి రంగు బెల్లం అందుబాటులో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ముదురు గోధుమ రంగు బెల్లం మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

శీతాకాలంలో మీ ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తినాల్సిందే

ఆకృతి: స్వచ్ఛమైన బెల్లం గట్టిగా, ధృడంగా ఉంటుంది. కానీ, కల్తీ చేసిన బెల్లం మృదువుగా ఉంటుంది. ఇది రాతి ఉప్పు, జిప్సం వంటి పదార్థాలతో కల్తీ కావచ్చు.

నీటి పరీక్ష: ఒక గ్లాసు నీటిలో ఒక చిన్న ముక్క బెల్లం వేయండి. నిజమైన బెల్లం కరిగిపోయి, నీటికి ముదుగు గోధుమ రంగును ఇస్తుంది. నకిలీ బెల్లం అయితే కరగకుండా గ్లాసు అడుగుభాగానికి చేరుతుంది. లేదా నీటిని తెల్లగా మార్చవచ్చు.

'రాగి బెల్లం దోశ'తో ఆరోగ్యం పదిలం!

మలినాలు: మంచి బెల్లంలో మలినాలు తక్కువగా ఉంటాయి. చెరకు పీచు లేదా చిన్న కణాలు ఉండవచ్చు. కానీ.. అధిక మలినాలు ఉంటే అది కల్తీ చేసిన బెల్లంగా భావించొచ్చు.

వాసన: స్వచ్ఛమైన బెల్లం తీపిగా, కొంచెం ఘాటుగా మట్టి వాసనను పోలి ఉంటుంది. కానీ, కల్తీ చేసిన బెల్లంలో చక్కెర లేదా కార్న్ సిరప్ వంటి కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయి. అవి వేరే వాసన వస్తాయి.

బరువు తగ్గడానికి రొట్టె తింటున్నారా?

Alert : బ్రేక్​ఫాస్ట్​లో ఈ ఆహారాలు - క్యాన్సర్​ వచ్చే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.