ETV Bharat / sukhibhava

అదొక్కటీ బాగుంటే అన్నిట్లోనూ మీరే టాప్.. అదేమిటో తెలుసా? - ఆరోగ్య సూత్రాలు

మనం ఒక పని విజయవంతంగా చేయాలంటే ఏముండాలి? కృషి, దీక్ష, పట్టుదల.. ఆగండాగండి.. దీని గురించి మీకు చాలా తెలుసన్న విషయం అర్థమైపోయింది.. వీటన్నింటితో పాటు ఇంకేముండాలి? ఏంటా అని ఆలోచిస్తున్నారా? అదేనండీ.. ఆరోగ్యం! మనం చాలాసార్లు వింటూనే ఉంటాం కదా.. 'హెల్త్ ఈజ్ వెల్త్' అని! ఎన్నున్నా ఆరోగ్యం బాగుండకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఆరోగ్యంగా ఉంటేనే శరీరం, మనసు చేసే పనిపై దృష్టి సారించగలుగుతాయి. అందుకే ఉద్యోగం లేదా వ్యాపారంలో సక్సెస్ సాధించాలన్నా సంపూర్ణ ఆరోగ్యం తప్పనిసరి! అయితే మన దినచర్య ప్రణాళికాబద్ధంగా, నియమబద్ధంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మరిలాంటి హెల్దీ లైఫ్‌స్త్టెల్ కోసం ఏం చేయాలి? ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి...

health is wealth
అదొక్కటీ బాగుంటే అన్నిట్లోనూ మీరే టాప్.. అదేమిటో తెలుసా?
author img

By

Published : Apr 8, 2021, 6:58 AM IST

రతన్ టాటా, ధీరూభాయి అంబానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలు తమ విజయవంతమైన వ్యాపారం కోసం పక్కా దినచర్యతో ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్లే.. ఈరోజు వాళ్ల వ్యాపార సామ్రాజ్యాలు ఎంత ఎత్తులో ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే.. అందుకే మనమూ వాళ్లను ఫాలో అయిపోదాం.. మన ఆరోగ్యాన్ని కాపాడుకొని కెరీర్‌లో విజయాన్ని సాధిద్దాం.

'ఇన్ని పనులున్నాయి. ఇవన్నీ మాకెక్కడ కుదురుతాయి' అంటూ సాకులు చెప్పకండి. అంత పెద్ద వ్యాపారవేత్తలే ఆరోగ్యం కోసం సమయం కేటాయించారంటే అదెంత ముఖ్యమో మనకర్థం అవుతోందిగా.. అంత బిజీగా ఉన్నవాళ్లే ఆరోగ్య సంరక్షణ కోసం సమయం కేటాయించినప్పుడు మనం చేయలేమా చెప్పండి. అందుకే మన జీవితంలో చిన్న, చిన్న మార్పులు చేసుకుందాం..

వ్యాయామం

రోజూ ఉదయాన్నే లేచి కాసేపు వ్యాయామాలు చేయండి. ఎక్సర్‌సైజంటే తెగ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు.. రోజూ ఓ అరగంట నడవడమో, యోగా లేదా చిన్న చిన్న వ్యాయామాలు చేయడమో చేస్తే సరిపోతుంది. టైం లేదంటూ సాకులు మాత్రం చెప్పొద్దు. దీనికోసం మీ దినచర్యలో కొద్దిపాటి మార్పులు చేసుకొని ఓ అరగంట సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది. వేరే పనులను త్వరగా పూర్తి చేయడమో.. అవసరం లేని పనులను ఆపేయడమో చేస్తే వ్యాయామానికీ సమయం కేటాయించొచ్చు.

సరిగ్గా తినండి!

మాకు తెలుసు. ఇల్లూ, ఆఫీసు రెండింటి బాధ్యతలూ మీ మీదున్నాయి.. ఆ పనులన్నీ చేసేసరికే మీకు సమయం చాలదు. అలసిపోతారు. నిజమే.. అయితే భోజనం విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకండి. 'ఏదో ఒకటి ఉంది కదా తినేద్దాం' అనే పద్ధతి మానేయండి. ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహార పదార్థాలకు ప్రాముఖ్యమివ్వండి. ఫాస్ట్‌ఫుడ్ తగ్గించి సలాడ్స్ ఎక్కువగా తీసుకోండి. తినే ఆహారమూ మితంగా ఉండేలా జాగ్రత్తపడాలి. రెగ్యులర్‌గా బరువు, బీపీ, షుగర్ చెక్ చేసుకోండి.

