ETV Bharat / sukhibhava

గర్భిణులకు హైబీపీ.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

High BP for pregnant woman: చాలామంది గర్భిణీలు హైబీపీతో బాధపడుతుంటారు. మరి గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి రక్తపోటు తగ్గించే మందులు ఇవ్వొచ్చా..?

high bp for women
గర్భిణులకు హైబీపీ
author img

By

Published : Mar 6, 2022, 4:05 PM IST

High BP for pregnant woman: గర్భిణులకు అధిక రక్తపోటు ఉంటే మందులు ఇవ్వాలా? వద్దా? అనేది చాలాకాలంగా సందిగ్ధంగానే ఉండిపోయింది. రక్తపోటు తగ్గించే మందులు పిండం మీద దుష్ప్రభావాలు చూపొచ్చని అనుమానించటమే దీనికి కారణం.

అయితే గర్భిణుల్లో చాలామందికి అధిక రక్తపోటు చికిత్స సురక్షితమేనని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) తాజాగా పేర్కొంది. ఇది తల్లికి అధిక రక్తపోటు తీవ్రం కాకుండా చూస్తుందని.. పిండానికి, పుట్టిన తర్వాత శిశువులకు ముప్పేమీ పెరగకపోవచ్చని తెలిపింది. గర్భిణుల్లో రక్తపోటును సూచించే పై అంకె (సిస్టాలిక్‌ ప్రెషర్‌) 140, అంతకన్నా ఎక్కువుంటే అధిక రక్తపోటుగా భావిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా గర్భిణుల మరణాలకు రెండో అతిపెద్ద కారణమిదే. సమస్య తీవ్రమైతే గర్భిణిలో గుండెజబ్బులకు దారితీయొచ్చు. కాన్పు అయిన వెంటనే లేదా కొన్నేళ్ల తర్వాత కూడా గుండెజబ్బు తలెత్తొచ్చు. నెలలు నిండక ముందే కాన్పు కావొచ్చు.

పిల్లలు తక్కువ బరువుతో పుట్టొచ్చు. ఇలాంటి ఇబ్బందులు తప్పించటానికే చికిత్స ఉపయోగపడుతుంది. కానీ దశాబ్దాలుగా వీరికి మందుల వాడకంపై మల్లగుల్లాలు పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏహెచ్‌ఏ శాస్త్రీయ సూచన ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు మూలంగా సుమారు 5శాతం నుంచి 7శాతం మంది గర్భిణులు గర్భవాతం (ప్రిఎక్లాంప్సియా) బారినపడుతున్నారు. దీంతో 70వేల మంది గర్భిణులు, 5 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారని అంచనా.

ఇదీ చూడండి: పురుషుల్లో స్వప్న స్కలనం ఎందుకు జరుగుతుందంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.