ETV Bharat / sukhibhava

మీ పరుపు ఎన్నాళ్లకు మార్చేయాలి? - లేకపోతే ఏమవుతుంది? - When to Change Mattress

How to Find Mattress Expiry Date : ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య నిద్రలేమి. ఇందుకు ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు చాలా వరకు కారణాలవుతుండగా.. మీరు పడుకునే పరుపు కూడా ప్రధానమైన రీజన్ అయ్యే ఛాన్స్ ఉందని మీకు తెలుసా? ఎన్నాళ్లకోసారి పరుపు మార్చేయాలో.. లేకపోతే ఏమవుతుందో తెలుసా??

How to Find Mattress Expiry Date
How to Find Mattress Expiry Date
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 10:30 AM IST

How Often You Should Replace Mattress : మనం ఆరోగ్యంగా జీవించడానికి రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. కానీ.. ప్రస్తుతం చాలా మంది పని ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే వీటికితోడు తగిన నిద్రలేకపోవడానికి మీ బెడ్​ రూమ్​లో ఉండే పరుపు(Mattress) కూడా కారణమవుతుందని అంటున్నారు నిపుణులు!

దాదాపు అందరి ఇళ్లలో బెడ్స్ ఉంటాయి. వాటిపై కొందరు మామూలు పరుపులు యూజ్ చేస్తుంటే, ఇంకొందరు బ్రాండెడ్​వి వాడుతుంటారు. అయితే సాధారణంగా దుప్పట్లు, దిండ్లు మాసిపోతేనో లేదంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంటేనో ఉతుకుంటారు. అవసరమైతే మార్చుతుంటారు. కానీ.. పరుపులను మాత్రం దీర్ఘకాలం వాడుతూనే ఉంటారు. కానీ అది సరికాదంటున్నారు. పరుపులను కూడా వాటి జీవిత కాలం అయిపోగానే మార్చాలంట. మరి.. వాటి జీవితకాలం అయిపోయిందని ఎలా గుర్తించాలో చూద్దాం.

బ్యాడ్ స్మెల్ : మనం ఎక్కువ రోజులు ఏవైనా దుస్తువులు యూజ్ చేస్తే బ్యాడ్ స్మెల్స్ వస్తుంటాయి. అలాగే మీరు యూజ్ చేసే పరుపు కూడా అసహ్యకరమైన వాసనలు వెదజల్లుతుందంటే.. దాని లైఫ్​టైమ్ అయిపోయిందని గమనించాలి. అప్పుడు వీలైనంత త్వరగా మార్చేయాలి.

ఎత్తు పల్లాలు : మీరు చాలా కాలంగా ఒకే పరుపును యూజ్ చేస్తుంటే.. అది బాగా అణిగిపోయి ఉంటుంది. దాంతో పరుపు మొత్తం ఎత్తుపల్లాలుగా మారుతుంది. నిద్రపోవడానికి ఇబ్బందిగా మారుతుంది. ఇలా పరుపు ఇబ్బంది పెడితే.. దాని జీవితకాలం అయిపోయిందని గమనించి, మరోదాన్ని తీసుకోవడం బెటర్. లేదంటే మీరు ఆ పరుపు మీద ప్రశాంతంగా నిద్రపోలేరు.

కంటి నిండా నిద్రపోవాలా? మీరు తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్​ ఇదే!

వెన్నునొప్పి : పరుపు లైఫ్​టైమ్ అయిపోయిందని సూచించే మరో సంకేతం.. మీరు ఉదయం లేవగానే వెన్నునొప్పి ఇబ్బందిపెట్టడం. ఎందుకంటే దానిమీద రోజూ నిద్రించడం వల్ల అది దగ్గరికి అవుతుంది. అప్పుడు ఆ పరుపుపై సమాంతరంగా పడుకోలేం. దాంతో వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ పరుపు జీవితకాలం అయిపోయిందని గమనించాలి.

దశాబ్దానికి పైగా ఉపయోగం : చాలా మంది పరుపును సంవత్సరాలు సంవత్సరాలుగా యూజ్ చేస్తుంటారు. కానీ దానికీ ఓ జీవితకాలం ఉంటుందనే విషయం గుర్తించాలి. సాధారణంగా దశాబ్దానికి పైగా ఉపయోగిస్తుంటే ఓసారి దానిని చెక్ చేసి.. అవసరమైతే మార్చుకోవడం బెటర్. ఈ సంకేతాలను గమనించి మీ పరుపు జీవితకాలాన్ని తెలుసుకొని మార్చడం వల్ల మీరు హాయిగా మంచి పోశ్చర్​లో నిద్రపోతారు. లేదంటే డైలీ నిద్రలో ఆటంకం కలుగుతుందంటే అది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.

మీ పరుపు ఎక్కువ కాలం రావాలంటే..

పరుపు కవర్లు ఉపయోగించడం : మీ పరుపును దుమ్ము, బూజు నుంచి కాపాడుకోవడానికి పరుపు కవర్లు ఉపయోగించండి. ఈ రక్షణ కవర్లు మీ పరుపుపై మరకలు పడకుండా, అందులోకి నీరు పోకుండా కాపాడుతాయి.

పరుపును తిప్పివేయడం : చాలా మంది పరుపును ఒకే సైడ్ ఉపయోగిస్తుంటారు. కానీ, అప్పుడప్పుడూ తిప్పివేయడం ద్వారా ఎక్కువ కాలం వస్తాయట. జోన్డ్ లేదా లేయర్డ్ హైబ్రిడ్ నిర్మాణంతో ఉన్న పరుపులకు వర్తించకపోయినా, కొన్ని సాంప్రదాయ స్ప్రింగ్ మ్యాట్రెస్‌లకు ఇది చాలా కీలకం. దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల నిర్దిష్ట ప్రాంతాల్లో లోతైన ముద్రలు ఏర్పడకుండా నిరోధించడానికి మీ పరుపును సంవత్సరంలో కొన్ని సార్లు తిప్పివేసుకోండి.

60 సెకన్లలో గాఢ నిద్ర - చంటి పాపలా పడుకుంటారంతే!

నిద్ర సరిగ్గా పట్టనివాళ్లు ఈ చిట్కాలు పాటించేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.