ETV Bharat / sukhibhava

ఆరోగ్యంగా ఉన్నా శృంగార జీవితంలో మజా ఉండటం లేదా?.. కారణాలివే!

శృంగారం.. పేరు వింటేనే సిగ్గు పడతారు కొందరు. ఏకాంతంగా జరిగే ఈ క్రియలో తమ భాగస్వామిని సంతోషపరచాలని ఇటు అమ్మాయి అటు అబ్బాయి ఇద్దరు భావిస్తారు. ఇది జరగాలంటే ఇద్దరి మధ్య సరైన సఖ్యత అనేది చాలా ముఖ్యం. అది లేకుంటే ఏదో మొక్కుబడిగా శృంగారంలో పాల్గొన్నామా అన్నట్లు ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ఈ శృంగారమనే క్రీడలో పాల్గొంటే దాంపత్య జీవితం ఎటువంటి కోపతాపాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. అయితే ప్రస్తుత తరుణంలో కొందరు భార్యభర్తలు తమ శృంగార జీవితాన్ని ఆస్వాదించలేకుపోతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి పూర్తి ఆరోగ్యంతో ఉన్నా ఈ సెక్సువల్​ లైఫ్​ను ఎందుకు ఎంజాయ్​ చేయలేకపోతున్నామో మీకు తెలుసా?

Reasons Behind Not Enjoying Sexual Life
శృంగార జీవితాన్ని ఆస్వాదించకపోవడానికి గల కారణాలు
author img

By

Published : Mar 8, 2023, 11:07 AM IST

Updated : Mar 8, 2023, 1:05 PM IST

ఒక వ్యక్తి తన జీవితంలో అన్నింటిని సరైన స్థాయిలో ఆస్వాదించగలిగినప్పుడే పరిపూర్ణత సాధించినట్లు అవుతుంది. అందుకే జీవితంలో శృంగారంకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. శృంగారానికి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. సరైన శృంగార జీవితాన్ని అనుభవించే వాళ్లు మిగిలిన వాళ్లతో పోలిస్తే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. మరి ఇలాంటి శృంగార జీవితాన్ని చాలామంది ఆస్వాదించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.

శృంగారం అనేది కేవలం కోరికలను తీర్చుకునే ఒక శారీరక ప్రక్రియగానే వైద్యులు చెప్పరు. శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలో జరిగే అనేక రకాల రసాయనిక చర్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. అందుకే శృంగార జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని సలహా ఇస్తుంటారు. అయితే చాలామంది ఉద్యోగులు శృంగార జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నా.. శృంగార జీవితాన్ని ఆస్వాదించకపోవడానికి గల కారణాలివి..

ఉద్యోగస్థుల ఉరుకులు, పరుగుల జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పన్నకర్లేదు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనిలో బిజీగా గడుపుతారు. అన్నింటికి మించి మనం చేసే ఏ ఉద్యోగంలోనైనా పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ పని ఒత్తిడి వల్లనే ఉద్యోగస్థులు ఆరోగ్యంగా ఉన్నా శృంగార జీవితాన్ని ఆస్వాదించకపోవడానికి ప్రధాన కారణమని ప్రముఖ వైద్యులు డా.సమరం పేర్కొన్నారు.

ఉద్యోగులు తమ పనిని సమాయానికి పూర్తి చేయాలనే ఒత్తిడిలో ఉంటారని డా.సమరం వివరిస్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయని చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా డోపమిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుందని అంటున్నారు. మనిషిలో కోరికలను పెంచే ఈ డోపమిన్ ఉత్పత్తి తగ్గడం అనేది శృంగార జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకపోవడానికి ముఖ్య కారణంగా పరిగణించవచ్చు.

దీని అధిగమించాలంటే ముందు ఒత్తిడిని తగ్గించుకోవాలని డా.సమరం సలహా ఇస్తున్నారు. ఇందుకోసం ప్రతిరోజు సరైన ఆహారం తీసుకోవాలని, మనం తినే ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, ఒక పండు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే డ్రైఫ్రూట్స్ కూడా తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా సరైన ఆహారం అందితే ఎంజైమ్​ల ఉత్పత్తి తగిన మోతాదులో జరుగుతుందని వివరిస్తున్నారు.

ఉద్యోగులకు పని ఒత్తిడి కచ్చితంగా ఉంటుందని, కానీ ఆ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని డా.సమరం సూచిస్తున్నారు. ఇందుకోసం టైం మేనేజ్‌మెంట్‌, వర్క్ మేనేజ్‌మెంట్‌ గురించి తెలుసుకోని పాటించాలని అంటున్నారు. అలాగే శరీరానికి కావాల్సినంత నిద్రపోవాలని, రాత్రి పూట ఎక్కువ సేపు మెలుకువగా ఉండటం కూడా శృంగార జీవితం మీద ప్రభావం చూపుతుందని అంటున్నారు.

డోపమిన్ అంటే ఏమిటి?
డోపమిన్​ను ఫీల్ గుడ్ హార్మోన్ లేదంటే లవ్ హార్మోన్ అని అంటారు. ఇది మన మెదడులో తయారవుతుంది. దీని వల్ల సంతోషం, ఉత్సాహంతో పాటు శృంగారం లాంటి కోరికలు కలుగుతాయి. మామూలుగా అయితే ప్రతి ఒక్కరిలో డోపమిన్ వయసుకు తగ్గట్టుగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే ఊబకాయ సమస్యతో బాధపడే వారిలో, వ్యాయామం చేయని వారిలో, ఖాళీగా కుర్చీలకు అతుక్కునే వారిలో, ఎక్కువ ఒత్తిడికి గురయ్యే వారిలో, నిద్రలేకుండా నైట్ డ్యూటీలు చేసే వారిలో డోపమిన్ ఉత్పత్తి తగ్గుతుంది.

డోపమిన్ ఉత్పత్తిని పెంచుకోవడానికి శరీరానికి తగిన వ్యాయామం చేయాలి. తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందేలా జాగ్రత్తపడాలి. జంక్ ఫుడ్ ను పూర్తిగా తగ్గించాలి. ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ ను చేర్చుకోవాలి.

భార్యభర్తల మధ్య మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయి?
భార్యాభర్తల మధ్య మూడ్ స్వింగ్స్ రావడం అనేది సర్వసాధారణ విషయం. ఇద్దరిలో ఉండే ఈగోలు, పంతాలు, పట్టింపుల కారణంగా ఇవి వస్తుంటాయి. దంపతుల మధ్య సర్దుబాటు ధోరణి ఉంటే వీటిని దూరం పెట్టొచ్చు. తాను సంతోషంగా ఉండాలి, తన భాగస్వామిని సంతోషంగా ఉంచుకోవాలనే స్పృహతో ఉంటే సంసార జీవితం ఎంతో సాఫీగా సాగుతుందని తెలియజేస్తున్నారు డా.సమరం.

Last Updated : Mar 8, 2023, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.