మార్పులు చేసుకోండి..

భోజనంతో పాటు మీ జీవనశైలిలో కూడా చిన్నపాటి మార్పులు తీసుకురండి. అవేంటంటారా? టీవీ చూసే బదులు ఆ సమయాన్ని మీ కుటుంబంతో కలిసి గార్డెనింగ్‌లో గడపండి.. దీని వల్ల ఒత్తిడితో పాటు శరీర బరువూ తగ్గుతుంది. అలాగే ఆఫీసులో పై ఫ్లోర్​కి వెళ్లడానికి మెట్లెక్కేసేయండి. మంచినీళ్ల బాటిల్ టేబుల్ పైన పెట్టుకోవడం కాకుండా వాటర్‌ఫిల్టర్ దగ్గరికే వెళ్లి తాగి రండి.. కనీసం అలాగైనా మధ్యమధ్యలో సీట్లోంచి లేచే అవకాశం ఉంటుంది. ఆఫీసులోనే లంచ్ చేయాల్సి వస్తే కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించి, సలాడ్స్ ఎక్కువగా తీసుకోండి. ఇంట్లో వంటలోనూ కొద్దిపాటి మార్పులు చేయండి. నూనెల వాడకాన్ని తగ్గించడం, రోజూ డ్రైఫ్రూట్స్ తినడం లాంటివన్నమాట. స్కిన్‌డ్ చికెన్ తీసుకోవడం మానేసి, స్కిన్‌లెస్‌గా తీసుకోవడం ప్రారంభిస్తే మన శరీరానికి దాని నుంచి అందే కొవ్వు శాతాన్ని గణనీయంగా తగ్గించొచ్చు.

ద్రవపదార్థాలు ముఖ్యం..

ఆఫీసులో పనుల ఒత్తిడి ఎంతుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఒంట్లో నీటి శాతం తగ్గితే త్వరగా అలసిపోతారు. కాబట్టి రోజుకు సరిపడినంత మంచినీటిని తాగితే శరీరానికి మంచిది. బయటకు వెళ్లిన ప్రతిసారీ మంచినీళ్ల బాటిల్‌ను వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు. అలాగే ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగండి.

హాయిగా నిద్రపోండి!

వూపిరి సలపని పనులున్నాయని నిద్రపోయే సమయాన్ని కట్ చేస్తే ఎలా? రోజంతా పని చేసి అలసిపోయిన మీ శరీరానికి అప్పుడేగా విశ్రాంతి దొరికేది. కొందరికి ఆరుగంటల నిద్ర సరిపోతే.. మరికొందరికి ఎనిమిది గంటల నిద్ర ఉండాల్సిందే.. శరీరం అలుపును తీర్చుకోవడానికి ఎన్ని గంటల సమయం పడుతుందో ఎవరికి వారికే అవగాహన ఉంటుంది. కాబట్టి అన్ని గంటలు తప్పనిసరిగా నిద్రపోవాల్సిందే.. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. నిద్రపోయే ముందు మీ ఒత్తిళ్లన్నీ మర్చిపోవాలంటే.. గోరువెచ్చటి నీటితో స్నానం చేసి, గోరువెచ్చని పాలు తాగి మంచి పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకోండి.

ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి.. కెరీర్‌లో విజయం సాధించడం ముఖ్యమే.. కానీ దానికోసం ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.. అలా చేస్తే మనం మన లక్ష్యానికి ఒక్కడుగు చేరువ కాగలమేమో కానీ తిరిగి రెండడుగులు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు చెప్పుకొన్న జాగ్రత్తలన్నీ పాటించండి. మీ ఆరోగ్యాన్ని, తద్వారా మీ విజయాలను పదిలంగా కాపాడుకోండి.

ఇదీ చదవండి: కార్డు లేకుండా క్యాష్ విత్‌డ్రా ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.