ETV Bharat / sukhibhava

'కాఫీ'తో మీ వయసు దాచేయండిలా!

మచ్చలేని చందమామల్లా మెరిసిపోవాలనుందా? మేకప్ అవసరం లేకుండా అందంగా ఉండాలనుకుంటున్నారా? వయసు ఎంత పెరిగినా యవ్వనంగా కనిపించాలనుందా? అయితే, కాఫీ ముఖానికి రాసేసుకోండి. అవును, కాఫీతో కేవలం తలనొప్పి తగ్గడమే కాదు, కళ్లు చెదిరే అందం మీ సొంతం అవుతుంది. మీ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. అదెలా అంటారా? అయితే పూర్తి కథనం చదివేయండి...

home-made-coffee-mask-is-perfect-to-get-rid-of-dark-circles-puffiness-and-more
'కాఫీ'తో మీ వయసు దాచేయండిలా!
author img

By

Published : Aug 7, 2020, 10:30 AM IST

కాఫీని సౌందర్య సాధనంగా ఉపయోగిస్తే.. ఇక మీ అందానికి తిరుగుండదు. ముఖం ఉబ్బినట్లుగా కనిపించడం, ముఖ చర్మం పొలుసులుగా ఊడిపోవడం.. ఇలాంటి సమస్యలు మనకూ అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. అయితే వాటికి ఈ కాఫీ స్క్రబ్‌ చక్కటి పరిష్కారం చూపుతుంది.

కావాల్సినవి....

  • బరకగా దంచిన కాఫీ పొడి - 2 టీస్పూన్లు
  • బ్రౌన్‌ షుగర్‌ - ఒకటిన్నర స్పూన్లు
  • ఆలివ్‌ నూనె - టీస్పూన్
  • తేనె - టీస్పూన్
  • పాలు - టీస్పూన్

తయారీ

ఒక మిక్సింగ్‌ బౌల్‌ తీసుకొని అందులో అన్ని పదార్థాలు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి గుండ్రంగా రుద్దుతూ అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

ఆ సమస్యలకు చక్కటి పరిష్కారమిది!

ఈ ఫేస్‌ప్యాక్‌ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న బాలీవుడ్‌ బ్యూటీ అలయ.. 'ముఖం ఉబ్బినట్లుగా కనిపించడం అనేది నాకు పదే పదే ఎదురయ్యే సమస్య. ఇటీవలే దీనికి పరిష్కారం కనుక్కున్నా. అదే కాఫీ ఫేస్‌మాస్క్‌/స్క్రబ్‌. ఇది ఉబ్బిన ముఖాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడంతో పాటు పొలుసులుగా ఊడిపోయే చర్మానికి చక్కటి పరిష్కారం చూపుతుంది. అలాగే ముఖాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చుతుంది.. ఈ కాఫీ స్క్రబ్‌ని బాడీ స్క్రబ్‌గా కూడా ఉపయోగించచ్చు.' అని తెలిపింది.

home-made-coffee-mask-is-perfect-to-get-rid-of-dark-circles-puffiness-and-more
'కాఫీ'తో మీ వయసు దాచేయండిలా!

వయసు ఛాయలు తగ్గించే ‘కాఫీ’!

అలయ పంచుకున్న ఫేస్‌మాస్క్‌ తయారుచేసుకోవడానికి ఎంతో సులభంగా ఉంది కదూ!! అంతేకాదు.. ఇందులో వాడిన పదార్థాల్లో బోలెడన్ని సౌందర్య రహస్యాలు కూడా దాగున్నాయి. ఇంతకీ ఎందులో ఏమున్నాయంటే..!

  • కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వాతావరణ కాలుష్య ప్రభావం చర్మంపై పడకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా నవయవ్వనంగా మెరిసిపోవచ్చు. అలాగే మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించే శక్తి కూడా కాఫీకి ఉంది.
  • బ్రౌన్‌ షుగర్‌ చర్మం పొలుసులుగా ఊడే సమస్యను తగ్గించి మృదువుగా, యవ్వనంగా మార్చుతుంది. అలాగే మృతకణాల్ని తొలగిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు, గ్లైకోలికామ్లం చర్మానికి మెరుపునందించడంలో సహకరిస్తాయి.
  • ఆలివ్‌ నూనె చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే ‘ఎ’, ‘డి’, ‘ఇ’, ‘కె’ విటమిన్లు చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. ఇక ఆలివ్‌ నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు వాతావరణంలోని బ్యాక్టీరియా ప్రభావం చర్మంపై పడకుండా రక్షిస్తాయి.
  • తేనెలోని యాంటీ మైక్రోబియల్‌ గుణాలు మొటిమల్ని తగ్గించడంలో సహకరిస్తాయి. అలాగే మృతకణాలు, ముఖంపై ముడతలు-గీతల్ని తగ్గించే శక్తి తేనె సొంతం.
  • పొడిబారిన చర్మానికి సాంత్వన చేకూర్చడంలో పాలది మొదటి స్థానం. ఇందుకు పాలలోని 'ఎ' విటమిన్‌ తోడ్పడుతుంది. ఇక ఇందులోని విటమిన్‌ 'డి' ముఖంపై ముడతలు-గీతల్ని తగ్గించడంతో పాటు చర్మం సాగే గుణాన్ని పెంచుతుంది.

ఇదీ చదవండి: ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.