ETV Bharat / sukhibhava

Himalayan Salt Vs Table Salt : హిమాలయన్ ఉప్పు​ Vs​ సాధారణ ఉప్పు​.. ఆరోగ్యానికి ఏది మంచిది?

Himalayan Salt Vs Table Salt : రుచి కోసం మనం తినే ఆహారంలో ఉప్పును కలుపుకోవడం సర్వసాధారణం. అయితే ఉప్పును అతిగా వాడితే మాత్రం అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. అందుకే సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా హిమాలయన్​ ఉప్పు వాడాలని కొంత మంది సూచిస్తున్నారు? మరి హిమాలయన్ ఉప్పు వల్ల నిజంగానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? తెలుసుకుందాం రండి.

Table Salt  vs Himalayan Salt
Himalayan Salt Vs Table Salt
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 7:59 AM IST

Himalayan Salt Vs Table Salt : ఉప్పు మనం తీసుకునే ఆహారం రుచిని పెంచుతుంది. కానీ అదే ఉప్పు మోతాదును మించితే ముప్పుగా పరిణమిస్తుంది. వాస్తవానికి ఉప్పు అధికంగా వాడితే కచ్చితంగా ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అందుకే ఉప్పుకు ప్రత్యామ్నాయంగా హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌, ఇతర రకాల సముద్ర ఉప్పులు ఉపయోగించవచ్చని చెబుతున్నారు.

సాధారణ ఉప్పు ఉపయోగాలు
Table Salt Health Benefits : వాస్తవానికి ఉప్పును ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం సరిగ్గా పని చేయాలంటే ఉప్పు చాలా ముఖ్యమైంది. అందుకే ఆహారంలో రుచితో పాటు ఆరోగ్యం కోసం ఉప్పును వాడుతుంటాం. కానీ ఆహారంలో ఈ ఉప్పు శాతం ఎక్కువైనా, తక్కువైనా కూడా కచ్చితంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎక్కువ కాలం ఉప్పును మోతాదుకు మించి వాడితే అనారోగ్యానికి గురవుతారు. ముఖ్యంగా రక్తపోటు, గుండె పోటు లాంటి సమస్యలు పెరుగుతాయి.

టేబుల్‌ సాల్ట్‌ వాడకం తగ్గించడం ఉత్తమం
Table Salt Side Effects : గతంలో సహజసిద్ధమైన ఉప్పు అమ్మేవారు. ఇప్పుడు ఉప్పుకు అయోడిన్‌, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్​ లాంటి మూలకాలను జోడించి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వాస్తవానికి శరీరంలోని ద్రవాలను సమతుల్యంలో ఉంచడానికి, నరాల ఆరోగ్యానికి, ఆహారంలోని పోషకాల్ని శరీరం స్వీకరించేందుకు, కండరాల పనితీరుకు సోడియం అవసరం. ఉప్పులో ఈ సోడియం ఉంటుంది. కానీ సోడియం మోతాదుకు మించి తీసుకుంటే అధిక రక్త పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు బీపీ పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది.

అవసరమే.. కానీ మోతాదుకు మించొద్దు :
Sodium Health Benefits And Risks : శరీరానికి సోడియం చాలా అవసరం. శక్తి ఉత్పత్తి, ప్రతీకణానికి ఆక్సీజన్‌ సరఫరా, కణాల కదలికలకు సోడియం కీలక పదార్థం. పొటాషియం, కాల్షియం కూడా ఈ విషయంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. జీవక్రియలకు ఈ మూలకాలు అత్యంత అవసరం. ఉప్పు ద్వారా శరీరానికి సోడియం లభిస్తుంది. కానీ ఆహారంలో ఉప్పును నియంత్రణలో పెట్టుకోవాలి. లేకపోతే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. రక్తపోటు ఎక్కువైతే కిడ్నీలు, గుండె, మెదడుపైన ప్రతికూల ప్రభావం పడుతుంది.

రోజుకు ఎంత ఉప్పు అవసరం
Table Salt Best Usage Dose : మన దేశంలో సహజంగానే ఉప్పు వాడకం ఎక్కువగా ఉంటుంది. కొందరైతే రుచి కోసం ఉప్పు మరీ ఎక్కువగా వేసుకుంటారు. కానీ సాధారణంగా ప్రతీ మనిషికి రోజుకు 3 గ్రాముల ఉప్పు మాత్రమే అవసరం ఉంటుంది. రుచి కోసం వేసుకునే ఉప్పు అనర్థాలకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు ఉన్నా, లేకున్నా ఎక్కువగా ఉప్పు తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6 శాతం పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే రోజుకు 2300 మిల్లీ గ్రాములకు మించి సోడియం తీసుకోవద్దని అమెరికన్​ హార్ట్‌ అసోసియేషన్‌ చెబుతోంది. 14 ఏళ్ల లోపు పిల్లలకు చాలా తక్కువ మోతాదులో ఉప్పు అందించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రోజుకు 2 గ్రాములకు మించి ఉప్పు తీసుకోవద్దని సూచిస్తోంది.

టేబుల్‌ సాల్ట్‌కు ప్రత్యామ్నాయం ఏంటి..?
Table Salt Alternatives : సాధారణంగా మనం ఉపయోగించే టేబుల్‌ సాల్ట్‌ అధికంగా తీసుకోవడం వల్ల అనర్థాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయం ఏమిటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కొంత మంది రాక్‌ సాల్ట్‌, పింక్‌సాల్ట్‌, హిమాలయన్‌ సాల్ట్‌ వాడితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. కానీ టేబుల్‌ సాల్ట్‌కు, ఇతర సాల్ట్‌లకు కూడా పెద్దగా తేడా లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. కాకపోతే పింక్‌సాల్ట్​, రాక్‌ సాల్ట్‌లలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, సల్ఫర్‌, క్రోమియం దాదాపు ఒక శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల పెద్దగా అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఏమీ ఉండవు. రాక్‌ సాల్ట్‌ మంచిది అనే భావనతో మోతాదుకు మించి తింటే సమస్యలు వస్తాయి.

హిమాలయన్ సాల్ట్​ ఆరోగ్య ప్రయోజనాలు
Himalayan Salt Benefits : మిగతా ఉప్పులతో పోల్చితే.. హిమాలయన్​ సాల్ట్ వల్ల కొన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా దీనిని తీసుకోవడం వల్ల.. శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో pH సమతౌల్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. నిద్రనాణ్యతను పెంచుతుంది. వృద్ధాప్య లక్షణాలను కూడా బాగా తగ్గిస్తుంది.

హిమాలయన్ ఉప్పు​ Vs​ సాధారణ ఉప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.